హొసూరు : భవన నిర్మాణ కార్మికుడిని దారుణంగా హతమార్చి పాతిపెట్టిన కేసులో ముగ్గురు తళి రెవెన్యూ అధికారి ఎదుట లొంగిపోయారు. వివరాల మే రకు సూళగిరి సమీపంలోని సొరకాయపల్లి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు విశ్వనాథన్(36)కు భార్య చంద్రమ్మ ఉంది. గత 17వ తేదీ పనికెళ్లిన విశ్వనాథన్ ఇంటికి తిరిగి రాకపోవడం తో విశ్వనాథన్ సహోదరుడు క్రిష్ణప్ప హొ సూరు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశా డు. విచారణ చేపట్టిన పోలీసులు చం ద్రమ్మ అక్క గౌరమ్మ (25), మణి(37), యల్లప్ప (35)లు కలిసి విశ్వనాథన్‌ను హత్య చేసి పాతిపెట్టినట్లు తెలిసింది.
విశ్వనాథన్ భార్య చంద్రమ్మ అక్క గౌరమ్మతో విశ్వనాథన్‌కు వివాహేతర సం బంధం ఉండేది. గౌరమ్మ భర్త నం జప్పకు తెలియక గౌరమ్మతో వివాహేతర సంబందం ఏర్పరుచుకున్నాడు. ఈ తరుణంలో విశ్వనాథన్ భార్య చంద్రమ్మను వదలి గౌరమ్మతో కర్ణాటక రాష్ట్రం ఆనేకల్‌ల్లో విశ్వనాథన్ కాపురం సాగిం చాడు. ఈ విషయాన్ని నంజప్పతో పనిచేస్తున్న మిత్రుడు మణి... గౌరమ్మ ఆనేకల్‌లో ఉన్న విషయం తెలుసుకున్నాడు. మళ్లీ నంజప్ప గౌరమ్మతో కాపురం చేసేందుకు మణిని మద్యవర్తిగా వ్యవహరించమన్నాడు. ఈ తరుణంలో గౌరమ్మ కు మణితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆనేకల్‌లో ఒంటరిగా ఉన్న విశ్వనాథన్ తన భార్య చంద్రమ్మ వద్దకు వె ళ్లాడు. గత 17వ తేది విశ్వనాథన్ మళ్లీ బేళగొండపల్లిలో ఉన్న గౌరమ్మ ఇంటికి మద్యం సేవంచి వెళ్లాడు.
ఈ సమయం లో వీరి మధ్య గొడవలేర్పడింది. గౌరమ్మ అందించిన పథకం ప్రకారం విశ్వనాథన్‌ను గౌరమ్మ రెండవ ప్రియుడు మణి, కలుగొండపల్లి సమీపంలోని కొప్పగరై గ్రామానికి చెందిన యల్లప్పలు విశ్వనాథన్‌ను కాళ్లు, చేతులు కట్టి సమీపంలోని తైలపుతోటకు తీసుకెళ్లి హత్య చేసి పాతి పెట్టినట్లు విచారణలో తెలిసింది. గురువారం విశ్వనాథన్‌ను పాతిపెట్టిన స్థలాని కి చేరుకొన్న పోలీసులు విశ్వనాథన్ శవా న్ని బయటకు తీసి శవపరీక్ష కోసం హొ సూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. గౌరమ్మ, మణి, యల్లప్పలను పో లీసు లు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు.
హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
Published Fri, May 1 2015 2:12 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement
Advertisement