ముంబై: ఏడాదిన్నరగా ప్రజలను పట్టి పీడించిన కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్టు కనిపించడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే మహమ్మారి ఒమిక్రాన్‌గా రూపంతరం చెంది మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతోంది. ఇప్పటికే ఒమిక్రాన్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా అల్లాడిపోతోంది. భారత్‌లోనూ ఒమిక్రాన్ అలజడి మొదలైంది. మరోవైపు గత నెల రోజులుగా దేశంలో రోజురోజుకి నమోదవుతున్న కేసుల సంఖ్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది.
ప్రత్యేకంగా మహరాష్ట్ర, ఢిల్లీలో కేసులు భారీగా నమోదవుతూ ఆ రాష్ట్రాల్ని వణికిస్తోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో.. మహరాష్ట్రలో కొత్తగా 36,265 కరోనా కేసులు, కొత్తగా 79 ఒమిక్రాన్ కేసులు నమోదైంది. ఈ స్థాయిలో కేసులు రావడంతో అక్కడి అధికారులు ఆందోళన చెందుతున్నారు. ముంబై నగరంలో కూడా ఒక్కరోజే 20,181 కరోనా కేసులు నమోదయ్యాయి.
చదవండి: Passengers From Italy Tested Positive Amritsar: కలకలం: ఒకే విమానంలో ప్రయాణించిన 125 మందికి కరోనా..
Comments
Please login to add a commentAdd a comment