వావ్‌ రషీద్‌.. 4 బంతుల్లో 4 వికెట్లు | Rashid Khan 1st bowler in T20I history to pick 4 wickets in 4 balls | Sakshi
Sakshi News home page

రషీద్‌ ‘హ్యాట్రిక్‌’ ప్లస్‌

Published Mon, Feb 25 2019 1:37 AM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

 Rashid Khan 1st bowler in T20I history to pick 4 wickets in 4 balls - Sakshi

డెహ్రాడూన్‌: అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (5/27) టి20 క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టి20ల్లో ‘హ్యాట్రిక్‌’ వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి ‘హ్యాట్రిక్‌ ప్లస్‌’ ప్రదర్శనతో ఔరా అనిపించాడు. ఆదివారం జరిగిన మూడో టి20లో 32 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలుపొందిన అఫ్గాన్‌ సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మొదట అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేయగా... ఐర్లాండ్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసి ఓడిపోయింది.

అఫ్గానిస్తాన్‌ జట్టులో మొహమ్మద్‌ నబీ (36 బంతుల్లో 81; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగాడు. హజ్రతుల్లా (17 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు. ఐర్లాండ్‌ బౌలర్లలో రాన్కిన్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన ఐర్లాండ్‌ 15.5 ఓవర్లలో 153/3 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. కానీ ఆ మరుసటి బంతి నుంచి ఐర్లాండ్‌ రాత మారింది. 16వ ఓవర్‌ వేసిన రషీద్‌ చివరి బంతికి కెవిన్‌ ఓబ్రియన్‌ (47 బంతుల్లో 74; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాటానికి తెరదించాడు. తర్వాత 18వ ఓవర్‌ తొలి మూడు వరుస బంతులకు డాక్రెల్‌ (18), గెట్‌కెట్‌ (2), సిమి సింగ్‌ (0)లను పెవిలియన్‌ చేర్చాడు.  

►7 అంతర్జాతీయ టి20ల్లో ‘హ్యాట్రిక్‌’ తీసిన ఏడో బౌలర్‌గా, తొలి స్పిన్నర్‌గా రషీద్‌ఖాన్‌ నిలిచాడు. గతంలో ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసిన ఆరుగురూ పేస్‌ బౌలర్లు (బ్రెట్‌ లీ, జాకబ్‌ ఓరమ్, టిమ్‌ సౌతీ,తిసారా పెరీరా, లసిత్‌ మలింగ, ఫహీమ్‌ అష్రఫ్‌) కావడం గమనార్హం.  

► 2అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రషీద్‌ ఖాన్‌ గుర్తింపు పొందాడు. గతంలో శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ మాత్రమే (2007 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై) ఈ ఘనత సాధించాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement