
మొహాలీ వేదికగా శుక్రవారం భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తొలిసారిగా రోహిత్ శర్మ బాధ్యతలు చెపట్టనున్నాడు. దీంతో భారత టెస్ట్ క్రికెట్‌లో కొత్త శకం మొదలు కానుంది. ఇక రోహిత్ కెప్టెన్సీలో భారత్ వరుసగా మూడు పరిమిత ఓవర్ల సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఇక టెస్ట్‌ల్లో కూడా తన కెప్టెన్సీ మార్క్ చూపించాలని రోహిత్ తహ తహలాడుతున్నాడు.
ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ చెమటోడ్చుతున్నాడు. అయితే తన ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలను రోహిత్ ట్విటర్‌లో షేర్ చేశాడు. ఇక దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఓటమి అనంతరం భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలంకతో సిరీస్‌కు రోహిత్‌ను పూర్తి స్ధాయి భారత టెస్ట్ కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది.
భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లి, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్ సిరాజ్
చదవండి: Kohli 100th Test: కోహ్లి వందో టెస్టు.. వాట్సాప్ గ్రూప్‌లో రచ్చ మాములుగా లేదు
About time…🔴 🏏 pic.twitter.com/4cmFkwbpAg
— Rohit Sharma (@ImRo45) March 2, 2022
Comments
Please login to add a commentAdd a comment