Ireland Vs South Africa 1st T20I: South Africa Beat Ireland By 21 Runs - Sakshi
Sakshi News home page

SA vs IRE T20: ప్రొటిస్‌కు చుక్కలు చూపించిన ఐర్లాండ్‌... ఓడినా ఆకట్టుకుంది

Published Thu, Aug 4 2022 7:49 AM | Last Updated on Thu, Aug 4 2022 10:44 AM

Ireland Lost Match By 11 Runs For-South Africa 1st T20 Match - Sakshi

ఇటీవలి కాలంలో ఐర్లాండ్‌ జట్టు వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతున్నా ప్రేక్షకులకు మాత్రం​ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ప్రత్యర్థి జట్లు భారీ లక్ష్యాలను విధిస్తున్నా ఏ మాత్రం భయపడకుండా ఐర్లాండ్‌ బ్యాటర్లు లక్ష్య ఛేదనకు ప్రయత్నించడమే అందుకు కారణం. ఐర్లాండ్‌ పోరాట పటిమ క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో ఐర్లాండ్‌ 21  పరుగులతో ఓడినా సౌతాఫ్రికాకు మాత్రం​ చుక్కలు చూపించింది.

212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ వికెట్‌ కీపర్‌ లోర్కన్‌ టక్కర్‌ (38 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 పరుగులు) రాణించగా.. చివర్లో జార్జ్‌ డాక్‌రెల్‌ (28 బంతుల్లో 43 పరుగులు, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఒక దశలో ఐర్లాండ్‌ విజయానికి చేరువగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు బ్యాటర్లు ఒకేసారి వెనుదిరగడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి 21 పరుగులతో ఓటమి పాలైంది.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్‌(53 బంతుల్లో 74, 10 ఫోర్లు, ఒక సిక్స్‌), మార్ర్కమ్‌ (27 బంతుల్లో 56 పరుగులు, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగారు. చివర్లో ప్రిటోరియస్‌ 7 బంతుల్లో 21 పరుగులు చేయడంతో ప్రొటిస్‌ 200 పరుగుల మార్క్‌ను క్రాస్‌ చేసింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో టి20 ఆగస్టు 5న(శుక్రవారం) జరగనుంది.

చదవండి: బార్బడోస్‌పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా మహిళలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement