ఇండోర్:ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 10 ఓవరల్లో రెండు వికెట్ల నష్టానికి 56 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టీమిండియా విసిరిన 248 పరుగుల లక్ష్యాన్ని చేరే క్రమంలో దక్షిణాఫ్రికా ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(17),డీ కాక్(34) వికెట్లను కోల్పోయింది.
52 పరుగుల వద్ద డీకాక్ రెండో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. డు ప్లెసిస్(2), జేపీ డుమిని(5) క్రీజ్ లో ఉన్నారు. టీమిండియా స్పిన్నర్లు హర్భజన్ సింగ్, అక్షర్ పటేల్ కు తలో వికెట్ లభించింది.