Viswanathan
-
ధోని సర్జరీ, అసలు విషయం చెప్పిన CSK సీఈఓ..!
-
నాడు అద్దె గదిలో జూనియర్ లాయర్‌గా ప్రారంభమై..నేడు సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి..
సుప్రీంకోర్టు జడ్జిగా సీనియర్ న్యాయవాది కల్పాతి వెంకటరామన్ విశ్వనాథన్ శుక్రవారమే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు విశ్వనాథన్ ఆగస్టు 11 2030న జేబీ పార్దివాలా పదవీ విరమణ చేసిన తదనంతరం భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. ఆయన ఈ పదవిలో మే 25, 2031 వరకు కొనసాగుతారు. ఈ సందర్భంగా ఒక చిన్న లాయర్‌గా కెరీర్ మొదలు పెట్టిన జస్టిస్ విశ్వనాథన్ సుప్రీం కోర్టు జడ్జి హోదాకి అంచెలంచెలుగా సాగిన సుదీర్ఘ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. జస్టిస్ కేవీ విశ్వనాథన్ 1988లో తమిళనాడు నుంచి ఢిల్లీకి వచ్చి ఆర్కేపురంలో ఓగదిలో ఉంటూ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆయన తమిళనాడులోని పొల్లాచి పట్టణానికి చెందినవారు. తండ్రి కేవీ వెంకటరామన్ కోయంబత్తూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేయడంతో ఆయన విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. కోయంబత్తూరు న్యాయ కళాశాలలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు పూర్తి అయిన వెంటనే సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలనే కోరికతో 1988లో ఢిల్లీకి వచ్చేశారు. అక్కడ నుంచే విశ్వనాథన్ న్యాయవాది వృత్తి జర్నీ ప్రారంభమైంది. అక్కడే ఆర్కేపురంలో స్నేహితుడితో ఓ అద్దె గదిలో ఉంటూ లాయర్‌గా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆ తదనంతరం ఢిల్లీలోని సీనియర్ లాయర్ దగ్గర జూనియర్‌గా పనిచేశారు. ఆ తర్వాత సీఎస్ వైద్యనాథన్‌తో కలిసి పనిచేశారు. అతనితో విశ్వనాథన్ 1988 నుంచి 1990 వరకు హైకోర్టు, సుప్రీంకోర్టు, దిగువ కోర్టులలో పనిచేశారు. ఆ తర్వాత సీనియర్ న్యాయవాది కెకె వేణుగోపాల్ వద్ద 1990 నుంచి 1995 వరకు పనిచేశారు. అంతేగాదు అయోధ్య కేసులో లార్డ్ రామ్లాల తరుఫును కేసు వాదించారు. ఇదిలా ఉండగా, 1991 నాటి ఆసక్తికరమైన సంఘటనలో, కాంగ్రెస్ నాయకుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య కేసు జస్టిస్ ఎమ్‌సి జైన్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతున్నప్పుడూ జస్టిస్ విశ్వనాథన్ తన ప్రత్యర్థి వర్గానికి ట్రాన్స్‌లేటర్‌గా కూడా పని చేశారు. ఆ కేసులో రాజకీయ నేతలంతా ఇంగ్లీషలో మాట్లాడుతుండగా.. డీఎంకే అధినేత ఎం కరుణానిధి మాత్రం తమిళంలో మాట్లాడటంతో జస్టీస్ జైన్‌కు ఏం చేయాలో తోచలేదు. దీంతో కరుణానిధి మాటలను నా కోసం అనువదించగలరా అని విశ్వానథ్ని అడిగారు. తాను ఏఐఏడీఎంకేకు వాదిస్తున్నానని జస్టిస్ విశ్వనాథన్ చెప్పడంతో ఆయన అనువాదించడంలో ఎవరికైనా అభ్యంతరం ఉందా అని జస్టిస్ జైన్ అడిగారు. ఐతే ఎవ్వరూ ఏ సమస్య లేవనెత్తకపోయేసరికి విశ్వానాథనే తన ప్రత్యర్థి వర్గానికి ట్రాన్స్‌లేటర్‌గా చేశారు. 2009లో కేంద్ర ప్రభుత్వానికి అదనపు న్యాయవాదిగా కూడా పనిచేశారు. అంతేగాదు సుప్రీంకోర్టులో అనేక ముఖ్యమైన కేసులలో ప్రాతినిధ్యం వహించడమే గాక చాలా సున్నితమైన కేసులలో అమికస్ క్యూరీగా నియమితులయ్యారు. కాగా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తమిళనాడు నుంచి నియమితులైన మూడవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అంతకుముందు తమిళనాడు నుంచి జస్టిస్ పతంజలి శాస్త్రి 1951 నుంచి 1954 వరకు సీజేఐగా పనిచేశారు. 2013లో జస్టిస్ పీ సదాశివం తొమ్మిది నెలల పాటు ఈ పదవిలో ఉన్నారు. (చదవండి: ‘అది పనిష్మెంట్ కాదు.. మోదీ విజన్’) -
పోలీస్ కమిషనర్ మానవీయత
సాక్షి, తమిళనాడు: చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్ మానవీయత వెలుగులోకి వచ్చింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఓ పోలీసును కరోనా వైరస్ నుంచి రక్షించేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. చివరి ప్రయత్నంగా హైదరాబాద్ నుంచి ఓ టీకాను తెప్పించారు. ఈ టీకా రూపంలో క్రమంగా ఆ పోలీసు కోలుకుంటుండడం విశేషం. చెన్నైలో కమిషనరేట్ పరిధిలోని ఐపీఎస్‌ల నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐదు వందల మంది వరకు వైరస్‌కు చికిత్స పొందుతున్నారు. రెండు వందల మంది మేరకు డిశ్చార్జ్ అయ్యారు. విధులకు హాజరయ్యారు. కరోనా బారిన పడ్డ పోలీసులకు మెరుగైన వైద్యం అందే విధంగా ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ అధికారులో కమిషనర్ విశ్వనాథన్ సంప్రదింపులు జరుపుతున్నారు. చదవండి: కోవిడ్‌తో డీఎంకే ఎమ్మెల్యే మృతి అదే సమయంలో సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడమే కాదు, వారిలో నెలకొన్న మానసిక వేదనను తొలగించేందుకు తగ్గట్టుగా ఈసీఆర్‌లో ప్రత్యేకంగా యోగా తరగతుల్ని నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ సిబ్బంది ప్రాణంమీదకు పరిస్థితి రావడంతో ఆయన హృదయం తల్లడిళ్లింది. ఆ సిబ్బందిని రక్షించేందుకు సొంత ఖర్చులతో హైదరాబాద్ నుంచి టీకాను తెప్పించి ఉండడం వెలుగు చూసింది. వెస్ట్ మాంబళం స్టేషన్లో పనిచేస్తున్న ఓ పోలీసు కరోనా బారిన పడడంతో ఆయన పరిస్థితి విషమించింది. చివరి ప్రయత్నంగా హైదరాబాద్ నుంచి టీకాను తెప్పించేందుకు ప్రైవేటు వైద్యులు సిఫారసు చేశారు. ఇదే టీకాను చివరి క్షణంలో ఉన్న ఎమ్మెల్యే అన్భళగన్ను రక్షించేందుకు సైతం ఉపయోగించినా ఫలితం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఆ టీకాను తెప్పించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఆ పోలీసుల కుటుంబానికి అడ్డు వచ్చింది. ఆ టీకా ఖరీదు రూ. 75 వేలు. మూడు రోజుల పాటుఆ టీకా వేయాల్సి ఉంటుంది. అది ఫలితాన్ని ఇస్తే సరి లేని పక్షంలో రూ 2.25 లక్షలు బూడిదలోపోసినట్టే. ఈ సమాచారం అందుకున్న సీపీ విశ్వనాథన్ తన మానవీయతను చాటుకున్నారు. తన సొంత ఖర్చుల నుంచి ఆ టీకాల్ని తెప్పించి ఇచ్చినట్టు సమాచారం. ఈ టీకా వాడకంతో ఆ పోలీసులు శరీరంలో క్రమంగా మార్పులు వస్తున్నట్టు, ఆరోగ్యం మెరుగు పడుతున్నట్టు వైద్యులు తేల్చడంతో సీపీ మానవీయత వెలుగులోకి వచ్చింది. చదవండి: తినేవస్తువు అనుకుని.. నాటుబాంబుని కొరికి -
లోను కావాలా గురూ..!
న్యూఢిల్లీ: కార్పొరేట్లకు భారీగా రుణాలిచ్చి అవి వసూలు కాక సమస్యలను ఎదుర్కొంటున్న బ్యాంకులు ఇప్పుడు సామాన్యుల వెంట పడ్డాయి. బ్యాంకుల కొత్త వ్యాపారంలో సింహభాగం రిటైల్ రుణాలే ఉంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 16 నాటికి చూస్తే పెరిగిన బ్యాంకుల వ్యాపారంలో 96 శాతం వ్యక్తిగత రుణాలు (పర్సనల్ లోన్స్) కావడం గమనార్హం. 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకుల రుణాల వ్యాపారంలో 41.5 శాతం వ్యక్తిగత రుణాలేనని ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కార్పొరేట్ రుణాలు ఇప్పుడు ఎన్పీఏలుగా మారినట్టే... భవిష్యత్తులో రిటైల్ రుణాల నుంచి ఇదే మాదిరి రిస్క్ ఉండొచ్చని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విశ్వనాథన్ తాజాగా హెచ్చరించడం ఇందుకేనేమో. పారిశ్రామిక డిమాండ్ తగ్గినందున కార్పొరేట్ రంగం నుంచి తాజా పెట్టుబడులు లేని పరిస్థితికి ఇది అద్దం పడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గణాంకాలు ఇవి... 2017 ఏప్రిల్ నుంచి 2018 ఫిబ్రవరి 16 వరకు పదిన్నర నెలల కాలంలో బ్యాంకుల నాన్ ఫుడ్ రుణాలు (ఆహారోత్పత్తి కోసం కాకుండా ఇచ్చేవి) రూ.2.44 లక్షల కోట్లుగా ఉంటే ఇందులో రూ.2.34 లక్షల కోట్లు వ్యక్తిగత రుణాలే. ఈ ప్రకారం చూస్తే 2017–18 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత రుణాల వ్యాపారంలో వృద్ధి 17.6 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కాలంలో పరిశ్రమలకు ఇచ్చే రుణాలు రూ.5.28 లక్షల కోట్ల మేర తగ్గగా, వ్యవసాయం, అనుబంధ రంగాల రుణాల్లో రూ.2.44 లక్షల కోట్ల మేర వృద్ధి నెలకొంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో నాన్ ఫుడ్ రుణాలు రూ.5.48 లక్షల కోట్లు కాగా, అందులో రూ.2.61 లక్షల కోట్లు వ్యక్తిగత రుణాలే ఉండడం గమనార్హం. ‘పర్సనల్ లోన్స్’ అంటే వినియోగ ఉత్పత్తుల కొనుగోలుకు ఇచ్చేవి, వాహన రుణాలు, విద్యా రుణాలు, క్రెడిట్ కార్డు, ఎఫ్డీలు, షేర్లపై ఇచ్చే రుణాలు అన్నీ. విశ్లేషకులు ఏమంటున్నారు? ‘‘ఇదేమీ ఆశ్చర్యపరిచే విషయం కాదు. కార్పొరేట్లు రుణాలు తీసుకోవడం దాదాపుగా ఆపేశాయి. దీంతో బ్యాంకులకు ఇప్పుడు వృద్ధికి అవకాశం ఉన్న ఏకైక విభాగం రిటైల్ రుణాలే. ఇదే పరిస్థితి మరికొన్ని త్రైమాసికాల పాటు కొనసాగుతుంది. ఎందుకంటే పారిశ్రామిక రుణాలకు తగిన డిమాండ్ లేదిప్పుడు. సేవల రంగం వృద్ధి కారణంగా వ్యక్తులు రుణాలు తీసుకుంటూనే ఉన్నారు’’ అని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ ధనుంజయ్ సిన్హా తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి గణాంకాలు బయటకు వస్తే రిటైల్ రుణాల వాటా తగ్గొచ్చని ఈక్వినామిక్స్ ఎండీ జి.చొక్కలింగం పేర్కొన్నారు. చారిత్రకంగా చూస్తే ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో (జనవరి–మార్చి) పారిశ్రామిక, ఇనిస్టిట్యూషనల్ రుణాల్లో పెరుగుదల ఉన్నట్టు తెలుస్తోందన్నారు. కొంత కాలానికి తయారీరంగంలో సామర్థ్యం వినియోగం పుంజుకుంటే తాజా పెట్టుబడులకు మళ్లీ పరిస్థితులు అనుకూలిస్తాయని ఇండియా రేటింగ్స్ పబ్లిక్ ఫైనాన్స్ హెడ్ దేవేంద్ర పంత్ అభిప్రాయపడ్డారు. మరికొందరు నిపుణులు మాత్రం గృహస్తుల రుణాలు పెరిగిపోతున్నాయని, వారి వ్యక్తిగత ఆదాయంలో వృద్ధి 5–6 శాతం కంటే తీసుకునే వ్యక్తిగత రుణాల్లో వృద్ధి 18–20 శాతం ఉంటోందని చెబుతున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగితే బ్యాంకులకు ఈ రుణాలు సమస్యగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి మృతి
వేలూరు : గుండెపోటుతో అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్.విశ్వనాథన్ శనివారం రాత్రి మృతి చెందాడు. వేలూరు జిల్లా కావేరిపాక్కంకు చెందిన విశ్వనాథన్(67) అన్నాడీఎంకే పార్టీలో తూర్పు డివిజన్ కార్యదర్శి, ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. ఆయన అనారోగ్యం కారణంగా చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో చికిత్స కోసం ఈ నెల 1వ తేదీన చేరారు. అక్కడ చికిత్సలు ఫలించక ఆయన శనివారం రాత్రి మృతి చెందాడు. విశ్వనాథన్ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మద్దతుదారునిగా ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించేవారు. -
వేలూరు వీఐటీకి క్యూయస్ ఫోర్ స్టార్స్
వేలూరు: వేలూరు వీఐటీ యూనివర్సిటీకి అంతర్జాతీయ స్థాయిలో క్యూయస్ ఫోర్ స్టార్స్ సర్టిఫికెట్ రావడం అభినందనీయమని చాన్్స్ లర్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో క్యూయస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌కుమార్ గంగువార్, క్యూయస్ సంస్థ డైరెక్టర్ అశ్వనీ ఫెర్నాండస్ల చేతుల మీదుగా క్యూయస్ ఫోర్ స్టార్ సర్టిఫికెట్‌ను వీఐటీ చాన్స్ లర్ విశ్వనాథన్ అందుకున్నారు. వీఐటీ విడుదల చేసిన ప్రకటనలో 2004వ సంవత్సరం నుంచి క్యూయస్ సంస్థ దేశంలోని నాణ్యతగా ఉండే ఉన్నత విద్యా సంస్థలను గుర్తించి స్టార్ అంతస్తును ఇస్తుంది. అందులో భాగంగా వీఐటీ యూనివర్సిటీ పరిశోధనలు చేయడం, చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు చేయడం వంటి వాటిని చేయడంతోనే ఈ సంవత్సరం ఫోర్ స్టార్స్ సర్టిఫికెట్‌ను అందుకున్నామని తెలిపారు. దేశంలోని యూనివర్సిటీల్లో వీఐటీకి ఈ సర్టిఫికెట్ రావడం అభినందనీయమన్నారు. వీఐటీలో విద్యార్థులతో వివిధ పరిశోధనలు చేయడం, నాణ్యత పాటించడం, విద్యార్థులకు క్రమ శిక్షణ కల్పించడంతోనే ఈ సర్టిఫికెట్ వచ్చిందని చాన్్సలర్ తెలిపారు. అదే విధంగా ఈ విద్యా సంవత్సరంలో వీఐటీ ప్రవేశ పరీక్షలకు 2.06 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం పెద్ద సాధనగా ఉందని, 2014లో 2,390 పరిశోధనలను విడుదల చేసి సాధన చేసిందన్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 2,367 పరిశోధన పత్రాలను విడుదల చేసి దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. వీఐటీ ఉపాధ్యక్షులు జీవి సెల్వం, శంకర్, శేఖర్, వైస్ చాన్సలర్ ఆనంద్ సామువేల్ పాల్గొన్నట్లు తెలిపారు. -
ప్రభుత్వ బ్యాంకులకు మరింత మూలధనం అవసరం
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విశ్వనాథన్ న్యూఢిల్లీ: మొండిబకాయిల సమస్యను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ బ్యాంకింగ్ ప్రమాణాలకు సంబంధించి 2019 మార్చి 31 నుంచీ అమలు పరచాల్సిఉన్న బాసెల్-3 నిబంధనల ఒత్తిడిని తట్టుకునేందుకూ బ్యాంకులకు మరింత మూలధనాన్ని సమకూర్చాల్సి ఉంటుందని వివరించారు. అయితే ఈ విషయలో ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందుతుందన్న విశ్వాసమూ ఉందని అన్నారు. అసోచామ్ నిర్వహించిన ఒక సమావేశంలో విశ్వనాథన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రుణ నాణ్యతా నిర్వహణపై ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్కే గుప్తా, అసోచామ్ మాజీ ప్రెసిడెంట్ ఆర్ఎన్ ధూత్, క్యాపిటల్ ఫస్ట్ చైర్మన్ వీ వైద్యనాథన్ పాల్గొన్నారు. రిటైల్ రుణాల్లోనూ ఇబ్బందులు ఉన్నాయ్ కాగా రిటైల్ రుణాల విషయంలో అంతా సవ్యంగా జరిగిపోతోందని చెప్పడానికి వీలు లేదనీ విశ్వనాథన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రుణాల వసూలు, పర్యవేక్షణ వంటి విషయాల్లో మరింత జాగరూకత అవసరమని అన్నారు. ఈ విభాగంలో రుణాలు ఇచ్చే ముందు రిస్క్ గురించి అత్యంత జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని సూచిం చారు. ఇదిలావుండగా... వార్షికంగా గృహ రుణ వ్యయాలతో పోల్చితే... కార్పొరేట్ రుణ వ్యయాలు గణనీయంగా తగ్గినట్లు ఆర్బీఐ 2015-16 వార్షిక నివేదిక తెలిపింది. -
వాసన్‌కు టాటా..
కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు పీటర్, విశ్వనాథ్ సిద్ధం అప్పుడో మాట...ఇప్పుడో మాటా? తమాకా నేత ఆగ్రహం చెన్నై: అసంతృప్తి నేతలు వాసన్‌కు టాటా చెప్పారు. మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. తమాకాలో కీలక నేతగా ఉన్న పీటర్ అల్ఫోన్స్, మాజీ ఎంపీ విశ్వనాథన్‌లతో పాటుగా పలువురు బుధవారం కాంగ్రెస్‌లో చేరనున్నారు. వీరి చర్యలను జీకే వాసన్ తీవ్రంగా దుయ్యబట్టారు. పార్టీ సమావేశం లో అంగీకరించి, ఇప్పుడేమో అసంతృప్తి వ్యక్తం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. డీఎండీకే- ప్రజా సంక్షేమ కూటమిలోకి తమాకా చేరడాన్ని ఆ పార్టీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తమాకా నేత జీకే వాసన్‌కు వ్యతిరేకంగా ఆ పార్టీలో కీలక నేతలుగా ఉన్న జ్ఞానదేశికన్ మినహా తక్కిన వారందరూ తిరుగు బాటు ధోరణిలో పయనిస్తున్న విషయం తెలిసిందే. నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని, లేదా, బలమున్న స్థానాల్ని ఎంపిక చేసుకుని ఒంటరిగా అభ్యర్థులను రంగంలోకి దించుతామన్న డిమాండ్‌ను అసంతృప్తి, తిరుగుబాటు నేతలు వాసన్ ముందు ఉంచారు. అయితే, తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని వాసన్ తేల్చడంతో ఇక, ఇక్కడ ఉండటం కన్నా సొంతగూటికి వెళ్లడం మంచిదన్న నిర్ణయానికి ఆ నాయకులు వచ్చేశారు. కాంగ్రెస్‌లో చేరడానికి తగ్గ మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు. బుధవారం చెన్నైకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ ముకుల్ వాస్నిక్ రానున్నడంతో ఆయన సమక్షంలో మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు పీటర్ అల్ఫోన్స్‌తో పాటుగా, విశ్వనాథన్తదితర నాయకులు సిద్ధమయ్యారు. వీరితో పాటుగా పదిహేను జిల్లాలకు చెందిన తమాకా అధ్యక్షులు, కార్యవర్గంతో పాటు, ఇతర జిల్లాల్లోని ముఖ్యనాయకులు మాతృగూటికి చేరడానికి ఉరకలు తీస్తున్నారు. తమాకాను వీడి నేతలు కాంగ్రెస్ గూటికి వెళుతుండడంపై మంగళవారం మీడియా ఎదుట వాసన్ స్పందించారు. 99.9 శాతం మంది నాయకులు పార్టీ సమావేశంలో డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమికి మద్దతు తెలియజేశారని, అయితే, ఇప్పుడేమో తిరుగు బాటు, అసంతృప్తి అంటూ నినాదాన్ని అందుకోవడం విచారకరంగా పేర్కొన్నారు. ఎవరు బయటకు వెళ్లినా సరే, తన పార్టీకి ఢోకా లేదని, తన పార్టీని ఎలా నడిపించాలో తనకు తెలుసనని వ్యాఖ్యానించారు. ఇక, మరో విషయం టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు చెబుతున్నానంటూ, తన మీద , తన పార్టీ వర్గాల మీద కరుణ చూపించే విధంగా మొసలి కన్నీళ్లు వద్దు అని, తన పార్టీ సత్తా ఏమిటో ఎన్నికల ఫలితాల ద్వారా రుజువు చేస్తానని వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తు విషయంగా తాను ఎలాంటి చర్చలు జరప లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కొందరు వెళ్లినంత మాత్రాన పార్టీ బలహీన పడదని, వారి స్థానంలో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా మరింత బలం పెరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
హొసూరు : భవన నిర్మాణ కార్మికుడిని దారుణంగా హతమార్చి పాతిపెట్టిన కేసులో ముగ్గురు తళి రెవెన్యూ అధికారి ఎదుట లొంగిపోయారు. వివరాల మే రకు సూళగిరి సమీపంలోని సొరకాయపల్లి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు విశ్వనాథన్(36)కు భార్య చంద్రమ్మ ఉంది. గత 17వ తేదీ పనికెళ్లిన విశ్వనాథన్ ఇంటికి తిరిగి రాకపోవడం తో విశ్వనాథన్ సహోదరుడు క్రిష్ణప్ప హొ సూరు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశా డు. విచారణ చేపట్టిన పోలీసులు చం ద్రమ్మ అక్క గౌరమ్మ (25), మణి(37), యల్లప్ప (35)లు కలిసి విశ్వనాథన్‌ను హత్య చేసి పాతిపెట్టినట్లు తెలిసింది. విశ్వనాథన్ భార్య చంద్రమ్మ అక్క గౌరమ్మతో విశ్వనాథన్‌కు వివాహేతర సం బంధం ఉండేది. గౌరమ్మ భర్త నం జప్పకు తెలియక గౌరమ్మతో వివాహేతర సంబందం ఏర్పరుచుకున్నాడు. ఈ తరుణంలో విశ్వనాథన్ భార్య చంద్రమ్మను వదలి గౌరమ్మతో కర్ణాటక రాష్ట్రం ఆనేకల్ల్లో విశ్వనాథన్ కాపురం సాగిం చాడు. ఈ విషయాన్ని నంజప్పతో పనిచేస్తున్న మిత్రుడు మణి... గౌరమ్మ ఆనేకల్‌లో ఉన్న విషయం తెలుసుకున్నాడు. మళ్లీ నంజప్ప గౌరమ్మతో కాపురం చేసేందుకు మణిని మద్యవర్తిగా వ్యవహరించమన్నాడు. ఈ తరుణంలో గౌరమ్మ కు మణితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆనేకల్‌లో ఒంటరిగా ఉన్న విశ్వనాథన్ తన భార్య చంద్రమ్మ వద్దకు వె ళ్లాడు. గత 17వ తేది విశ్వనాథన్ మళ్లీ బేళగొండపల్లిలో ఉన్న గౌరమ్మ ఇంటికి మద్యం సేవంచి వెళ్లాడు. ఈ సమయం లో వీరి మధ్య గొడవలేర్పడింది. గౌరమ్మ అందించిన పథకం ప్రకారం విశ్వనాథన్‌ను గౌరమ్మ రెండవ ప్రియుడు మణి, కలుగొండపల్లి సమీపంలోని కొప్పగరై గ్రామానికి చెందిన యల్లప్పలు విశ్వనాథన్‌ను కాళ్లు, చేతులు కట్టి సమీపంలోని తైలపుతోటకు తీసుకెళ్లి హత్య చేసి పాతి పెట్టినట్లు విచారణలో తెలిసింది. గురువారం విశ్వనాథన్‌ను పాతిపెట్టిన స్థలాని కి చేరుకొన్న పోలీసులు విశ్వనాథన్ శవా న్ని బయటకు తీసి శవపరీక్ష కోసం హొ సూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. గౌరమ్మ, మణి, యల్లప్పలను పో లీసు లు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. -
ఆ అవసరం లేదు
తమ ఎదుగుదలను ఓర్వలేక గౌరవానికి భంగం కలిగించే చర్యల్లో భాగంగా తనపై చెక్కుమోసం కేసు పాల్పడ్డారని దర్శకుడు విక్రమన్ భార్య జయప్రియ ఆరోపణలు గుప్పించారు. వివరాల్లో కెళితే... కోయంబత్తూరు రామ్‌నగర్ సెంగుపా వీధికి చెందిన ప్రదోష్ (33) అనే ఫైనాన్షియర్ రెండు వారాల క్రితం కోయంబత్తూరు నగర పోలీసు కమిషనర్ విశ్వనాథన్‌కు ఒక ఫిర్యాదు చేశారు. అందులో నీలగిరి జిల్లా కొత్తగిరికి చెందిన విన్సెంట్ టి.బాలు, చెన్నై నుంగంబాక్కంకు చెందిన సినీ దర్శకుడు విక్రమన్ భార్య జయప్రియ తనకు చెక్కు మోసంతో 14 లక్షల వరకు ఏ మార్చినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో వీరిపై కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేసివిచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం కోయంబత్తూరులో రోటరీ క్లబ్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు విక్రమన్ భార్య జయప్రియ విలేకరులతో మాట్లాడుతూ తన భర్త ప్రస్తుతం తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. తాను కూచిపూడి నృత్యకళాకారిణిగా నృత్య ప్రదర్శనలను నిర్వహిస్తున్నానని చెప్పారు. చిత్ర రంగంలో తన భర్తపై వ్యతిరేకత ఉన్న కొందరు తమపేరు, ప్రతిష్టలకు భంగం కలిగించడానికి చెక్కుమోసం కేసు పెట్టించారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తికి తనకూ ఎలాంటి సంబంధం లేదన్నారు. తమకు ఎలాంటి ఆర్థిక సమస్య లూ లేవని, ఎవరినో మోసం చేయాల్సిన అవసరం తమకు లేదని జయప్రియ పేర్కొన్నారు. -
పేపర్‌కు చిక్కు‘ముడి’
పెరుగుతున్న ముడిపదార్థాల వ్యయం చిక్కులు తెస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కాగితం ధర మరింత పెరిగే అవకాశం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాగితం పరిశ్రమకు పుట్టెడు కష్టాలు వచ్చిపడుతున్నాయి. రెండేళ్లుగా ముడి పదార్థాల వ్యయం రెండింతలవడం, కలప కొరతతో కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. విద్యుత్ చార్జీలు కూడా తడిసి మోపెడవుతున్నాయి. వెరసి పేపర్ ధర పెంచడంతో దిగుమతులు పెరిగేందుకు పరిస్థితులే అవకాశం కల్పిస్తున్నాయి. దక్షిణాసియా దేశాలతో భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. ఈ దేశాల నుంచి కొన్ని రకాల పేపర్ విరివిగా భారత్‌కు దిగుమతి అవుతోంది. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న కాగితంతో పోలిస్తే దక్షిణాసియా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని రకాల డ్యూటీ ఫ్రీ(పన్నులు లేని) కాగితం ధర టన్నుకు రూ.3 వేల దాకా తక్కువగా ఉంటోందని పేపర్‌టెక్ 2014 చైర్మన్, శేషసాయి పేపర్, బోర్డ్స్ ఎండీ కేఎస్ కాశీ విశ్వనాథన్ శుక్రవారమిక్కడ తెలిపారు. సీఐఐ పేపర్‌టెక్ సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. పెరగనున్న కాగితం ధర.. ప్రస్తుత పరిస్థితుల్లో కాగితం ధర పెంచక తప్పదని విశ్వనాథన్ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటికే 15 శాతం దాకా ధర పెరిగిందని చెప్పారు. వ్యయాలు పెరిగినప్పుడల్లా ఆ భారాన్ని కస్టమర్లపై మోపడం లేదని తెలిపారు. సాధ్యమైనంత వరకు అంతర్గత వ్యయాలను తగ్గించుకోవడంపైనే దృష్టిసారిస్తున్నామని చెప్పారు. దేశీయంగా కలప ధరను నియంత్రించగలిగామన్నారు. వార్తాపత్రికలే బెటర్.. ప్రింట్ మీడియాతో పోలిస్తే ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రాచుర్యం పెరుగుతోందని ఐటీసీ పేపర్ డివిజినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, పేపర్‌టెక్ కో చైర్ సంజయ్ సింగ్ తెలిపారు. అయితే ఎలక్ట్రానిక్ విధానంలో విద్యుత్ ఎక్కువగా ఖర్చు అవుతుందని చెప్పారు. కాగా, దేశీయ పేపర్ పరిశ్రమ పరిమాణం రూ.40,000 కోట్లుంది. 1.2-1.3 కోట్ల టన్నుల పేపర్ ఉత్పత్తి అవుతోంది. పరిశ్రమ ఈ ఏడాది 7-8 శాతం వద్ధి ఆశిస్తోంది. కార్యక్రమంలో సీఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ సురేశ్ ఆర్ చిట్టూరి తదితరులు పాల్గొన్నారు. -
రివేరా ఫ్యాషన్ షో అదుర్స్
వేలూరు, న్యూస్‌లైన్ : వేలూరు వీఐటీ యూనివర్సిటీలోని రివేరా-2014 అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గురువారం రాత్రి విద్యార్థుల ఫ్యాషన్‌షో జరిగింది. ఈ పోటీల్లో 400 యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రకరకాల దుస్తులు ధరించి పాల్గొన్నారు. విద్యార్థుల కేరింతల నడుమ జరిగిన ఈ పోటీల్లో చెన్నై ఎన్ఐఎఫ్టీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన విద్యార్థులకు నగుదు బహుమతితో పాటు సర్టిఫికెట్లును వీఐటీ యూనివర్సిటీ చాన్సలర్ విశ్వనాథన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎస్వో 2009 సర్టిఫికెట్లు పొందిన ఈ అంతర్జాతీయ రివేరా సాంస్కృతిక కార్యక్రమాలు నాలుగు రోజుల పాటు జరుగుతాయన్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం సుమారు 24 వేల విద్యార్థులు ఈ పోటీల్లో కలుసుకోవడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో వివిధ దేశాలకు, యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులు ప్యాషన్ షోలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ పోటీలు ఈనెల 9వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. వివిధ పోటీలు నిర్వహించి సుమారు *2 కోట్లు విలువ చేసే బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్, శేఖర్, జీవీ సెల్వం, వైస్ చాన్స్‌లర్ రాజు, త్రొ చాన్స్‌లర్ నారాయణన్, ప్రొఫెసర్లు, వివిధ యూనివర్సిటీ చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎస్బీఐ చీఫ్ రేసులో అరుంధతి, విశ్వనాథన్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్ పదవికి అరుంధతీ భట్టాచార్య, ఎస్.విశ్వనాథన్ పోటీలో ముందున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నియమించిన అన్వేషణ కమిటీ వీరిరువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 30న ప్రస్తుత చైర్మన్ ప్రతీప్ చౌదురి ఎస్బీఐ చైర్మన్‌గా పదవీ విరమణ చేయనున్న విషయం విదితమే. అరుంధతీ భట్టాచార్య, విశ్వనాథన్ ప్రస్తుతం బ్యాంక్ ఎండీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, ప్రస్తుతం తమకు లిక్విడిటీ కొరత లేదని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు రేటింగ్ దిగ్గజం మూడీస్ బ్యాంకుపట్ల వ్యక్తం చేసిన ఆందోళనలను ఖండించింది. బ్యాంకు డెట్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తూ మూడీస్ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని, అతిగా స్పందించిందని తెలిపింది. వాటికి ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదని పేర్కొంది.