కౌలాలంపూర్: ఆసియా కప్ ప్రధాన టోర్నీలో పాల్గొనే ఆరో జట్టుగా హాంకాంగ్ అర్హత సాధించింది. ఈ నెల 15 నుంచి యూఏఈలో జరిగే ఈ టోర్నీలో గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్‌లతో హాంకాంగ్ తలపడుతుంది.గురువారం ముగిసిన క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లో హాంకాంగ్ రెండు వికెట్ల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై విజయం సాధించింది. 24 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
ఓపెనర్ అష్ఫాఖ్ అహ్మద్ (51 బంతుల్లో 79; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, ఎజాజ్ ఖాన్‌కు 5, నదీమ్ అహ్మద్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం హాంకాంగ్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయీస్ ప్రకారం 179 పరుగులుగా నిర్దేశించారు. హాంకాంగ్ 23.3 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు చేసి విజయాన్నందుకుంది. నిజాకత్ ఖాన్ (20 బంతుల్లో 38; 6 ఫోర్లు, సిక్స్), కార్టర్ (32 బంతుల్లో 33; ఫోర్, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. హాంకాంగ్ గతంలో 2004, 2008 ఆసియా కప్‌లలో పాల్గొంది. మరోవైపు గ్రూప్ ‘బి’లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లు ఉన్నాయి.
ఆసియా కప్‌లో హాంకాంగ్
Published Fri, Sep 7 2018 12:51 AM | Last Updated on Fri, Sep 7 2018 12:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment