sonam
-
‘సర్.. నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)
-
మళ్లీ సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష.. కారణమిదే!
ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దేశంలోని లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరవ షెడ్యూల్‌ను వెంటనే అమలు చేయాలని కోరుతూ లేహ్‌లో 21 రోజుల నిరాహార దీక్షకు దిగారు. మార్చి 7న ప్రారంభమైన ఈ నిరాహార దీక్ష 21 రోజుల పాటు కొనసాగనుంది. సోనమ్ వాంగ్‌చుక్ ఎవరు? సోనమ్ వాంగ్‌చుక్ వృత్తిరీత్యా ఇంజనీర్, ఆవిష్కర్తగా, వాతావరణ పరిరక్షణకు పాటుపడే వ్యక్తిగా పేరొందారు. లడఖ్‌లోని విద్యా వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తూ ‘స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడఖ్’ను స్థాపించారు. కృత్రిమ హిమానీనదాలను సృష్టించే మంచు స్థూప సాంకేతికతను రూపొందించారు. ఇందుకోసం ఆయన 2018లో రామన్ మెగసెసే అవార్డు, 2017లో గ్లోబల్ అవార్డ్ ఫర్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ అవార్డులను అందుకున్నారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్ అమలు డిమాండ్‌తో వాంగ్‌చుక్ మరోసారి నిరాహారదీక్షకు దిగారు. ఇవే డిమాండ్లతో గత ఏడాది జనవరిలో ఐదు రోజుల పాటునిరాహార దీక్ష చేశారు. అది కూడా 18 వేల అడుగుల ఎత్తులో -40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య నిరాహార దీక్షకు దిగారు. లడఖ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని వాంగ్‌చుక్ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. హిమాలయాల్లో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కిచెప్పిన ఆయన, ఈ అంశానికి ప్రభుత్వం తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. వాంగ్‌చుక్ తన దీక్షతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. త్రీ ఈడియట్స్ సినిమాలో.. అమీర్ ఖాన్, శర్మన్ జోషి, ఆర్ మాధవన్‌లు నటించిన ‘త్రీ ఇడియట్స్’లో అమీర్ ఖాన్ పోషించిన రాంచో పాత్ర వాంగ్‌చుక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం 2009లో విడుదలైంది. అప్పుడు వాంగ్‌చుక్ గురించి దేశంలోని అందరికీ తెలిసింది. అయితే ఈ సినిమా తన బయోపిక్ కాదని, వినోదం కోసం తన జీవితం నుండి ప్రేరణ పొందారని పలు సందర్భాల్లో వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. #SAVELADAKH #SAVEHIMALAYAS Sonam Wangchuk appeals to the world to live simply, starts #ClimateFast of 21 days (extendable till death) Please watch full video in English here:https://t.co/XHkcIdQQ7b#ILiveSimply #MissionLiFE #ClimateActionNow pic.twitter.com/KQi5EMro9X — Sonam Wangchuk (@Wangchuk66) March 6, 2024 -
Dr. Sonam Kapse: వడ్డించేవారు మనవారే
డౌన్ సిండ్రోమ్, ఆటిజమ్, మూగ, బధిర... వీరిని ‘మనలో ఒకరు’ అని అందరూ అనుకోరు. వీరికి ఉద్యోగం ఇవ్వాలంటే ‘వాళ్లేం చేయగలరు’ అని విడిగా చూస్తారు. కాని ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో అంతర్భాగమే అంటుంది డాక్టర్ సోనమ్ కాప్సే. కేవలం దివ్యాంగులనే స్టాఫ్‌గా చేసుకుని ఆమె నడుపుతున్న రెస్టరెంట్ పూణెలో విజయవంతంగా నడుస్తోంది. ‘ఇక్కడంతా వడ్డించేవారు మనవారే’ అంటుంది సోనమ్. పుణెలో ఆంకాలజిస్ట్‌గా, కేన్సర్ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్న సోనమ్ కాప్సేకు బాల్యం నుంచి రకరకాల వంట పదార్థాలను రుచి చూడటం ఇష్టం. ‘మా అమ్మానాన్నలతో విదేశాలకు వెళ్లినప్పుడు హోటళ్ల లో రకరకాల ఫుడ్ తినేదాన్ని. మంచి రెస్టరెంట్ ఎప్పటికైనా నడపాలని నా మనసులో ఉండేది’ అంటుంది సోనమ్. అయితే ఆ కల వెంటనే నెరవేరలేదు. కేన్సర్ స్పెషలిస్ట్‌గా బిజీగా ఉంటూ ఆమె ఆ విషయాన్నే మర్చిపోయింది. యూరప్‌లో చూసి ‘నేను ట్రావెలింగ్‌ని ఇష్టపడతాను. యూరప్‌కు వెళ్లినప్పుడు ఒక బిస్ట్రో (కాకా హోటల్ లాంటిది)లో ఏదైనా తిందామని వెళ్లాను. ఆశ్చర్యంగా అక్కడ సర్వ్ చేస్తున్నవాళ్లంతా స్పెషల్ వ్యక్తులే. అంటే బుద్ధి మాంద్యం, వినికిడి లోపం, అంగ వైకల్యం, మూగ... ఇలాంటి వాళ్లు. వాళ్లంతా సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ తీసుకుంటున్నారు. కస్టమర్లు వారికి ఎంతో సహకరిస్తున్నారు. ఇటువంటి వారి జీవితం మర్యాదకరంగా గడవాలంటే వారిని ఉపాధి రంగంలో అంతర్భాగం చేయడం సరైన మార్గం అని తెలిసొచ్చింది. మన దేశంలో సహజంగానే ఇలాంటివారికి పని ఇవ్వరు. అందుకే మన దేశంలో కూడా ఇలాంటి రెస్టరెంట్లు విరివిగా ఉండాలనుకున్నాను. ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్నాయి కానీ, నేను కూడా ఇలాంటి రెస్టరెంట్ ఒకటి ఎందుకు మొదలు పెట్టకూడదు... అని ఆలోచించాను. అలా పుట్టినదే ‘టెర్రసిన్’ రెస్టరెంట్. టెర్రసిన్ అంటే భూమి రుచులు అని అర్థం. పొలం నుంచి నేరుగా వంటశాలకు చేర్చి వండటం అన్నమాట’ అందామె. 2021లో ప్రారంభం పూణెలో బిజీగా ఉండే ఎఫ్.సి.రోడ్లో స్పెషల్ వ్యక్తులే సిబ్బందిగా 2021లో కోటిన్నర రూపాయల ఖర్చుతో ‘టెర్రసిన్’ పేరుతో రెస్టరెంట్ ప్రారంభించింది సోనమ్. ఇందు కోసం స్పెషల్ వ్యక్తులను ఎంపిక చేసి వారికి ట్రయినింగ్ ఇచ్చింది. ‘వారితో మాట్లాడటానికి మొదట నేను ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఆర్డర్ తీసుకోవడం, సర్వ్ చేయడం వంటి విషయాల్లో ట్రయినింగ్ ఇచ్చాం. కస్టమర్లు సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ చెప్పొచ్చు లేదా మెనూలో తాము ఎంచుకున్న ఫుడ్‌ను వేలితో చూపించడం ద్వారా చెప్పొచ్చు. అయితే ఆటిజమ్ వంటి బుద్ధిమాంద్యం ఉన్నవాళ్లను ఉద్యోగంలోకి పంపడానికి కుటుంబ సభ్యులు మొదట జంకారు. వారిని ఒప్పించడం కష్టమైంది. ఒకసారి వారు పనిలోకి దిగాక ఆ కుటుంబ సభ్యులే చూసి సంతోషించారు. మా హోటల్‌ను బిజీ సెంటర్లో పెట్టడానికి కారణం మా సిబ్బంది నలుగురి కళ్లల్లో పడి ఇలాంటివారికి ఉపాధి కల్పించాలనే ఆలోచన ఇతరులకు రావడానికే. మా హోటల్ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పుడు ఆదాయంలో ఉంది. త్వరలో దేశంలో మరో ఐదుచోట్ల ఇలాంటి హోటల్స్ పెట్టాలనుకుంటున్నాను’ అని తెలిపింది సోనమ్. వారూ మనవారే సమాజ ఫలాలకు అందరూ హక్కుదారులే. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం, ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలి. ఇలాంటి ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. కొందరు పదిలో రెండు ఉద్యోగాలైనా ఇలాంటివారికి ఇస్తున్నారు. సోనమ్ లాంటి వారు పూర్తి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ రంగంలో ఇంకా ఎంతో జరగాల్సి ఉంది. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం... వారిని ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలనే ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. రెస్టరెంట్లో సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ తీసుకుంటున్న వెయిటర్ -
19 ఏళ్లకే గర్భం దాల్చా.. ఇండియా వదిలి పోయాను: నటి
మూడు దశాబ్దాల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది సోనమ్. త్రిదేవ్, విశ్వాత్మ, అజూబా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అర్ధాంతరంగా సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన సోనమ్ దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత రీఎంట్రీకి రెడీ అయ్యింది. ఓ ఓటీటీ షోతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సోనమ్.. సినిమాలు వదిలేయడానికి గల కారణాలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ► లాక్డౌన్లో ఓటీటీలో షోలు, సిరీస్‌లు చూశాను. ఇలాంటివి నేనెందుకు చేయకూడదు అనిపించింది. వెంటనే నా శరీరంపై దృష్టి పెట్టాను. ముప్పై కిలోలు తగ్గాను. నన్ను నేను మెరుగుపపర్చుకున్నాను. ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అయ్యాను. 32 సంవత్సరాల తర్వాత మళ్లీ నటనారంగంలోకి వస్తుంటే కొంత సంతోషంగా మరికొంత భయంగానూ ఉంది. ► 1997లో ఇండియా వదిలివెళ్లిపోయాను. పద్నాలుగేళ్లకే పని చేయడం ప్రారంభించా. 19వ ఏటనే గర్భం దాల్చాను. జీవితంలో కష్టసుఖాలెన్నో చూశాను. లైఫ్ అన్నాక అన్నింటినీ దాటుకుంటూ పోవాలి కదా.. కానీ ఇప్పటికీ నేను ఇండస్ట్రీకి తిరిగి రావాలని కోరుకుంటుంటే హ్యాపీగా ఉంది. ► మంచి కథ దొరికితే దానికి తగ్గట్లు ఎలాంటి పాత్రనైనా చేస్తా. 50 ఏళ్లకే వయసైపోలేదని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని మహిళలకు చాటిచెప్పాలని ఉంది. ఎందుకంటే యాభై ఏళ్లు వచ్చాయంటే మహిళలు వారు అప్పటిదాకా ఉన్న ఐడెంటిటీని కోల్పోతున్నారు. నేనేమీ నా ముడతలను చూసి భయపడట్లేదు. నా లుక్స్‌కు తగ్గట్లు పాత్రలు వస్తే అలానే నటిస్తాను. చదవండి: రజనీకాంత్‌కు షాకింగ్ రెమ్యునరేషన్.. అన్ని కోట్లా? -
ఆ లేఖలే అమ్మాయిల నుదుటి రాతల్ని మార్చాయి
‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక’ అన్నారు ప్రజాకవి కాళోజీ. కేంద్రం మహిళల వివాహ వయసును పెంచడానికి జయా జైట్లీ నేతృత్వంలో 2020 జూన్ నాలుగున టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అయితే, కేంద్రంలో కదలిక తీసుకొచ్చే ప్రయత్నానికి బీజం వేసింది మాత్రం కొందరు యువతుల పోస్ట్‌కార్డ్ రాతలే!. చదవండి: 21 ఏళ్లు వచ్చాకే అమ్మాయి పెళ్లి పాట్నా (బీహార్) వాసి సోనమ్ కుమారి, హిసార్(హరియాణా)కు చెందిన 16 ఏళ్ల పూనమ్ మిథర్వాల్ లాంటి అమ్మాయిలు చేపట్టిన పోస్ట్‌కార్డ్ ఉద్యమం కేంద్రం నిర్ణయాన్ని ప్రభావితం చేసిన అంశాల్లో ఒకటని చెప్పొచ్చు. 19 ఏళ్ల సోనమ్‌కు ఇంట్లో వాళ్లు పెళ్లిచేయబోయారు. చదువుతానని, ఇప్పుడే పెళ్లి వద్దని నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. ఒత్తిడిని తట్టుకోలేక సోనమ్ ఈ ఏడాది ఆగస్టులో ఇంటిని వదిలి ఢిల్లీకి వెళ్లింది. ఉద్యోగం చేస్తూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదువును కొనసాగిస్తోంది. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా వివాహ వయసు 21 ఏళ్లకు పెంచాలని ప్రధాని మోదీకి ఆగస్టులోనే లేఖ రాసింది. చదవండి: పెళ్లికి అమ్మాయి కనీస వయసు పెంపు! మన దగ్గరే ఇలాగనా? సోనమ్ సంధించిన లేఖ హరియాణాలో ఏంతోమంది బాలికలను ఆలోచింపజేసింది. నిశ్శబ్ద ఉద్యమం మొదలైంది. వందలాది మంది బాలికలు ప్రధానికి లేఖలు రాశారు. పూనమ్ ఆగస్టులో ఒకరోజు కాలేజీ ముగిశాక నేరుగా పోస్ట్ ఆఫీసుకు వెళ్లింది. ఆమెతో పాటే మరో ఆరుగురు స్నేహితురాళ్లు కూడా. ‘మోదీ జీ.. అమ్మాయిల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచండి’ అని పోస్ట్‌కార్డుపై హిందీలో చాలా క్లుప్తంగా తమ విజ్ఞప్తికి అక్షర రూపమిచ్చారు. ‘నా స్నేహితురాళ్లు, తెలిసిన వాళ్లలో చాలామందికి 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేసేసి పంపించి వేశారు వాళ్ల కుటుంబసభ్యులు. చదువు మాన్పించారు. వివాహ వయసు పెంచితే తల్లిదండ్రులను ఒప్పించి ఉన్నత చదువులు కొనసాగించడానికి వీలుంటుంది’ అని పూనమ్ వాదన. –నేషనల్ డెస్క్, సాక్షి -
స్టార్లుగా ఊహించుకుంటున్నారు: సోనం మాలిక్‌కు నోటీసు
న్యూఢిల్లీ: తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన మరో మహిళా రెజ్లర్ సోనమ్ మాలిక్ టోక్యో బయల్దేరడానికి ముందు పాస్‌పోర్ట్‌ను డబ్ల్యూఎఫ్ఐ కార్యాలయంలో తీసుకోవాలని అధికారులు చెప్పారు. ఆమె మాత్రం తన పాస్‌పోర్ట్‌ను తీసుకొని రావాలని ఏకంగా భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులను ఆజ్ఞాపించింది. రెజ్లర్ల క్రమశిక్షణా రాహిత్యం ఆ నోటా ఈ నోటా భారత ఒలింపిక్ సంఘానికి (ఐఓఏ) తెలిసింది. రెజ్లర్లు ప్రవర్తన నియమావళిని అతిక్రమించడం ఏమాత్రం రుచించని ఐఓఏ... ‘మీ క్రీడాకారుల్ని మీరు నియంత్రించలేరా’ అని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను తలంటింది. ఈ క్రమంలో సోనమ్ మాలిక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ‘కెరీర్ మొదట్లోనే వీళ్లు తమను తాము స్టార్లుగా ఊహించుకుంటున్నారు. అందుకే విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారు. ఇదే మాత్రం క్షమించరానిది’ అని డబ్ల్యూఎఫ్ఐ అధికారి ఈ సందర్భంగా చెప్పారు. ఇక టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా క్రమశిక్షణ రాహిత్యం, విపరీత ధోరణితో వ్యవహరించిన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. టోక్యో ఒలింపిక్స్‌లో జాతీయ కోచ్ సౌమ్యదీప్ రాయ్ సలహాలు తీసుకునేందుకు నిరాకరించిన భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ క్రీడాకారిణి మనిక బత్రాపై భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చదవండి: Neeraj Chopra: గర్ల్‌ఫ్రెండ్ విషయంపై నీరజ్ చోప్రా క్లారిటీ -
‘టోక్యో’కు అన్షు, సోనమ్
అల్మాటీ (కజకిస్తాన్): ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్లో రెండో రోజు భారత్‌కు రెండు బెర్త్‌లు ఖరారయ్యాయి. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత యువ రెజ్లర్లు అన్షు మలిక్ (57 కేజీలు), సోనమ్ మలిక్ (62 కేజీలు) అద్భుతం చేశారు. హరియాణా రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల అన్షు, 18 ఏళ్ల సోనమ్ తమ విభాగాల్లో ఫైనల్‌కు చేరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. 57 కేజీల ఫైనల్లో అన్షు 4–7తో ఖాన్‌గోరుజుల్ బోల్డ్‌సైఖాన్ (మంగోలియా) చేతిలో ఓటమి చవిచూసి రజతం సాధించగా... 62 కేజీల ఫైనల్లో జియా లాంగ్ (చైనా)తో తలపడాల్సిన సోనమ్ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో జియా లాంగ్‌కు స్వర్ణం, సోనమ్‌కు రజతం లభించాయి. అయితే మిగతా మూడు విభాగాల్లో భారత రెజ్లర్లకు నిరాశ ఎదురైంది. సీమా బిస్లా (50 కేజీలు) నాలుగో స్థానంలో నిలువగా... నిషా (68 కేజీలు), పూజా (76 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించారు. ఫైనల్‌కు చేరిన వారికి మాత్రమే టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌లు లభిస్తాయి. -
ఈ సోనమ్ ఎవరో తెలుసా
బంజారాహిల్స్: నగరంలోని హిజ్రాలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. ఓ పక్క సమావేశం జరుగుతోంది.. వివిధ ప్రాంతాలకు చెందిన హిజ్రాలు హాజరవుతున్నారు.. ఇంతలో ఓ యువతి వయ్యారంగా నడుచుకుంటూ స్టేషన్లోకి అడుగు పెట్టింది. ఏదన్నా సమస్యపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిందేమోనని పోలీసు సిబ్బంది.. స్టేషన్‌కు వచ్చిన మరికొందరు ఫిర్యాదుదారులు ఆమె వైపే చూస్తున్నారు. ఆమె తిన్నగా కౌన్సిలింగ్ హాల్లోకి వెళ్లేసరికి అంతా షాకయ్యారు. ‘నేనూ హిజ్రానే.. పేరు సోనమ్.. ఫ్రమ్ ముంబై’ అని చెప్పేసరికి అంతా అవాక్కయ్యారు. -
బావామరదళ్లతో...
‘మంచి కథతో ఎవరైనా సంప్రదిస్తే సౌత్‌లో నటించడానికి సిద్ధమే’ - హిందీ హీరోయిన్లు ఎప్పుడూ చెప్పే డైలాగ్ ఇది. సోనమ్ కపూర్ కూడా పలు సందర్భాల్లో ఈ డైలాగ్ చెప్పారు. ఈ బ్యూటీ కోరుకున్న కథ లభించినట్టుంది. తమిళ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులను పలరించనున్నారట. తమిళంలో తొలి చిత్రమైనా, ఈ చిత్రంలో నటించే హీరో ధనుష్‌తో తొలి చిత్రం కాదు. ఎందుకంటే.. హిందీ సినిమా ‘రాంజనా’లో ధనుష్ సరసన సోనమ్ నాయికగా నటించారు. ఆ సినిమా ధనుష్‌కి మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు మరదలు సౌందర్యా రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించనున్న సినిమాతో సోనమ్ కోలీవుడ్‌కి పరిచయం కానున్నారట. ఈ సినిమాకి ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ (చందమామకు నా మీద ఏం కోపం) టైటిల్ ఖరారు చేశారు. చందమామ లాంటి సోనమ్‌కి ఈ సినిమా ఎలాంటి పేరు తీసుకొస్తుందో! -
ప్రేమ్ సందడి
-
ముంబాయిలో సందడి చేసిన సల్మాన్,సోనమ్
-
నోయిడాలో సల్మాన్‌ఖాన్,సోనమ్ కపూర్ సందడి
-
ఖాదీ ఫ్యాషన్‌షోలో ’సల్మాన్’
-
మాంసం నిషేధంపై మరో సెలబ్రిటీ..
ముంబైలో మాంసం నిషేధం నిర్ణయం పై బాలీవుడ్ సెలబ్రిటీలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా లాంటి స్టార్ హీరోయిన్స్ ఈ విషయం పై ట్విట్టర్లో స్పందించగా, మరో బాలీవుడ్ సెలబ్రిటీ రిషీ కపూర్ కూడా బ్యాన్పై ఘాటుగా స్పందించారు. 'జాగో ఇండియా జాగో, మతం పేరుతో దేశాన్ని ఎటు వైపు తీసుకెళుతున్నారు. రాధే మా, మాంసం పై నిషేధం ఏంటి గోల..?' అంటూ కామెంట్ చేశాడు. ఇప్పటికే సోనమ్, సోనాక్షిలా కామెంట్స్ పై దుమారం రేగుతుండటంతో రిషీకపూర్ కామెంట్స్ ఆ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. గతంలో స్వామిజీలపై ఇలాంటి కామెంట్సే చేసిన రిషీకపూర్, ఈ సారి మాత్రం కాస్త ఆలస్యంగా స్పందించారు. 'ఆల్ ఈజ్ వెల్' సినిమా తరువాత యురోపియన్ టూర్‌కి వెళ్లిన కపూర్ తిరిగి ముంబై చేరుకోగానే ప్రస్తుత పరిస్థితులపై స్పందించారు. Jaago India Jaago. Stop all this in the name of religion.All taking the nation for a ride. Kabhi Radhe baby Kabhi meat ban! Kya ho raha hai? — rishi kapoor (@chintskap) September 9, 2015