Ireland vs South Africa: Ireland Beat South Africa By 43 Runs In 2nd ODI In Dublin - Sakshi
Sakshi News home page

IRE Vs SA: దక్షిణాఫ్రికాకు షాకిచ్చిన ఐర్లాండ్‌

Published Wed, Jul 14 2021 6:47 AM | Last Updated on Wed, Jul 14 2021 1:09 PM

Ireland Thrilling Victory Against South Africa In 2nd ODI Dublin - Sakshi

డబ్లిన్‌: ఐర్లాండ్‌ క్రికెట్‌ జట్టు సంచలనం సృష్టించింది. వన్డేల్లో తొలిసారి దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. డబ్లిన్‌లో మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్‌ 43 పరుగుల తేడాతో నెగ్గింది. కెప్టెన్‌ బాల్బిర్నీ సెంచరీ (102; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు. దాంతో తొలుత ఐర్లాండ్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 290 పరుగులు చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 48.3 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. జానెమన్‌ మలాన్‌ (84; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), డుసెన్‌ (49; 2 ఫోర్లు) పోరాడినా చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ విఫలమవ్వడంతో సఫారీ జట్టుకు ఓటమి తప్పలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement