సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని విశాఖ ఓడ రేవుకు భారీ నౌక వచ్చింది. సోమవారం పోర్ట్ ఇన్నర్ హార్బర్‌లోకి ఓస్లో అనే అతి భారీ రవాణా నౌక చేరింది. ఈ నౌక 229.20 మీటర్ల పొడవు, 38 మీటర్ల భీమ్ కలిగి ఉంది. గత ఏడాది భారీ నౌకలను ఇన్నర్ హార్బర్‌లోకి తీసుకు వచ్చేందుకు విశాఖ పోర్ట్ అధికారులు సింగపూర్‌లో సిములేషన్ స్టడీ నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ భారీ నౌక నేటి ఉదయం పోర్టు చేరగా.. అధికారలు ఏడో బెర్త్‌ను ఇచ్చారు. ఓస్లో భారీ రవాణా నౌక సౌత్ ఆఫ్రికాలోని రిచర్డ్ బే పోర్ట్ నుంచి బయలుదేరి స్టీమ్ కోల్‌తో విశాఖ పోర్టుకు చేరుకుంది. ఈ రవాణ(కార్గో) నౌక చూపరులను తెగ ఆకర్షిస్తోంది. పోర్టు చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఇటువంటి భారీ లోడ్‌ను కలిగిన కార్గో నౌక రావటం గొప్ప విషయమని ఓడరేవు అధికారులు భావిస్తున్నారు.
విశాఖపట్నం పోర్టుకు అతి భారీ రవాణా నౌక
Published Mon, Nov 30 2020 2:45 PM | Last Updated on Mon, Nov 30 2020 4:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment