వేలూరు: వేలూరు వీఐటీ యూనివర్సిటీకి అంతర్జాతీయ స్థాయిలో క్యూయస్ ఫోర్ స్టార్స్ సర్టిఫికెట్ రావడం అభినందనీయమని చాన్్స్ లర్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో క్యూయస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌కుమార్ గంగువార్, క్యూయస్ సంస్థ డైరెక్టర్ అశ్వనీ ఫెర్నాండస్‌ల చేతుల మీదుగా క్యూయస్ ఫోర్ స్టార్ సర్టిఫికెట్‌ను వీఐటీ చాన్స్ లర్ విశ్వనాథన్ అందుకున్నారు. వీఐటీ విడుదల చేసిన ప్రకటనలో 2004వ సంవత్సరం నుంచి క్యూయస్ సంస్థ దేశంలోని నాణ్యతగా ఉండే ఉన్నత విద్యా సంస్థలను గుర్తించి స్టార్ అంతస్తును ఇస్తుంది.
అందులో భాగంగా వీఐటీ యూనివర్సిటీ పరిశోధనలు చేయడం, చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు చేయడం వంటి వాటిని చేయడంతోనే ఈ సంవత్సరం ఫోర్ స్టార్స్ సర్టిఫికెట్‌ను అందుకున్నామని తెలిపారు. దేశంలోని యూనివర్సిటీల్లో వీఐటీకి ఈ సర్టిఫికెట్ రావడం అభినందనీయమన్నారు. వీఐటీలో విద్యార్థులతో వివిధ పరిశోధనలు చేయడం, నాణ్యత పాటించడం, విద్యార్థులకు క్రమ శిక్షణ కల్పించడంతోనే ఈ సర్టిఫికెట్ వచ్చిందని చాన్్సలర్ తెలిపారు.
అదే విధంగా ఈ విద్యా సంవత్సరంలో వీఐటీ ప్రవేశ పరీక్షలకు 2.06 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం పెద్ద సాధనగా ఉందని, 2014లో 2,390 పరిశోధనలను విడుదల చేసి సాధన చేసిందన్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 2,367 పరిశోధన పత్రాలను విడుదల చేసి దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. వీఐటీ ఉపాధ్యక్షులు జీవి సెల్వం, శంకర్, శేఖర్, వైస్ చాన్సలర్ ఆనంద్ సామువేల్ పాల్గొన్నట్లు తెలిపారు.