బావామరదళ్లతో... | sonam new movie in Kolivud is nilavukku en mel ennadi kobam | Sakshi
Sakshi News home page

బావామరదళ్లతో...

Published Sun, Oct 9 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

బావామరదళ్లతో...

బావామరదళ్లతో...

 ‘మంచి కథతో ఎవరైనా సంప్రదిస్తే సౌత్‌లో నటించడానికి సిద్ధమే’ - హిందీ హీరోయిన్లు ఎప్పుడూ చెప్పే డైలాగ్ ఇది. సోనమ్ కపూర్ కూడా పలు సందర్భాల్లో ఈ డైలాగ్ చెప్పారు. ఈ బ్యూటీ కోరుకున్న కథ లభించినట్టుంది. తమిళ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులను పలరించనున్నారట. తమిళంలో తొలి చిత్రమైనా, ఈ చిత్రంలో నటించే హీరో ధనుష్‌తో తొలి చిత్రం కాదు. ఎందుకంటే.. హిందీ సినిమా ‘రాంజనా’లో ధనుష్ సరసన  సోనమ్ నాయికగా నటించారు.
 
 ఆ సినిమా ధనుష్‌కి మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు మరదలు సౌందర్యా రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించనున్న సినిమాతో సోనమ్ కోలీవుడ్‌కి పరిచయం కానున్నారట. ఈ సినిమాకి ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ (చందమామకు నా మీద ఏం కోపం) టైటిల్ ఖరారు చేశారు. చందమామ లాంటి సోనమ్‌కి ఈ సినిమా ఎలాంటి పేరు తీసుకొస్తుందో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement