అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు మనదేశంలో రాజ్యాంగపరంగా ఉన్నతమైన గౌరవం ఉంది. సుప్రీం కోర్టు తీర్పులు యావత్ సమాజంతో పాటు పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపెడుతుంటాయి. అటువంటి కీలకమైన తీర్పులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. ఆయన ఇచ్చిన తీర్పులను కొన్నింటిని పరిశీలిస్తే..
గోప్యత హక్కు: డీవై చంద్రచూడ్ జస్టిస్‌గా వ్యవహరించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. గోప్యత హక్కుపై కీలకమైన తీర్పును వెలువరించింది. గోప్యతను ప్రథమిక హక్కుగా గుర్తిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు రాజ్యంగం.. వ్యక్తిగత గోప్యతకు కల్పించే రక్షిణ ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
స్వలింగ సంపర్కం నేరం కాదు: చారిత్రక నవ్‌తేజ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆప్ ఇండియా కేసులో భారతీయ శిక్షా స్మృతి( ఐపీసీ)లోని సెక్షన్ 377పై సుప్రీం కోర్టు వెల్లడించిన సంచలన తీర్పులో కీలక పాత్ర పోషించారు. సెక్షన్ 377ను రద్దు చేస్తూ.. సుప్రీం కోర్టు స్వలింగం సంపర్కం నేరం కాదని తీర్పనిచ్చింది. అదే విధంగా స్వలింగ సంపర్కానికి చట్టపబద్దత కల్పించింది. ఈ తీర్పు వెల్లడించిన ఐదుగురు న్యాయముర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా ఉన్నారు.
ఆధార్ చట్టబద్దత: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆధార్ పథకం రాజ్యాంగపరంగా చట్టబద్దమైనది అని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో సైతం జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలకంగా వ్యవహిరించారు. ఈ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఆధార్ పథకం చెల్లుబాటను పరిశీలించింది. సంక్షేమ పథకాలకు ఈ ఆధార్ స్కీమ్‌ను ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు బెంచ్ సమర్ధించింది. అయితే ప్రభుత్వ పథకాల్లో, ఇతరాత్ర కార్యక్రమాల్లో ప్రజలు సమర్పించిన ఆధార్ డేటా రక్షణ, గోపత్య భద్రత అవసరాన్ని కూడా కోర్టు గుర్తు చేసింది.
ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతత్వంలోని ధర్మాసనం 2023 మే 11న ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కీలక తీర్పు ఇచ్చింది. దేశ రాజధానిలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) సేవలపై ఢిల్లీ ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుందని పేర్కొంది. రాజధాని పరిధిలోని భూములు, పోలీసు వ్యవస్థ, శాంతి భద్రత విషయంలో ప్రభుత్వ నియంత్రణ ఉండదని తెలిపింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అధికారులను పంపిణీ చేయటంలో జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించిన తీర్పు కీలకంగా మారింది.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం: 34 ఎమ్మెల్యేల మద్దతు ఉన్న శివసేన చీలిక వర్గం (ఏక్‌నాథ్ షిండే) వర్గానికి బల పరీక్షకు అనుమతించిన మాజీ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ భగత్ సింగ్ కోష్యారీ నిర్ణయం సరికాదని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఇటువంటి సందర్భాల్లో సదురు విషయం తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది.
జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించిన తీర్పుల్లో రాజ్యాంగ నియమాలు, వ్యక్తిగత హక్కులు, న్యాయం ప్రధానంగా కనిపిస్తాయి. ఆయన తీర్పులు భారత్ న్యాయవ్యవస్థలో చెరిగిపోని ముద్ర వేశాయి. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ భారత దేశ 50వ ప్రధాన న్యాయమూర్తిగా 9 నవంబర్ 2022 ప్రమాణ స్వీకారం విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment