సోనమ్
బంజారాహిల్స్: నగరంలోని హిజ్రాలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. ఓ పక్క సమావేశం జరుగుతోంది.. వివిధ ప్రాంతాలకు చెందిన హిజ్రాలు హాజరవుతున్నారు.. ఇంతలో ఓ యువతి వయ్యారంగా నడుచుకుంటూ స్టేషన్‌లోకి అడుగు పెట్టింది. ఏదన్నా సమస్యపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిందేమోనని పోలీసు సిబ్బంది.. స్టేషన్‌కు వచ్చిన మరికొందరు ఫిర్యాదుదారులు ఆమె వైపే చూస్తున్నారు. ఆమె తిన్నగా కౌన్సిలింగ్ హాల్‌లోకి వెళ్లేసరికి అంతా షాకయ్యారు. ‘నేనూ హిజ్రానే.. పేరు సోనమ్.. ఫ్రమ్ ముంబై’ అని చెప్పేసరికి అంతా అవాక్కయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment