దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్-2023కు ఐర్లాండ్ అర్హత సాధించింది. జింబాబ్వే మహిళలలో హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్-1లో ఐర్లాండ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.
ఐర్లాండ్ బ్యాటర్లలో ఓర్లా ప్రెండర్‌గాస్ట్(28), రెబెక్కా స్టోకెల్(26) పరుగులతో రాణించారు. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 6 వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో 133 పరుగులకే పరిమితమైంది. ఐర్లాండ్ బౌలర్లలో కెల్లీ, జేన్ మాగైర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్‌సన్, ముర్రీ తలా వికెట్ సాధించారు.
మరోవైపు సెమీఫైనల్-2లో థాయిలాండ్ మహిళలలపై విజయం సాధించిన బంగ్లాదేశ్ కూడా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఆర్హత సాధించింది. ఇక ఆదివారం అబూ దాబీ వేదికగా జరగనున్న ఫైనల్లో ఐర్లాండ్- బంగ్లాదేశ్ తలపడనున్నాయి. కాగా ఫైనల్‌కు చేరిన రెండు జట్లు కూడా టీ20 ప్రపంచకప్-2023లో అడుగుపెట్టనున్నాయి.
చదవండి: IND VS AUS: రోహిత్ ఆ షాట్లు ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు: సునీల్ గవాస్కర్
Comments
Please login to add a commentAdd a comment