టీ20 వరల్డ్‌కప్‌ కోసం స్కాట్లాండ్‌ జట్టు ప్రకటన | Scotland Announced Squad For Their First Ever T20 World Cup | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌ కోసం స్కాట్లాండ్‌ జట్టు ప్రకటన

Published Mon, Sep 2 2024 6:22 PM | Last Updated on Mon, Sep 2 2024 7:39 PM

Scotland Announced Squad For Their First Ever T20 World Cup

యూఏఈ వేదికగా జరుగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌ కోసం​ 15 మంది సభ్యుల స్కాట్లాండ్‌ జట్టును ఇవాళ (సెప్టెంబర్‌ 2) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా కేథరీన్‌ బ్రైస్‌ ఎంపికైంది. వరల్డ్‌కప్‌లో స్కాట్లాండ్‌ గ్రూప్‌-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్లు ఉన్నాయి. 

గ్రూప్‌-ఏలో భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీ అక్టోబర్‌ 3న మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌ జట్లు తలపడతాయి. భారత్‌ అక్టోబర్‌ 4న తమ తొలి మ్యాచ్‌ (న్యూజిలాండ్‌) ఆడుతుంది. భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 6న దుబాయ్‌లో జరుగనుంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఐదు దేశాలు తమ జట్లను ప్రకటించాయి.

స్కాట్లాండ్‌: కేథరీన్‌ బ్రైస్‌ (కెప్టెన్‌), క్లో ఏబెల్‌, అబ్బి​ అయిట్కెన్‌ డ్రమ్మండ్‌, ఒలీవియా బెల్‌, సారా బ్రైస్‌, డార్సీ కార్టర్‌, ప్రియానాజ్‌ ఛటర్జీ, కేథరీన్‌ ఫ్రేసర్‌, సస్కియా హార్లీ, లోర్నా జాక్‌ బ్రౌన్‌, ఐల్సా లిస్టర్‌, అబ్తహా మక్సూద్‌, మెగాన్‌ మెక్‌కోల్‌, హన్నా రెయినీ, రేచల్‌ స్లేటర్‌

పాకిస్తాన్‌: ఆలియా రియాజ్‌, సదాఫ్‌ షమాస్‌, ఇరమ్‌ జావెద్‌, సిద్రా ఆమీన్‌, ఒమైమా సొహైల్‌, నిదా దార్‌, గుల్‌ ఫెరోజా, మునీబా అలీ, ఫాతిమా సనా (కెప్టెన్‌), సష్రా సంధు, డయానా బేగ్‌, సయెదా అరూబ్‌ షా, తుబా హసన్‌, తస్మియా రుబాబ్‌

ఆస్ట్రేలియా: ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌, ఆష్లే గార్డ్‌నర్‌, తహిల మెక్‌గ్రాత్‌, సోఫీ మోలినెక్స్‌, ఎల్లిస్‌ పెర్రీ, అన్నాబెల్‌ సథర్‌ల్యాండ్‌, గ్రేస్‌ హ్యారిస్‌, జార్జియా వేర్హమ్‌, అలైసా హీలీ (కెప్టెన్‌), బెత్‌ మూనీ, డార్సీ బ్రౌన్‌, కిమ్‌ గార్త్‌, అలానా కింగ్‌, మెగాన్‌ షట్‌, తైలా వ్లేమింక్‌

ఇండియా: స్మృతి మంధన, దయాళన్‌ హేమలత,జెమీమా రోడ్రిగెజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, ఎస్‌ సజనా, పూజా వస్త్రాకర్‌, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్‌, రిచా ఘోష్‌, యస్తికా భాటియా, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్‌ ఠాకూర్‌, రాధా యాదవ్‌

ఇంగ్లండ్‌: మైయా బౌచియర్‌, డేనియెల్‌ వ్యాట్‌, అలైస్‌ క్యాప్సీ, హీథర్‌ నైట్‌ (కెప్టెన్‌), సోఫీ డంక్లీ, డేనియెల్‌ గిబ్సన్‌, ఫ్రేయా కెంప్‌, నాట్‌ సీవర్‌ బ్రంట్‌, బెస్‌ హీత్‌, ఆమీ జోన్స్‌, లారెన్‌ బెల్‌, చార్లోట్‌ డీన్‌, సోఫీ ఎక్లెస్టోన్‌, సారా గ్లెన్‌, లిన్సే స్మిత్‌

వెస్టిండీస్‌: నెరిస్సా క్రాఫ్టన్‌, హేలీ మాథ్యూస్‌ (కెప్టెన్‌), డియాండ్రా డొట్టిన్‌, జైదా జేమ్స్‌, స్టెఫానీ టేలర్‌, ఆలియా అలెన్‌, చినెల్‌ హెన్రీ, అష్మిని మునీసర్‌, షెమెయిన్‌ క్యాంప్‌బెల్‌, చెడీన్‌ నేషన్‌, అఫీ ఫ్లెయర్‌, కరిష్మ రామ్‌హరాక్‌, మ్యాండీ మంగ్రూ, క్వియానా జోసఫ్‌, షమీలియా కాన్నెల్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement