వేలూరు, న్యూస్‌లైన్ : వేలూరు వీఐటీ యూనివర్సిటీలోని రివేరా-2014 అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గురువారం రాత్రి విద్యార్థుల ఫ్యాషన్‌షో జరిగింది. ఈ పోటీల్లో 400 యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రకరకాల దుస్తులు ధరించి పాల్గొన్నారు. విద్యార్థుల కేరింతల నడుమ జరిగిన ఈ పోటీల్లో చెన్నై ఎన్‌ఐఎఫ్‌టీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన విద్యార్థులకు నగుదు బహుమతితో పాటు సర్టిఫికెట్లును వీఐటీ యూనివర్సిటీ చాన్సలర్ విశ్వనాథన్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎస్‌వో 2009 సర్టిఫికెట్లు పొందిన ఈ అంతర్జాతీయ రివేరా సాంస్కృతిక కార్యక్రమాలు నాలుగు రోజుల పాటు జరుగుతాయన్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం సుమారు 24 వేల విద్యార్థులు ఈ పోటీల్లో కలుసుకోవడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో వివిధ దేశాలకు, యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులు ప్యాషన్ షోలో పాల్గొనడం అభినందనీయమన్నారు.
ఈ పోటీలు ఈనెల 9వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. వివిధ పోటీలు నిర్వహించి సుమారు *2 కోట్లు విలువ చేసే బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్, శేఖర్, జీవీ సెల్వం, వైస్ చాన్స్‌లర్ రాజు, త్రొ చాన్స్‌లర్ నారాయణన్, ప్రొఫెసర్లు, వివిధ యూనివర్సిటీ చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
రివేరా ఫ్యాషన్ షో అదుర్స్
Published Sat, Feb 8 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement
Advertisement