
టీమిండియా తడ'బ్యాటు'
ఇండోర్: దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ తడబడుతోంది. టాపార్డర్లో రహానె (51) హాఫ్ సెంచరీ చేయడం మినహా ఇతర బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. బుధవారమిక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ 30 ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ధోనీ, భువనేశ్వర్ బ్యాటింగ్ చేస్తున్నారు. సౌతాఫ్రికా బౌలర్లు మోర్కెల్ రెండు, తాహిర్, రబడా, స్టెయిన్ తలా వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ధోనీసేన ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. 3 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (3) రబడా బౌలింగ్లో బౌల్డవయ్యాడు. ఆ తర్వాత ధవన్, రహానె జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. కాసేపటి తర్వాత ధవన్(23).. మోర్కెల్ బౌలింగ్లో అవుటవడంతో టీమిండియాకు కష్టాలు మొదలయ్యాయి. విరాట్ కోహ్లీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపో్యాడు. జట్టు స్కోరు 82 పరుగుల వద్ద కోహ్లీ (12) రనౌటయ్యాడు. క్రీజులో కుదురుకున్న రహానె కూడా హాఫ్ సెంచరీ చేసిన వెంటనే.. ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. ఇక రైనా రావడం ఆలస్యమన్నట్టు ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ బాటపట్టాడు. అక్షర్ పటేల్ (13).. స్టెయిన్ బౌలింగ్లో విక్కెట్ల ముందు దొరికిపోయాడు.