బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు అర్హత సాధించాయి. అబుదాబిలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్లోకి ప్రవేశించి మిగిలిన రెండు బెర్త్‌లను సొంతం చేసుకున్నాయి.
సెమీఫైనల్స్‌లో చమరి అటపట్టు నాయకత్వంలోని శ్రీలంక జట్టు 15 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టును ఓడించగా... కేథరీన్ బ్రైస్ సారథ్యంలోని స్కాట్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది. తొలిసారి టి20 ప్రపంచకప్ టోటోర్నీకి అర్హత పొందిన స్కాట్లాండ్ ఈరోజు జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లో శ్రీలంకతో ఆడుతుంది.
టి20 ప్రపంచకప్ అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఢాకా, సిల్హెట్‌లో జరుగుతుంది. గత టి20 ప్రపంచకప్‌లో టాప్–6లో నిలిచిన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ నేరుగా ఈ టోటోర్నీకి అర్హత పొందాయి. ఆతిథ్య దేశం హోదాలో బంగ్లాదేశ్, ఐసీసీ ర్యాంక్ ప్రకారం పాకిస్తాన్ ఈ టోటోర్నీలో ఆడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment