పీలే రికార్డును సమం చేసిన భారత స్టార్‌ ఫుట్‌బాలర్‌.. | Sunil Chhetri Equals Pele International Goal Scoring Record | Sakshi
Sakshi News home page

Sunil Chhetri: పీలే రికార్డును సమం చేసిన భారత స్టార్‌ ఫుట్‌బాలర్‌..

Published Tue, Oct 12 2021 8:45 PM | Last Updated on Tue, Oct 12 2021 10:01 PM

Sunil Chhetri Equals Pele International Goal Scoring Record - Sakshi

Sunil Chhetri Equals Pele Record: భారత ఫుట్‌బాల్‌ జట్టు సారథి సునీల్‌ ఛెత్రి అరుదైన రికార్డును సమం చేశాడు. శాఫ్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌లో గోల్‌ సాధించడం ద్వారా కెరీర్‌లో 77వ అంతర్జాతీయ గోల్‌ సాధించాడు. ఈ క్రమంలో ఫుట్‌బాల్‌ దిగ్గజం, బ్రెజిల్‌ మాజీ ఆటగాడు పీలే సరసన నిలిచాడు. పీలే 92 మ్యాచ్‌ల్లో 77 గోల్స్‌ సాధించగా, ఛెత్రి 123వ మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనతను సాధించాడు.

మొత్తంగా అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాళ్ల జాబితాలో పీలే, అలీ మబ్‌కౌట్‌‌(యూఈఏ)తో కలిసి మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో 122 గోల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సీ 79 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఛెత్రి రికార్డు గోల్‌ సాధించి భారత్‌కు 1-0తేడాతో విజయాన్ని అందించాడు. 
చదవండి: దేశం కోసం ధోని.. మెంటార్‌గా ఎలాంటి ఫీజు వద్దన్న లెజెండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement