
భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి

39 ఏళ్ల సునిల్ ఛెత్రి.. ఈరోజు(మే 16) అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

మొత్తంగా తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో సునిల్ ఛెత్రి 150 మ్యాచ్‌లలో 94 గోల్స్ సాధించాడు.

భారత ఫుట్‌బాల్ కెప్టెన్‌గా సునిల్ ఛెత్రి సేవలు అందించాడు.

సునిల్ ఛెత్రి వ్యక్తిగత జీవితం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు.

సునిల్ ఛెత్రి లవ్‌స్టోరీ గురించి ఆసక్తికర విషయాలు

సునిల్ ఛెత్రి తన కోచ్, భారత మాజీ ఆటగాడు సుబ్రతా భట్టాచార్య కుమార్తె సోనమ్ భట్టాచార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

‘‘నాకు అప్పుడు 18 ఏళ్లు. ఆమెకు 15 ఏళ్లు. వాళ్ల నాన్న గురించి అందరితో గొప్పగా చెప్పేవారు.

ఆమె వాళ్ల నాన్న దగ్గరి నుంచి నా నా నెంబర్ దొంగతనం చేసి.. నాకు మెసేజ్‌లు పంపేది.

నేను సోనం.. నేను మీకు వీరాభిమానిని. మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను అని సందేశాలు పంపించేది. నాకు మాత్రం అప్పటికి తనెవరో తెలియదు.

అయితే, ఆమె మాట్లాడే విధానం నచ్చి ఓ రోజు తనను కలవాలని నిర్ణయించుకున్నా. తనని చూడగానే ఇంత చిన్నపిల్లా నాకు మెసేజ్‌లు పంపేది అనుకున్నా.

నువ్వింకా చిన్నదానివి. వెళ్లి బుద్ధిగా చదువుకో అని చెప్పి వెళ్లిపోయా. అయితే, తన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం మాత్రం మానలేకపోయా.

రెండున్నర నెలల తర్వాత మా కోచ్ ఫోన్ పనిచేయడం లేదని.. ప్రాబ్లం ఏమిటో చూడాలని నాకు ఇచ్చారు.

అప్పుడు మా కోచ్ వాళ్ల కూతురి నంబర్, నాకు మెసేజ్‌లు చేసే అమ్మాయి నంబర్ ఒకేలా అనిపించింది. అప్పుడే నాకు అర్థమైంది తను మరెవరో కాదు మా కోచ్ కూతురేనని!