Rohit Sharma is back in nets, playing lovely strokes: దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు డిసెంబర్ 16న పయనం కానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్ట్‌లు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. కాగా ఇప్పటికే టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం భారత టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
సౌత్ఆఫ్రికా పిచ్‌లు ఎక్కువగా పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి. ఈ నేపథ్యంలో త్రోడౌన్ స్పెషలిస్ట్‌లతో రోహిత్ శర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను రోహిత్ శర్మ ఇనస్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. అదే విధంగా టీమిండియా పేసర్ మహ్మద్ షమీ కూడా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన హోమ్ సిరీస్ నుంచి షమీకి విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే. ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్-26న భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment