నేటి నుంచి ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ | Asia Cup Football Tourney 2024 Starts From January 12 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ

Published Fri, Jan 12 2024 7:14 AM | Last Updated on Fri, Jan 12 2024 7:48 AM

Asia Cup Football Tourney 2024 Starts From January 12 - Sakshi

దోహా: ప్రతిష్టాత్మక ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ శుక్రవారం ఖతర్‌ రాజధాని దోహాలో మొదలవుతుంది. 24 జట్లు పోటీపడుతున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 10 వరకు జరుగుతుంది. మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు.

గ్రూప్‌ ‘బి’లో భారత్, సిరియా, ఉజ్బెకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లున్నాయి. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఖతర్‌తో లెబనాన్‌ తలపడుతుంది. వాస్తవానికి ఈ టోర్నీ గత ఏడాది చైనాలో జరగాల్సింది. అయితే కోవిడ్‌ కారణంగా చైనా ఆతిథ్యం నుంచి తప్పుకోగా ఖతర్‌కు ఈ టోర్నీని కేటాయించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement