టీ20 వరల్డ్‌కప్‌ కోసం దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. జట్టులో శేషనీ నాయుడు | | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌ కోసం దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. జట్టులో శేషనీ నాయుడు

Published Tue, Sep 3 2024 5:26 PM | Last Updated on Tue, Sep 3 2024 5:38 PM

South Africa Has Announced Squad For Women's T20 World Cup 2024

యూఏఈ వేదికగా జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్‌ కోసం​ 15 మంది సభ్యుల దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (సెప్టెంబర్‌ 3) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా లారా వోల్వార్డ్ట్ ఎంపికైంది. వోల్వార్డ్ట్ కెప్టెన్‌గా ఇది తొలి వరల్డ్‌కప్‌. గత టీ20 ప్రపంచకప్‌లో సూన్‌ లస్‌ సౌతాఫ్రికాను ముందుండి నడిపించింది. ఆ టోర్నీలో సౌతాఫ్రికా ఫైనల్‌ వరకు చేరింది. 

అనంతరం సూన్‌ లస్‌ వైట్‌ బాల్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో వోల్వార్డ్ట్ సౌతాఫ్రికా టీ20 జట్టు పగ్గాలు చేపట్టింది. రానున్న వరల్డ్‌కప్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో సూన్‌ లస్‌, అయాబొంగా ఖాకా, మారిజాన్ కాప్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్ వంటి సీనియర్లతో పాటు అయాండా హ్లూబి, అన్నరీ డెర్క్‌సెన్ వంటి యువ ప్లేయర్స్‌ కూడా చోటు దక్కించుకున్నారు. 

సౌతాఫ్రికా వరల్డ్‌కప్‌ బృందంలో 18 ఏళ్ల యువ లెగ్‌ స్పిన్నర్‌ శేషనీ నాయుడు కూడా చోటు దక్కించుకుంది. అండర్‌-19 స్థాయిలో అద్భుత ప్రదర్శనల కారణంగా శేషనీ నాయుడు వరల్డ్‌కప్‌ జట్టులోకి వచ్చింది. ఇదే జట్టు వరల్డ్‌కప్‌కు ముందు పాకిస్తాన్‌తో జరిగే మూడో మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొంటుంది. ఈ సిరీస్‌ సెప్టెంబర్‌ 16-20 వరకు జరుగనుంది.

వరల్డ్‌కప్‌ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో సౌతాఫ్రికా గ్రూప్‌-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, స్కాట్లాండ్‌, ఇంగ్లండ్‌ జట్లు ఉన్నాయి. గ్రూప్‌-ఏలో భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీ అక్టోబర్‌ 3న మొదలవుతుంది. 

తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌ జట్లు తలపడతాయి. భారత్‌ అక్టోబర్‌ 4న తమ తొలి మ్యాచ్‌ (న్యూజిలాండ్‌) ఆడుతుంది. భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 6న దుబాయ్‌లో జరుగనుంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఏడు దేశాలు తమ జట్లను ప్రకటించాయి.

సౌతాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), అన్నేకే బాష్, తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నరీ డెర్క్‌సెన్, మైకే డి రిడర్, అయాండా హ్లూబి, సినాలో జాఫ్తా, మారిజాన్ కాప్, అయాబొంగా ఖాకా, సూన్‌ లస్‌, నాన్కులుకెకు మ్లాబా, శేషనీ నాయుడు, తుమీ సెఖుఖునే, క్లో ట్రయాన్
ట్రావెలింగ్ రిజర్వ్: మియాన్ స్మిట్

స్కాట్లాండ్‌: కేథరీన్‌ బ్రైస్‌ (కెప్టెన్‌), క్లో ఏబెల్‌, అబ్బి​ అయిట్కెన్‌ డ్రమ్మండ్‌, ఒలీవియా బెల్‌, సారా బ్రైస్‌, డార్సీ కార్టర్‌, ప్రియానాజ్‌ ఛటర్జీ, కేథరీన్‌ ఫ్రేసర్‌, సస్కియా హార్లీ, లోర్నా జాక్‌ బ్రౌన్‌, ఐల్సా లిస్టర్‌, అబ్తహా మక్సూద్‌, మెగాన్‌ మెక్‌కోల్‌, హన్నా రెయినీ, రేచల్‌ స్లేటర్‌

పాకిస్తాన్‌: ఆలియా రియాజ్‌, సదాఫ్‌ షమాస్‌, ఇరమ్‌ జావెద్‌, సిద్రా ఆమీన్‌, ఒమైమా సొహైల్‌, నిదా దార్‌, గుల్‌ ఫెరోజా, మునీబా అలీ, ఫాతిమా సనా (కెప్టెన్‌), సష్రా సంధు, డయానా బేగ్‌, సయెదా అరూబ్‌ షా, తుబా హసన్‌, తస్మియా రుబాబ్‌

ఆస్ట్రేలియా: ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌, ఆష్లే గార్డ్‌నర్‌, తహిల మెక్‌గ్రాత్‌, సోఫీ మోలినెక్స్‌, ఎల్లిస్‌ పెర్రీ, అన్నాబెల్‌ సథర్‌ల్యాండ్‌, గ్రేస్‌ హ్యారిస్‌, జార్జియా వేర్హమ్‌, అలైసా హీలీ (కెప్టెన్‌), బెత్‌ మూనీ, డార్సీ బ్రౌన్‌, కిమ్‌ గార్త్‌, అలానా కింగ్‌, మెగాన్‌ షట్‌, తైలా వ్లేమింక్‌

ఇండియా: స్మృతి మంధన, దయాళన్‌ హేమలత,జెమీమా రోడ్రిగెజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, ఎస్‌ సజనా, పూజా వస్త్రాకర్‌, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్‌, రిచా ఘోష్‌, యస్తికా భాటియా, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్‌ ఠాకూర్‌, రాధా యాదవ్‌

ఇంగ్లండ్‌: మైయా బౌచియర్‌, డేనియెల్‌ వ్యాట్‌, అలైస్‌ క్యాప్సీ, హీథర్‌ నైట్‌ (కెప్టెన్‌), సోఫీ డంక్లీ, డేనియెల్‌ గిబ్సన్‌, ఫ్రేయా కెంప్‌, నాట్‌ సీవర్‌ బ్రంట్‌, బెస్‌ హీత్‌, ఆమీ జోన్స్‌, లారెన్‌ బెల్‌, చార్లోట్‌ డీన్‌, సోఫీ ఎక్లెస్టోన్‌, సారా గ్లెన్‌, లిన్సే స్మిత్‌

వెస్టిండీస్‌: నెరిస్సా క్రాఫ్టన్‌, హేలీ మాథ్యూస్‌ (కెప్టెన్‌), డియాండ్రా డొట్టిన్‌, జైదా జేమ్స్‌, స్టెఫానీ టేలర్‌, ఆలియా అలెన్‌, చినెల్‌ హెన్రీ, అష్మిని మునీసర్‌, షెమెయిన్‌ క్యాంప్‌బెల్‌, చెడీన్‌ నేషన్‌, అఫీ ఫ్లెయర్‌, కరిష్మ రామ్‌హరాక్‌, మ్యాండీ మంగ్రూ, క్వియానా జోసఫ్‌, షమీలియా కాన్నెల్‌

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement