వాషింగ్టన్:రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తన టీమ్‌లో వరుసగా ఒక్కొక్కరిని నియమిస్తున్నారు. తాజాగా అమెరికా హెల్త్‌సైన్సెస్ పరిశోధనలకు కీలకమైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్(ఎన్‌ఐహెచ్) డైరెక్టర్‌గా భారతీయుడైన డాక్టర్ జే భట్టాచార్యను నియమించారు.
అమెరికాలో మెడికల్ సైన్సెస్‌లో కీలక పరిశోధనలు చేసే మొత్తం 27 సంస్థలకు ఎన్‌ఐహెచ్ నుంచే నిధులు కేటాయిస్తారు. ఎన్‌ఐహెచ్ ఏడాది బడ్జెట్ రూ. 4 లక్షల కోట్ల దాకా ఉంటుందంటే దాని ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. భట్టాచార్య ప్రస్తుతం స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
భట్టాచార్య 1968లో కోల్‌కతాలో జన్మించి అమెరికా వెళ్లారు. కొవిడ్ సమయంలో జో బైడెన్ ప్రభుత్వ పాలసీని తీవ్రంగా విమర్శించిన భట్టాచార్య రిపబ్లికన్లకు దగ్గరయ్యారు. కాగా,ఇటీవలే ట్రంప్ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా ఆర్‌ఎఫ్‌కెన్నెడీ జూనియర్ నియమితులైన విషయం తెలిసిందే.
ఇప్పటికే భారత సంతతి వ్యాపారవేత్త వివేక్‌రామస్వామి ట్రంప్ టీమ్‌లో ఇలాన్ మస్క్‌తో పాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డీవోజీఈ) హెడ్ పదవికి ఎంపికైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment