Bhattacharya
-
‘సర్.. నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)
-
నాలెడ్జ్ క్యాపిటల్‌గా తిరుపతి
తిరుపతి సిటీ : తిరుపతి ఇప్పటికే నాలెడ్జ్ హబ్‌గా పేరుగాంచిందని, త్వరలో నాలెడ్జ్ క్యాపిటల్‌గా తయారవుతుందని ఐజర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్య చెప్పారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో గురువారం సుస్థిర గ్రామీణ జీవనోపాధి సాధనపై జరిగిన జాతీయ సదస్సుకు దేశంలోని పలు వెటర్నరీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వీసీలు, విభాగాల డైరెక్టర్లు, డీన్లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ అనేక ఏళ్లుగా జంతు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. దేశంలో జీవనోపాధికోసం గ్రామీణ ప్రజలు సగటున రోజుకు 30 మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారని, సుస్థిర గ్రామీణ జీవనోపాధికోసం వర్సిటీలు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. జంతు సంరక్షణపై దృష్టి సారించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి మూలాలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సుకు హాజరైన వీసీలు మాట్లాడుతూ మొబైల్ యాప్స్ ద్వారా రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించి వారి ప్రమాణాలను మెరుగుపర్చాలని సూచించారు. పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై జాతీయ సదస్సు దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. పరిశోధనల సంపుటిని ఆవిష్కరించి, అనంతరం శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు పలు అంశాలపై వక్తలు అవగాహన కల్పించారు. సదస్సులో కర్ణాటక బీదర్ వర్సిటీ వీసీ కేసీ వీరన్న, తిరుపతి పద్మావతీ మహిళా వర్సిటీ వీసీ డి భారతి తదితరులు పాల్గొన్నారు. -
అంబానీ, అదానీలకే పెద్దపీట
సూర్యాపేట: అంబానీ, అదానీల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ అధ్యక్షురాలు మాలినీ భట్టాచార్య ఆరోపించారు. పేటలో కొనసాగుతున్న ఐద్వా రాష్ట్ర మూడవ మహాసభల సందర్భంగా శనివారం రెండవరోజు ప్రతినిధుల సభను ప్రారంభించి ఆమె మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూరేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కార్మి క చట్టాల సవరణ నిలిపివేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 27న జరిగే భారత్‌బంద్‌లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ, ఈ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు, భూస్వాముల ప్రయోజనాలకు కట్టబెట్టాలని చూస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా మరో సాయుధ పోరాటాన్ని నిర్వహించాలన్నారు. అంతకుముందు ఐద్వా రాష్ట్ర మహాసభల ప్రారంభ సూచకంగా ఐద్వా జెండాను మల్లు స్వరాజ్యం ఆవిష్కరించారు. మహిళా ఉద్యమ అమరవీరుల చిత్రపటాల వద్ద ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియధావలే, జాతీయ అధ్యక్షురాలు మాలినీ భట్టాచార్య తదితరులు నివాళులర్పించారు. గత మహాసభ నుంచి ఈ మహాసభ వరకు మృతిచెందిన వారందరికీ నివాళి అర్పిస్తూ ఐద్వా రాష్ట్ర నాయకురాలు సమీనా అఫ్రోజ్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మూడేళ్ల ఐద్వా నివేదికను సభలో ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.సాయిబాబా, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు రవి నాయక్, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి శ్రీమతి పాల్గొన్నారు. -
ప్రధాని హోదాలో కాన్వాయ్‌ను ఇష్టపడలేదు!
ప్రభూ! నన్ను అంత ఎత్తుగా ఎదగనీయకు నేల మీద గడ్డి పరకలు కనపడనంత ఎత్తుకు ఎదగనీయకు ఇతరులను గుండెకు హత్తుకోలేనంత కాఠిన్యాన్ని నాకివ్వకు. వాజ్‌పేయి రాసుకున్న ఓ కవిత సారాంశమిది. కవితల్లో రాసుకున్నట్లే జీవించారాయన. అందుకు ఉదాహరణ ప్రధానమంత్రి హోదాలో కాన్వాయ్‌ను ఇష్టపడకపోవడమే. ‘రోడ్లు నిర్మానుష్యంగా ఉంటే కర్ఫ్యూ గుర్తుకొస్తోంది. ప్రజాస్వామ్యంలో పాలకులు పాలితులకు దగ్గరగా ఉండాలి. వాళ్లను చూస్తూ పాలించాలి. అప్పుడే ప్రజల అవసరాలేంటో తెలుస్తాయి. ప్రజలు కనిపించకుండా ఇలా పోలీసు వాహనాల మధ్య ప్రయాణించడం ఏమిటి?’ అనిన మనిషి ఆయన. అధికారాన్ని దర్ప ప్రదర్శన కోసం వినియోగించని గొప్ప సిద్ధాంతం ఆయనది. అదే సిద్ధాంతాన్ని ఒంటబట్టించుకున్నారు ఆయన దత్తపుత్రిక నమిత భట్టాచార్య. వాజ్‌పేయి ఏదీ చెప్పి ఆమెను పెంచలేదు, తాను ఆచరించారు, నమిత అనుసరించారు. ఆమె వ్యక్తిత్వం అలాగే వికసించింది. నాన్నే.. నచ్చిన రాజకీయవేత్త ఇరవయ్యవ శతాబ్దం చివరి దశాబ్దం. వాజ్‌పేయి జాతి నిర్మాణంలో కీలకంగా పనిచేస్తున్న సమయమది. దేశానికి ప్రధానమంత్రి హోదాలో అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు. అప్పుడు కూడా నమిత స్కూలు టీచరుగా తన ఉద్యోగంలోనే కొనసాగారు. తండ్రి ప్రధాని పదవిని అంది వచ్చిన అవకాశంగా మలుచుకోవాలనుకోకపోవడం ఆమె ఔన్నత్యం. వ్యక్తిగా అత్యున్నత స్థాయి గౌరవాలు ఆమెకు పువ్వుకు తావిలా వచ్చి చేరడానికి కారణం ఆమె తనను తానుగా తీర్చిదిద్దుకున్న విధానమే. ఇష్టమైన రాజకీయవేత్త ఎవరని అడిగితే... మరో మాటకు అవకాశం లేకుండా ‘మా నాన్న’ అని వాజ్‌పేయి పేరు చెప్తారామె. నాన్నకు నచ్చాకే అల్లుడయ్యాడు నమిత ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్‌లో కామర్స్ గ్రాడ్యుయేషన్‌లో ఉండగా అదే కాలేజ్‌లో ఎకనమిక్స్ చదువుతున్న రంజన్ భట్టాచార్య పరిచయమయ్యారు. రంజన్ తరచుగా వాజ్‌పేయి ఇంటికి వస్తుండేవారు. రంజన్ని వాజ్‌పేయి ఆదరంగా చూసేవారు, అంతే నిశితంగానూ గమనించేవారు. ఇరవై ఏళ్లకే తల్లిదండ్రులను పోగొట్టుకోవడంతోనో ఏమో కానీ వాజ్‌పేయిలో తండ్రిని వెతుక్కున్నారు రంజన్. వాజ్‌పేయిని నమిత పిలిచినట్లే ‘బాప్జీ’ అని పిలిచేవారు. నమిత పట్ల రంజన్ ప్రేమను అంగీకరించి అతడిని అల్లుడుగా స్వీకరించారు వాజ్‌పేయి. వాళ్ల పరిచయం పెళ్లి పీటలను చేరడానికి దాదాపుగా ఏడేళ్లు పట్టింది. వాజ్‌పేయి మనసు చూరగొని నమితను పెళ్లి చేసుకున్నాడీ బెంగాల్ బాబు. ఈ మూడూ నచ్చిన వ్యాపకాలు వాజ్‌పేయి తరచుగా రంజన్ పేరును మర్చిపోయేవారట. ఆ సంగతిని స్నేహితులు, బంధువులతో నమిత నవ్వుతూ చెప్పేవారు. అంతేకాదు, భట్టాచార్యకు బదులుగా బెనర్జీ, ముఖర్జీ అని, ఒక్కోసారి ఏ పేరూ గుర్తుకు రాక, బెంగాలీబాబు అని కూడా పిలిచేవారని చెప్తుంటారామె. నమితకు పుస్తకాలు చదవడం, రుచిగా వండడం, కొత్త ప్రదేశాలకు ప్రయాణించడం ఇష్టమైన వ్యాపకాలు. రంజన్ భట్టాచార్యకు హైవే మీద లాంగ్ డ్రైవ్ చేయడం ఇష్టం. భార్యాభర్తల్లో ఒకరి ఇష్టాలు మరొకరి ఇష్టాలతో పడుగుపేకల్లా అల్లుకు పోవడం చాలా అరుదుగానే ఉంటుంది. బహుశా వాజ్‌పేయి అన్నేళ్లపాటు అంత నిశితంగా గమనించింది.. ఇద్దరి మధ్య అలాంటి అనుగుణ్యత (కంపాటిబిలిటీ) ఉందా లేదా అనే కావచ్చు. నచ్చలేదేమో అనుకున్నారు!! నమిత భట్టాచార్యను అందమైన ప్రేమ పందిరికి అల్లుకున్న సన్నజాజి తీగ అని చెప్పవచ్చు. ఆమె తాను పెరగాల్సిన పందిరిని తానే పటిష్టం చేసుకున్నారు. ఎలాగో తెలియాలంటే.. ఒక్కసారి గ్వాలియర్‌లో వాజ్‌పేయి గ్రాడ్యుయేషన్ రోజుల్లోకి వెళ్లాలి. వాజ్‌పేయి తొలిచూపులోనే రాజ్‌కుమారి హస్కర్ని ప్రేమించారు. ఆమె చక్కని రూపాన్ని కళ్లలో నింపుకుని ఆశువుగా తనకు తానే కవితలు చెప్పుకున్నారు. ధైర్యం చేసి ఓ రోజు ఉత్తరం రాసి లైబ్రరీ పుస్తకంలో పెట్టి, ఆ పుస్తకాన్ని రాజ్కుమారికిచ్చారు. ఆమె నుంచి రిప్లై వస్తుందని ఎంతగానో ఆశించారు. మనసు పరిపరివిధాలుగా ఆలోచిస్తోంది. అసలే పెద్దింటమ్మాయి. గొప్ప వంశ చరిత్ర ఉన్న ఇంటి ఆడపిల్లను తనలాంటి మధ్య తరగతి కుర్రాడికిచ్చి పెళ్లి చేయడానికి వాళ్ల పెద్దవాళ్లు ఒప్పుకోరేమో.. అనుకున్నారు. పెద్దవాళ్లు ఒప్పుకోరని తెలిసే రాజ్‌కుమారి తన ఉత్తరానికి రిప్లై ఇవ్వడం లేదేమో.. అని కూడా అనుకున్నారు. బహుశా ఆమెకి తన మీద ప్రేమ లేకపోవచ్చు. తనతో జీవితాన్ని పంచుకోవాలని కోరుకోవడం లేదేమో.. అని కూడా. ఇలా ఆలోచిస్తూనే రోజులు గడిచిపోతున్నాయి. నచ్చిన విషయం ఒక జ్ఞాపకం భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశవిభజన సమయంలో చెలరేగిన అల్లర్లు గ్వాలియర్‌ను కూడా కుదిపేశాయి. రాజ్‌కుమారి తండ్రి కుటుంబాన్ని ఢిల్లీకి మార్చారు. రాజ్‌కుమారి రాసిన ప్రత్యుత్తరం లైబ్రరీ పుస్తకంలో ఉందని వాజ్‌పేయికి తెలియకనే ఆ పుస్తకం లైబ్రరీకి చేరిపోయింది. ఆయన ఆ రోజు తెరవని ఆ పుస్తకం, చదవని ఆ ఉత్తరం ఆయన జీవితపథాన్ని మార్చేసింది. అవివాహితుడిగా మిగిల్చింది. ఆ సంగతి ఏళ్ల తర్వాత బయటపడింది.రాజ్‌కుమారి విషయానికి వస్తే.. తన నిర్ణయం తన చేతిలో లేని పరిస్థితి. తండ్రి పెళ్లి సంబంధం నిశ్చయం చేశాడు. మనసు విప్పి వాజ్‌పేయి గురించి చెప్పడానికి, మరికొంత సమయం ఇమ్మని అడగడానికి రాజ్‌కుమారికి తల్లి లేదు. సవతి తల్లితో పంచుకోలేకపోయింది. ఇక పెద్దవాళ్లు నిర్ణయించిన పెళ్లి చేసుకున్నారామె. కాలానికి న చ్చి మళ్లీ కలిపింది పంతొమ్మిది వందల నలభైలలో తొలిచూపులు అలా విఫలమయ్యాయి. వాళ్లిద్దరూ తిరిగి కలుసుకునే అవకాశాన్ని కాలం అరవైలకు నిర్ణయించింది. అప్పటికి వాళ్లు దూరమై పదిహేనేళ్లు దాటిపోయింది. అయితే వారిని దూరం చేసిన ఢిల్లీనే మలిసారి కలిపిన వేదికైంది. అప్పుడు వాజ్‌పేయి జనసంఘ్ నాయకులు, రాజ్యసభ సభ్యులు. రాజ్‌కుమారి.. భర్త బ్రిజ్ నారాయణ్ కౌల్, ఇద్దరు కూతుళ్లు నమిత, నందితలతో కలిసి జీవిస్తున్నారు. బ్రిజ్ నారాయణ్ కౌల్ ఢిల్లీ యూనివర్సిటీ రామ్జాస్ కాలేజ్‌లో ఫిలాసఫీ ప్రొఫెసర్. కౌల్ కూడా జనసంఘ్ సిద్ధాంతాలు, వాజ్‌పేయి ఉద్దేశాలతో ఏకీభవించేవారు. ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయత భావాన్ని పెంపొందించడానికి వాజ్‌పేయి చేస్తున్న ప్రయత్నాల్లో సహకరించేవారు. వాజ్‌పేయి తరచుగా యూనివర్సిటీ కెళ్తుండేవారు. విద్యార్థులతో చర్చల్లో పాల్గొనేవారు. అలా నమిత వాజ్‌పేయిని తరచుగా చూసేవారు. అనేకమంది విద్యార్థులు స్ఫూర్తిపొందినట్లే వాజ్‌పేయిలోని ఆదర్శవాదం, ఔన్నత్యం, తాత్త్వికత, నిరాడంబరత నమితను కూడా ప్రభావితం చేశాయి. నమితను పుత్రికగా దత్తత తీసుకోవాలనే వాజ్‌పేయి అభిలాషను నమిత కూడా అంతే ఇష్టంగా స్వీకరించారు. పెద్దయిన తర్వాత... తూర్పు–పడమరలుగా మిగిలిపోయిన జీవితాలను ఒక చూరు కిందకు తీసుకురావడానికి ఆమె నిట్టాడిగా మారారు. ‘గున్ను’ (నమితను ముద్దుగా పిలుచుకునే పేరు) మాటను కాదనేవారు కాదు వాజ్‌పేయి. అవివాహితుడుగా ఉండిపోయిన వాజ్‌పేయి కుటుంబాన్ని విస్తరింపచేశారు నమిత. చెల్లెలు నందిత, తల్లి, తండ్రి, అమ్మమ్మ అందరూ ఒకే ఇంట్లో ఉండే ఏర్పాటు చేశారు. పెళ్లితో భర్త రంజన్ కూడా అదే ఇంటికి వచ్చారు. హోదా జీవితం నచ్చదు పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్‌ల మధ్య స్పష్టమైన విభజన రేఖ గీసుకున్న వేదాంతి వాజ్‌పేయి. ఆయన పెంపకంలో నమిత కూడా అలాంటి తత్వాన్నే ఒంటపట్టించుకున్నారు. నాలుగేళ్ల కిందట నమిత తల్లి రాజ్‌కుమారి మరణించినప్పుడు సోనియా గాంధీ సహా, జాతీయ నాయకులు అనేక మంది వాజ్‌పేయి ఇంటికి వెళ్లి నమితను పరామర్శించారు. వాజ్‌పేయికి భారతరత్న వచ్చినప్పుడు అభినందనల వెల్లువను కూడా తండ్రి తరఫున ఆమే స్వీకరించారు. అయినా సరే ఆమె తన జీవితాన్ని అత్యంత సాధారణంగా జీవించడానికే ఇష్టపడుతుంటారు. ఆమె ఇంటర్వ్యూ కోసం జాతీయ మీడియా ప్రయత్నించినప్పుడూ ఆమె సున్నితంగా తిరస్కరించేవారు. ఆమె మీడియాకు కనిపించిన సందర్భాలు రెండే రెండు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె తండ్రితోపాటు బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించారు. అప్పుడు అధికారికంగా విడుదలైన ఫొటోలో తొలిసారి కనిపించారు. తర్వాత ఇప్పుడు వాజ్‌పేయి మరణించినప్పుడు మాత్రమే. ‘కూతురు’ చేసింది జాతికి నచ్చింది సంప్రదాయాన్ని పాటిస్తూ, సంప్రదాయానికి కొత్తబాట వేసిన దార్శనికత నమితది. తండ్రి పార్థివ దేహానికి ముందు నిప్పుకుండతో నడిచి, ఆయన చితికి స్వయంగా నిప్పంటించి నివాళులర్పించారు. నమిత భట్టాచార్యకంటే ముందు కూడా తల్లిదండ్రులకు అంతిమ సంస్కారాలు చేసిన కూతుళ్లున్నారు. కానీ అదే పని నమిత చేయడంతో జాతి మొత్తానికీ దిశానిర్దేశం చేసినట్లయింది. తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు నిర్వహించే అర్హత కొడుకులకు తప్ప కూతుళ్లకు ఉండదనే కరడు కట్టిన అభిప్రాయాన్ని సమూలంగా తుడిచేశారు నమిత. ఈ సందర్భంలో నమితను ‘కొడుకు లాంటి కూతురు’ అని చెప్పుకుంటారేమో. కానీ కొడుకా– కూతురా అని కాదు చూడాల్సింది. తల్లిదండ్రుల బాధ్యతను నిర్వర్తించిన బిడ్డ మాత్రమే. ఒక మహోన్నత వ్యక్తిత్వ ఆలయ ప్రాంగణంలో విరిసిన శాంతి కుసుమం ఆమె. తండ్రి ఆచరించిన, ఆయన నుంచి తాను నేర్చుకున్న సిద్ధాంతాలను కూతురు నీహారికలో చూసుకోవడానికి ప్రయత్నిస్తున్న తల్లి. తల్లి కశ్మీరీ పండిట్ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మూలాలున్న కశ్మీర్‌లోనే నమిత తల్లి రాజ్‌కుమారి కౌల్ మూలాలు కూడా ఉన్నాయి. కశ్మీర్ పండిట్ కుటుంబం వీరిది. మోతీలాల్ కుటుంబంతో దాయాది బంధం ఉన్న కుటుంబం. ఇందిరాగాంధీకి సెకండ్ కజిన్ అవుతారు రాజ్‌కుమారి. ఆమె తండ్రి గోవింద్నారాయణ్ హస్కర్... సింధియా రాజకుటుంబంలో విద్యాశాఖ వ్యవహారాలు చూసేవారు. అలా ఆమె గ్వాలియర్‌లో చదివారు. అదే లక్ష్మీబాయ్ కాలేజ్ (విక్టోరియా కాలేజ్) లో వాజ్‌పేయి కూడా చదివారు. భర్త బెంగాలీ నమిత భర్త రంజన్ భట్టాచార్యది హిమాచల్ ప్రదేశ్‌లోని మండి. రాజకీయ నేపథ్యం ఉన్న విద్యావంతుల కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. బెంగాలీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రంజన్ పట్నాలో పెరిగారు. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్‌లో ఎకనమిక్స్ తర్వాత, ఒబెరాయ్ స్కూల్లో హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా చేసి, అదే ఒమెరాయ్ గ్రూప్‌లో జనరల్మేనేజర్గా ఉద్యోగం చేశారు. తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి, మనాలిలో హోటల్‌తో వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. – వాకా మంజులారెడ్డి -
సినిమా చూశాకే టికెట్ కొనండి!
► పీవీఆర్‌తో ఒప్పందం చేసుకున్న ఈపే లేటర్ ► క్రెడిట్‌పై రైలు టికెట్ల బుకింగ్ కోసం ఆర్సీటీసీతో కూడా ► నగదు చెల్లింపులకు 14 రోజుల గడువు; డీఫాల్టయితే నెలకు 3% పెనాల్టీ ► ఏడాదిలో బస్సు, విమాన టికెట్లు కొనుగోలు సౌకర్యం కూడా.. ► ఇప్పటివరకు రూ.13 కోట్ల నిధుల సమీకరణ ► ‘స్టార్టప్ డైరీ’తో ఈపే లేటర్ కో–ఫౌండర్ భట్టాచార్య హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మనకు తెలిసిందల్లా సినిమాకెళ్లాలంటే ఆన్లైన్లోనో లేక థియేటర్ కౌంటర్‌లోనో టికెట్ కొని వెళ్లడం. కానీ, ఇపుడు మరో కొత్త సౌకర్యమూ అందుబాటులోకి వచ్చిందండోయ్!! టికెట్ అవసరం లేకుండా ముందైతే సినిమా చూసేయండి.. ఆ తర్వాతే టికెట్ ధర చెల్లించమంటోంది ‘ఈపే లేటర్’ సంస్థ. ఒక్క సినిమానే కాదు... రైలు ప్రయాణం, గ్రాసరీ, షాపింగ్, టూరిజం ట్రావెల్ ఇలా అన్ని రకాల సేవలకూ ఇదే మంత్రమంటోంది. దీనికోసం ఐఆర్సీటీసీ, పీవీఆర్, ఇండియామార్ట్, జాప్‌నౌ, గుడ్‌బాక్స్, ఈట్రావెల్ స్మార్ట్, ఆక్సిజన్, పేవరల్డ్ వంటి 5 వేల ఆన్లైన్, ఆఫ్‌లైన్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది కూడా. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్ ఆర్కో భట్టాచార్య మాటల్లోనే... ఈపే లేటర్ గురించి చెప్పే ముందు అసలు మన దేశంలో ఈ–కామర్స్ సంస్థల క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) విభాగం గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ విభాగాన్ని లక్ష్యంగా చేసుకొనే ఈపే లేటర్ ఆరంభమైంది గనక. దేశీ ఈ– కామర్స్ సంస్థల లావాదేవీల్లో 67% వాటా సీఓడీదే.కారణం మనం కొనే వస్తువుల్ని ప్రత్యక్షంగా చూస్తే తప్ప చెల్లింపులు చేయం. అలా అని ఆర్డరిచ్చిన ఉత్పత్తులు డెలివరీ కాగానే క్యాష్ ఇస్తే సరిపోదు. ఇక్కడ కూడా చెల్లింపుల ను కూడా మరింత సులువుగా, సౌకర్యవంతంగా చేయాలనే లక్ష్యంతోనే 2015 డిసెంబర్లో ముంబై కేంద్రం గా.. స్నేహితులు అక్షయ్ సక్సే నా, ఉదయ్ సోమయాజులుతో కలిసి ఈపే లేటర్‌ను ప్రారం భించాం. ‘‘ముందైతే సేవలందుకోండి. తర్వాతే నగదును చెల్లించండి’’ ఇదే మా వ్యాపార సూత్రం. డేటా సైన్స్, అనలిటిక్స్‌తో కస్టమర్ల ఎంపిక.. ఈపే లేటర్ సేవలను వినియోగించుకోవాలంటే ముందు ఈ–మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఆధార్, పాన్ కార్డు వివరాలు వెల్లడించాలి. అలా ఇచ్చిన కస్టమర్ల పాత లావాదేవీల చరిత్ర, సామాజిక మాధ్యమాల్లో ప్రవర్తించే తీరు, ఇతరత్రా మార్గాల ద్వారా తనిఖీ చేస్తాం. డేటా సైన్స్, అనలిటిక్స్ ద్వారా వారి చరిత్రను విశ్లేషిస్తాం. ఎంపికైన కస్టమర్ల మొబైల్‌కు వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. తర్వాతి నుంచి ఈపే లేటర్‌తో ఒప్పందం చేసుకున్న ఆన్లైన్, ఆఫ్‌లైన్ సంస్థల సేవలను క్రెడిట్ రూపంలో వినియోగించుకునే వీలుంటుంది. త్వరలో బస్సు, విమాన టికెట్లు కూడా.. ప్రస్తుతం 5 వేల ఆన్లైన్, ఆఫ్‌లైన్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఏడాదిలో 1.50 లక్షల సంస్థలకు చేరుకోవాలన్నది లక్ష్యం. ఆయా సంస్థల సేవలను వినియోగించుకున్నాక 14 రోజులలోగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించకపోతే నెలకు 3 శాతం పెనాల్టీ ఉంటుంది. బీ2బీ కంపెనీల్లో కనిష్ట లావాదేవీ రూ.25 వేలు, బీ2సీ కంపెనీల్లో కనిష్ట లావాదేవీ రూ.2,500. క్రెడిట్‌పై గ్రాసరీ, షాపింగ్ వంటి సంస్థల సేవలే కాదు. రైల్వే టికెట్లనూ కొనొచ్చు. ఇందుకోసం ఐఆర్సీటీసీతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలో బస్సు, విమాన టికెట్లనూ అందుబాటులోకి తెస్తాం. ఏపీ, తెలంగాణ వాటా 15 శాతం.. ప్రస్తుతం 30 మంది ఉద్యోగులు, 50 లక్షల మంది కస్టమర్లున్నారు. రోజుకు 2,500–3,000 లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 45%, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 15%. ఈపే లేటర్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ మీద మా ఒప్పంద సంస్థ నుంచి 2–2.5 శాతం వరకు కమీషన్ తీసుకుంటాం. ప్రతి నెలా 30 శాతం వ్యాపార వృద్ధిని సాధిస్తున్నాం. గతంలో సీడ్ రౌండ్లో భాగంగా దేశీయంగా ముగ్గురు ఇన్వెస్టర్ల నుంచి రూ.13.3 కోట్లు సమీకరించాం. ఏడాదిలో మరో విడత నిధులను సమీకరిస్తాం. -
పవర్ఫుల్ లేడీస్ లిస్టులో ఆ ముగ్గురు
-
పవర్ఫుల్ లేడీస్ లిస్టులో ఆ ముగ్గురు
న్యూయార్క్ : ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ అధినేత చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖా శర్మ ఈ ముగ్గురు బ్యాంకర్లు ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫార్చ్యూన్ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మహిళల్లో చోటుదక్కించుకున్నారు. అమెరికాకు బయట దేశాలను ఆధారంగా చేసుకుని 50 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ఫార్చ్యూన్ రూపొందించింది. ఈ జాబితాలో బ్యాంకో స్యాన్టాన్డర్స్ అధినేత అన బోటిన్ మొదటి స్థానంలో నిలిచారు. ఆర్థికపరంగా, రాజకీయ పరంగా ఎలాంటి ఒడిదుడుకులు నెలకొన్నా ఎల్లప్పుడూ నెంబర్ వన్ స్థానంలో కొనసాగే, యూరోజోన్‌లో అతిపెద్ద బ్యాంకు బ్యాంకో స్యాన్టాన్డర్స్కు బోటిన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ లిస్టులో భట్టాచార్య రెండో స్థానంలో నిలవగా.. కొచ్చర్ 5వ స్థానం, శర్మ 19 స్థానాన్ని దక్కించుకున్నారు. భారత్‌లోని అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐకు మూడేళ్లు చీఫ్‌గా నిర్వర్తించిన క్రమంలో భట్టాచార్య ప్రొపైల్ పెరిగిందని ఫార్చ్యూన్ పేర్కొంది. రఘురామ్ రాజన్ అనంతరం ఆర్బీఐ గవర్నర్‌గా భట్టాచార్యను నియమిస్తారనే వార్తలు ఓ దశలో ఊపందుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఐదు అనుబంధ సంస్థలతో పాటు భారతీయ మహిళ బ్యాంకును ఎస్బీఐలో విలీనం చేసుకునే ప్రతిపాదన కూడా ఆమెనే తీసుకోవడం విశేషం. ప్రైవేట్ రంగ బ్యాంకులో అతిపెద్దదైన ఐసీఐసీఐకు కొచ్చర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ, ప్రత్యర్థి బ్యాంకులు ఆమెను ఓ అద్భుతమైన మహిళగా భావిస్తారని ఫార్చ్యూన్ పేర్కొంది. బ్యాంకు డిజిటల్ వృద్ధిని పెంచడానికి, మహిళా ఉద్యోగులు ఓ ఏడాది ఇంటినుంచే పనిచేసుకునే అవకాశం వంటి వాటికి బాగా కృషిచేసినట్టు తెలిపింది. దేశీయంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న యాక్సిస్ బ్యాంకుకు శిఖా శర్మ సీఈవోగా ఉన్నారు. మొండిబకాయిలతో యాక్సిస్‌కు ఇబ్బందులున్నా, శర్మ వాటిని అధిగమించడానికి అన్నీ చర్యలు చేపట్టినట్టు ఫార్చ్యూన్ పేర్కొంది. -
సిలిగురిపైనే సర్వత్రా ఆసక్తి
బెంగాల్ రెండో దశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం ♦ 56 నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్ ♦ సిలిగురిలో మాజీ మంత్రి భట్టాచార్యతో బైచుంగ్ ఢీ ♦ సుజాపూర్‌లో మామ, మేనకోడలు హోరాహోరీ కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రెండో దశ భాగంగా ఆదివారం 56 నియోజక వర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం సాయంత్రం ఈ నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది. మొత్తం 383 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా అలీపుర్దౌర్, జల్పాయ్గురి, డార్జ్లింగ్, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, మాల్దా, బీర్బూమ్ జిల్లాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 1.2 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్-లెఫ్ట్ ఫ్రంట్, బీజేపీలు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా, డార్జిలింగ్, జల్పాయ్గురి జిల్లాల్లో గూర్ఖా జనముక్తి మోర్చా పోటీలో ఉంది. ఈ రెండు జిల్లాల్లో గూర్ఖాల ఓట్లు కీలకం కానున్నాయి. సిలిగురి, సుజాపూర్ల పైనే ఆసక్తి రెండో దశలో ప్రధానంగా అందరి దృష్టి డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి నియోజకవర్గంపైనే ఉంది. గతేడాది జరిగిన సిలిగురి కార్పొరేషన్ ఎన్నికల్లో తృణమూల్‌ను లెఫ్ట్- కాంగ్రెస్ కూటమి మట్టికరిపించింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు తృణమూల్ ఈసారి తీవ్రంగా శ్రమించింది. భారత్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియాను సిలిగురిలో మోహరించింది. భూటియా ప్రధాన ఆకర్షణగా నిలవడంతో పాటు యువ ఓటర్లను ఆకట్టుకుంటాడని ఆశలు పెట్టుకుంది. లెఫ్ట్ నుంచి సిలిగురి మేయర్, మాజీ మంత్రి అశోక్ భట్టాచార్య గట్టి పోటీనిస్తున్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటిని ఒక్క తాటిపైకి తెచ్చి తృణమూల్‌కు ఆయన షాక్‌నిచ్చారు. సిలిగురి ఫార్ములాగా ఈ వ్యూహం పేరుపొందింది. అదే వ్యూహాన్ని అనుసరిస్తూ బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్- లెఫ్ట్ పార్టీలు జట్టుకట్టాయి. మాల్దాలోని సుజాపూర్‌లో కూడా ఆసక్తికర పోరు సాగుతోంది. కాంగ్రెస్ నేత ఘనీఖాన్ చౌదురి బంధువులు ఒకరిపై ఒకరు పోటీపడుతున్నారు. చౌదురీ సోదరుడు అబు నాజర్‌ఖాన్ చౌదురీ తృణమూల్ తరఫున బరిలో ఉండగా, అతని మేనకోడలు ఇషా ఖాన్ చౌదురీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో పోటాపోటీ .. అవినీతి, నారదా స్టింగ్ ఆపరేషన్, శారదా చిట్ స్కాంలతో పాటు ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారంటూ ప్రచారంలో విపక్షాలు అధికార పార్టీపై విరుచుకుపడ్డాయి. మా ఆస్తి సున్నా రెండో దశలో ముగ్గురు అభ్యర్థులు తమకు ఒక్క రూపాయి కూడా ఆస్తి లేనట్లు చూపారు. ఏడుగురు తమకు వెయ్యి రూపాయిల కంటే తక్కువ ఆస్తి ఉందని చెప్పడం ఆసక్తి కలిగించే అంశం. -
సింగరేణికి కొత్త సారథి..!
ఖాళీ కానున్న సీఎండీ పోస్టు ఇప్పటికే ఖాళీ అయిన డెరైక్టర్(పా) పదవి కొత్తవారి నియామకానికి {పభుత్వం కసరత్తు కొత్తగూడెం(ఖమ్మం) : కోలిండియాతో పోటీపడుతూ బొగ్గు ఉత్పత్తిలో దూసుకుపోతున్న సింగరేణి సంస్థకు కొత్త సారథులు రానున్నారు. సంస్థలో కీలకమైన చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ పదవిలో ఉన్న సుతీర్థ భట్టాచార్య కోలిండియా చైర్మన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యం కావడంతో ఆయన ఇంకా రిలీవ్ కాలేదు. మరో వారంరోజుల్లో ఉత్తర్వులు అందనుండటంతో ఈ పోస్టు ఖాళీ కానుంది. ఇక మరో కీలకపోస్టు అయిన డెరైక్టర్(పా) పోస్టులో ఉన్న టి.విజయ్‌కుమార్ ఇప్పటికే బదిలీ అయ్యారు. దీంతో డెరైక్టర్ పోస్టు కూడా ఖాళీగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యాలతో నడుస్తున్న సింగరేణి సంస్థలో ఈ రెండు పోస్టుల్లో ఐఏఎస్ స్థాయి అధికారులను నియమించడం ఆనవాయితీ. సీఎండీ పోస్టును విడదీసి చైర్మన్‌గా రాజకీయ నేపథ్యం ఉన్న వారిని నియమిస్తారనే ప్రచారం జరుగుతుండడంతో మేనేజింగ్ డెరైక్టర్‌గా ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించే అవకాశం ఉంది. డెరైక్టర్(పా) పోస్టు మాత్రం ఇప్పట్లో భర్తీచేసే అవకాశాలు కన్పించడం లేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్‌ల కొరత ఉన్న నేపథ్యంలో కనీసం ఆరు నెలలపాటు ఇన్‌చార్జ్‌తో కొనసాగించనున్నారు. ప్రస్తుతం సింగరేణి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున డెరైక్టర్‌గా ఉన్న ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలేంద్రకుమార్ జోషి లేదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ కె.రామకృష్ణారావును సంస్థ సీఎండీగా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసే అవకాశాలున్నాయి. సింగరేణిపై అనుభవం ఉన్నవారికే సీఎండీ బాధ్యతలు అప్పగిస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు కొరతలేకుండా ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం సింగరేణి బోర్డ్‌లో తెలంగాణ ప్రభుత్వం తరఫున డెరైక్టర్లుగా ఉన్న వీరిలో ఒకరిని సీఎండీగా నియమించే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. -
ఎస్బీఐ చీఫ్ రేసులో అరుంధతి, విశ్వనాథన్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్ పదవికి అరుంధతీ భట్టాచార్య, ఎస్.విశ్వనాథన్ పోటీలో ముందున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నియమించిన అన్వేషణ కమిటీ వీరిరువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 30న ప్రస్తుత చైర్మన్ ప్రతీప్ చౌదురి ఎస్బీఐ చైర్మన్‌గా పదవీ విరమణ చేయనున్న విషయం విదితమే. అరుంధతీ భట్టాచార్య, విశ్వనాథన్ ప్రస్తుతం బ్యాంక్ ఎండీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, ప్రస్తుతం తమకు లిక్విడిటీ కొరత లేదని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు రేటింగ్ దిగ్గజం మూడీస్ బ్యాంకుపట్ల వ్యక్తం చేసిన ఆందోళనలను ఖండించింది. బ్యాంకు డెట్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తూ మూడీస్ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని, అతిగా స్పందించిందని తెలిపింది. వాటికి ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదని పేర్కొంది.