సుప్రీంకోర్టు జడ్జిగా సీనియర్ న్యాయవాది కల్పాతి వెంకటరామన్ విశ్వనాథన్ శుక్రవారమే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు విశ్వనాథన్ ఆగస్టు 11 2030న జేబీ పార్దివాలా పదవీ విరమణ చేసిన తదనంతరం భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. ఆయన ఈ పదవిలో మే 25, 2031 వరకు కొనసాగుతారు. ఈ సందర్భంగా ఒక చిన్న లాయర్‌గా కెరీర్ మొదలు పెట్టిన జస్టిస్ విశ్వనాథన్ సుప్రీం కోర్టు జడ్జి హోదాకి అంచెలంచెలుగా సాగిన సుదీర్ఘ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
జస్టిస్ కేవీ విశ్వనాథన్ 1988లో తమిళనాడు నుంచి ఢిల్లీకి వచ్చి ఆర్కేపురంలో ఓగదిలో ఉంటూ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆయన తమిళనాడులోని పొల్లాచి పట్టణానికి చెందినవారు. తండ్రి కేవీ వెంకటరామన్ కోయంబత్తూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేయడంతో ఆయన విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది.
కోయంబత్తూరు న్యాయ కళాశాలలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు పూర్తి అయిన వెంటనే సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలనే కోరికతో 1988లో ఢిల్లీకి వచ్చేశారు. అక్కడ నుంచే విశ్వనాథన్ న్యాయవాది వృత్తి జర్నీ ప్రారంభమైంది. అక్కడే ఆర్కేపురంలో స్నేహితుడితో ఓ అద్దె గదిలో ఉంటూ లాయర్‌గా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆ తదనంతరం ఢిల్లీలోని సీనియర్ లాయర్ దగ్గర జూనియర్‌గా పనిచేశారు.
ఆ తర్వాత సీఎస్ వైద్యనాథన్‌తో కలిసి పనిచేశారు. అతనితో విశ్వనాథన్ 1988 నుంచి 1990 వరకు హైకోర్టు, సుప్రీంకోర్టు, దిగువ కోర్టులలో పనిచేశారు. ఆ తర్వాత సీనియర్ న్యాయవాది కెకె వేణుగోపాల్ వద్ద 1990 నుంచి 1995 వరకు పనిచేశారు. అంతేగాదు అయోధ్య కేసులో లార్డ్ రామ్‌లాల తరుఫును కేసు వాదించారు.
ఇదిలా ఉండగా, 1991 నాటి ఆసక్తికరమైన సంఘటనలో, కాంగ్రెస్ నాయకుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య కేసు జస్టిస్ ఎమ్‌సి జైన్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతున్నప్పుడూ జస్టిస్ విశ్వనాథన్ తన ప్రత్యర్థి వర్గానికి ట్రాన్స్‌లేటర్‌గా కూడా పని చేశారు.
ఆ కేసులో రాజకీయ నేతలంతా ఇంగ్లీషలో మాట్లాడుతుండగా.. డీఎంకే అధినేత ఎం కరుణానిధి మాత్రం తమిళంలో మాట్లాడటంతో జస్టీస్ జైన్‌కు ఏం చేయాలో తోచలేదు. దీంతో కరుణానిధి మాటలను నా కోసం అనువదించగలరా అని విశ్వానథ్‌ని అడిగారు. తాను ఏఐఏడీఎంకేకు వాదిస్తున్నానని జస్టిస్ విశ్వనాథన్ చెప్పడంతో ఆయన అనువాదించడంలో ఎవరికైనా అభ్యంతరం ఉందా అని జస్టిస్ జైన్ అడిగారు. ఐతే ఎవ్వరూ ఏ సమస్య లేవనెత్తకపోయేసరికి విశ్వానాథనే తన ప్రత్యర్థి వర్గానికి ట్రాన్స్‌లేటర్‌గా చేశారు.
2009లో కేంద్ర ప్రభుత్వానికి అదనపు న్యాయవాదిగా కూడా పనిచేశారు. అంతేగాదు సుప్రీంకోర్టులో అనేక ముఖ్యమైన కేసులలో ప్రాతినిధ్యం వహించడమే గాక చాలా సున్నితమైన కేసులలో అమికస్ క్యూరీగా నియమితులయ్యారు. కాగా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తమిళనాడు నుంచి నియమితులైన మూడవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అంతకుముందు తమిళనాడు నుంచి జస్టిస్ పతంజలి శాస్త్రి 1951 నుంచి 1954 వరకు సీజేఐగా పనిచేశారు. 2013లో జస్టిస్ పీ సదాశివం తొమ్మిది నెలల పాటు ఈ పదవిలో ఉన్నారు.
(చదవండి: ‘అది పనిష్మెంట్ కాదు.. మోదీ విజన్’)
Comments
Please login to add a commentAdd a comment