మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయం బంగ్లాదేశ్ ఆటగాళ్లకు చాలా ప్రత్యేకం. ఈ గెలుపుతో బంగ్లా ఆటగాళ్లు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టడంతో పాటు 3836 రోజుల సుదీర్ఘ విరామానంతరం ఓ టీ20 వరల్డ్‌కప్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయం అనంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్లు చాలా భావోద్వేగానికి లోనయ్యారు.
10 ఏళ్ల అనంతరం వరల్డ్‌కప్‌లో లభించిన విజయం కావడంతో బంగ్లా కెప్టెన్ నిగార్ సుల్తానా కన్నీరు పెట్టుకుంది. బంగ్లాదేశ్ చివరి సారి 2014 టీ20 వరల్డ్‌కప్‌లో విజయం సాధించింది. నాడు బంగ్లాదేశ్ ఐర్లాండ్‌పై 17 పరుగుల తేడాతో గెలుపొందింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ వరుసగా 16 టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో ఓడింది. నాలుగు ఎడిషన్లలో (2016, 2018, 2020, 2023) ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు.
An emotional win 💯
Bangladeshi skipper Nigar Sultana reacts after a streak breaking victory 🙌 👇
https://t.co/aarEGSWApL— Cricket.com (@weRcricket) October 3, 2024
మ్యాచ్ విషయానికొస్తే.. టీ20 వరల్డ్‌కప్ 2024లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. షార్జా వేదికగా నిన్న (అక్టోబర్ 3) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. 36 పరుగులు చేసిన శోభన మోస్తరీ టాప్ స్కోరర్‌గా నిలువగా.. శాంతి రాణి (29), ముర్షిదా ఖాతూన్ (12), నిగార్ సుల్తానా (18), ఫాతిమా ఖాతూన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు.
తాజ్ నెహర్ 0, షోర్నా అక్తెర్ 5, రీతూ మోనీ 5 పరుగులు చేయగా.. రబేయా ఖాన్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచింది. స్కాట్లాండ్ బౌలర్లలో సస్కియా హోర్లీ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైస్, ఒలివియా బెల్, కేథరీన్ ఫ్రేసర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 120 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రీతూ మోనీ 2, రబేయా ఖాన్, మరుఫా అక్తెర్, నహిదా అక్తెర్, ఫాహిమా ఖాతూన్ తలో వికెట్ తీసి స్కాట్లాండ్‌ను కట్టడి చేశారు. స్కాట్లాండ్ సారా బ్రైస్ (49 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేథరీన్ బ్రైస్ (11), ఐల్సా లిస్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
చదవండి: బోణీ బాగుండాలి
Comments
Please login to add a commentAdd a comment