నేను అద్భుతం చేయబోతున్నా: ట్రంప్‌ | donlad Trump says that America was full of hope since his election | Sakshi
Sakshi News home page

నేను అద్భుతం చేయబోతున్నా: ట్రంప్‌

Published Sun, Dec 18 2016 4:06 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

నేను అద్భుతం చేయబోతున్నా: ట్రంప్‌ - Sakshi

నేను అద్భుతం చేయబోతున్నా: ట్రంప్‌

న్యూయార్క్‌: తన ఎన్నిక జరిగినప్పటి నుంచి అమెరికా గంపెడు ఆశతో ఉందని త్వరలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అదే సమయంలో తన ఎన్నికతో భవిష్యత్‌పై భయమేస్తోందంటూ వ్యాఖ్యానించిన అమెరికా ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా మాటలు గుర్తుచేశారు.

‘ఎప్పుడు బ్రహ్మాండమైన ఆశను కలిగి ఉన్నాం. బ్రహ్మాండమైన వాగ్దానం కూడా మనకు ఉంది. అలాగే పెద్ద మొత్తంలో శక్తిని కూడా మనం కలిగి ఉన్నాం. మనం తిరిగి భారీ విజయం సాధించబోతున్నాం. ఈ దేశంలో మనం అద్భుతం చేయబోతున్నాం. ఆ అ​ద్భుతం నేనే చేస్తా’ అంటూ ట్రంప్‌ అలబామాలోని మొబైల్‌లో ర్యాలీ సందర్భంగా చెప్పారు.

చివరికి మీకు ధన్యవాదాలు అంటూ ఆయన ముగించారు. గత శుక్రవారం ఆఫ్రా విన్‌ఫ్రే తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మిషెల్లీ మాట్లాడుతూ ట్రంప్‌ విజయం తర్వాత అమెరికన్లలో కాస్తంత ఆందోళన ఉందని, తనకు అలాంటిదే ఉందని, అయితే, జీవితంలో ఆశ కలిగి ఉండటం​ ముఖ్యమైనందున తాను కూడా మంచే జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement