ఎస్‌బీఐ చీఫ్ రేసులో అరుంధతి, విశ్వనాథన్ | Panel shortlists Bhattacharya, Viswanathan for SBI chief post | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ చీఫ్ రేసులో అరుంధతి, విశ్వనాథన్

Published Wed, Sep 25 2013 1:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM

Panel shortlists Bhattacharya, Viswanathan for SBI chief post

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) చైర్మన్ పదవికి అరుంధతీ భట్టాచార్య, ఎస్.విశ్వనాథన్ పోటీలో ముందున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నియమించిన అన్వేషణ కమిటీ వీరిరువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 30న ప్రస్తుత చైర్మన్ ప్రతీప్ చౌదురి ఎస్‌బీఐ చైర్మన్‌గా పదవీ విరమణ చేయనున్న విషయం విదితమే. అరుంధతీ భట్టాచార్య, విశ్వనాథన్ ప్రస్తుతం బ్యాంక్ ఎండీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, ప్రస్తుతం తమకు లిక్విడిటీ కొరత లేదని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు రేటింగ్ దిగ్గజం మూడీస్ బ్యాంకుపట్ల వ్యక్తం చేసిన ఆందోళనలను ఖండించింది. బ్యాంకు డెట్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తూ మూడీస్ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని, అతిగా స్పందించిందని తెలిపింది.  వాటికి ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement