
దోహా: ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సిరియాతో జరిగి న చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో సునీల్ ఛెత్రి నాయకత్వంలోని టీమిండియా 0–1 గోల్ తేడాతో ఓడిపోయింది. సిరియా తరఫున ఆట 76వ నిమిషంలో ఒమర్ ఖిరిబిన్ ఏకైక గోల్ చేసి తమ జట్టును గెలిపించాడు. ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయకుండానే, ఒక్క విజయం కూడా లేకుండా ని్రష్కమించింది.
తొలి మ్యాచ్‌లో భారత్ 0–2తో ఆస్ట్రేలియా చేతిలో, రెండో మ్యాచ్‌లో 0–3తో ఉజ్బెకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. ఏడు పాయింట్లతో ఆస్ట్రేలియా, ఐదు పాయింట్లతో ఉజ్బెకిస్తాన్ ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment