SAFF
-
‘శాఫ్’ టోర్నీ సెమీస్‌కు దూసుకెళ్లిన భారత జట్టు
దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–20 చాంపియన్‌షిప్‌లో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. నేపాల్ వేదికగా గ్రూప్ ‘బి’ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–0 గోల్ తేడాతో మాల్దీవులు జట్టుపై గెలిచింది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత స్ట్రయికర్లు తమ దాడులకు పదును పెట్టారు. కొరౌ సింగ్, కెల్విన్ సింగ్ టోరెమ్ ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా కదంతొక్కారు. ఈ క్రమంలో కెల్విన్ కొట్టిన షాట్‌ను ఎబందస్ యేసుదాసన్ గోల్‌గా మలిచేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు.తర్వాత కాసేపటికి గుర్నాజ్ సింగ్ ఇచ్చిన కార్నర్ పాస్‌ను మోనిరుల్ హెడర్ గోల్ పోస్ట్‌ను చేరలేకపోయింది. అయినా సరే భారత యువ స్ట్రయికర్లు నిరాశచెందక తమ ప్రయత్నాలను కొనసాగించారు. 18వ నిమిషంలో కొరౌ, 47వ నిమిషంలో కెల్విన్ గోల్ కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలితమివ్వలేదు. రెండో అర్ధభాగంలోను గోల్ చేయడం కష్టంగా మారింది. చివరకు ఇంజ్యూరీ టైమ్ (90+5వ నిమిషం)లో మంగ్లెంతంగ్ కిప్జెన్ చేసిన గోల్ భారత్‌ను గెలిపించింది.ఫినిషింగ్ లోపాలతో గోల్స్‌గా మలచలేకపోయినప్పటికీ కొరౌ సింగ్, కెల్విన్, ఎబిందస్‌లు తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. సోమవారం జరిగే సెమీఫైనల్లో గ్రూప్ ‘ఎ’ రన్నరప్, డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. -
భారత్‌ను గెలిపించిన మునీరుల్
లలిత్పూర్ (నేపాల్): దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–20 చాంపియన్‌ప్‌లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సోమవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–0 గోల్ తేడాతో భూటాన్‌ను ఓడించింది. భారత్ తరఫున మునీరుల్ మౌలా (37వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి అర్ధభాగంలోనే గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్ చివరి వరకు దాన్ని కాపాడుకుంది. అయితే ఒత్తిడికి గురైన భూటాన్ ఆటగాళ్లు పదే పదే భారత ప్లేయర్లతో వాగ్వాదానికి దిగగా... మనవాళ్లు కూడా దీటుగా బదులిచ్చారు. దీంతో ఇద్దరు భారత ఆటగాళ్లు, ఓ భూటాన్ ప్లేయర్‌కి రిఫరీ ‘రెడ్ కార్డు’ చూపి మైదానం నుంచి బయటకు పంపాడు. ఫలితంగా ఆట 67వ నిమిషం తర్వాత భారత్ కేవలం తొమ్మిది మంది ప్లేయర్లతోనే ఆధిక్యాన్ని కాపాడుకోవం విశేషం. శుక్రవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో మాల్దీవులుతో భారత్ ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లో బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక జట్లున్నాయి. -
గొడవపడ్డ భారత్, నేపాల్ ఆటగాళ్లు.. తప్పు మనోడిదేనా!
శాఫ్ 2023 చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం భారత్, నేపాల్ మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. మొన్న పాక్‌తో మ్యాచ్ సమయంలోనూ గొడవ జరిగిన సంగతి తెలిసిందే. విషయంలోకి వెళితే.. ఆట 64వ నిమిషంలో ఇండియాకు చెందిన రాహుల్ బెకె, నేపాల్ మిడ్ ఫీల్డర్ బిమల్ గాత్రి మగర్లు హెడర్ షాట్ కోసం ప్రయత్నించారు. ఇద్దరు ఒకేసారి హెడర్‌కు ప్రయత్నించడంతో మగర్‌ను తాకి రాహుల్ నేలపై పడిపోయాడు. ఆ వెంటనే కోపంతో పైకి లేచిన రాహుల్ మగర్‌ను తోసేశాడు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఇద్దరు ఎక్కడా తగ్గకపోవడంతో గొడవ చిలికి చిలికి వానగాలిలా మారిపోయింది. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో ఒక నేపాల్ ఆటగాడు భారత్ ఆటగాడిని కాలర్ పట్టి కింద పడేశాడు. ఇక కొట్టుకుంటారేమో అన్న తరుణంలో సునీల్ ఛెత్రి మగర్‌ను దూరంగా తీసుకుపోయాడు. ఈ క్రమంలో మగర్ ఛెత్రీవైపు చూస్తూ తప్పందా అతనిదే అంటూ అరిచాడు. సునీల్ మాత్రం 'ప్లీజ్ కామ్‌డౌన్' అని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సునీల్ ఛెత్రీ సేన నేపాల్‌పై 2-0తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించింది. స్వదేశంలో భారత్‌కు ఇది వరుసగా 12వ విజయం కావడం విశేషం. మ్యాచ్‌లో 61వ నిమిషంలో సునీల్ ఛెత్రి భారత్‌కు తొలిగోల్ అందించగా.. నోరెమ్ మహేశ్ సింగ్ 70వ నిమిషంలో మరో గోల్ అందించాడు. ఆ తర్వాత భారత డిఫెండర్లు నేపాల్ ఆటగాళ్లను కట్టడి చేయడంతో ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. Crazy Fight among Players during India vs Nepal football match. This Aggressive Indian team is looking more dangerous. I'm liking it ❤️🔥❤️🔥pic.twitter.com/UjNnIKIm5t — Mukesh Chaudhary (@MukeshG0dara) June 24, 2023 Another fight, and now it's between India and Nepal🤣🤣#INDNEP #SAFFChampionship pic.twitter.com/ieGbQ1aV3F — BumbleBee 軸 (@itsMK_02) June 24, 2023 చదవండి: సెమీస్‌కు భారత్.. ప్రగల్బాలు పలికిన పాక్ లీగ్ దశలోనే ఇంటికి -
సెమీస్‌కు భారత్.. ప్రగల్బాలు పలికిన పాక్ లీగ్ దశలోనే ఇంటికి
బెంగళూరు: ‘శాఫ్’ చాంపియన్‌షిప్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్ ‘ఎ’లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సునీల్ ఛెత్రి సేన 2–0 గోల్స్‌తో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. శ్రీ కంఠీరవ స్టేడియంలో భారత జోరుకు ఎదురే లేకుండా పోయింది. తొలి అర్ధ భాగంలో నేపాల్ రక్షణ శ్రేణి చురుగ్గా ఉండటంతో గోల్ చేయలేకపోయిన భారత్ ద్వితీయార్ధంలోనే ఆ రెండు గోల్స్ చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి 61వ నిమిషంలో తొలి గోల్ సాధించగా, నోరెమ్ మహేశ్ సింగ్ 70వ నిమిషంలో గోల్ చేశాడు. మరోవైపు భారత డిఫెండర్లు నేపాల్ ఫార్వర్డ్‌ను ఎక్కడికక్కడ కట్టడి చేసి వారి దాడుల్ని సమర్థంగా అడ్డుకుంది. భారత ఆటగాళ్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా ఐదు షాట్లు కొడితే... నేపాల్ ఒక షాట్‌కే పరిమితమైంది. మ్యాచ్‌లో ఎక్కువసేపు బంతిని తమ ఆదీనంలోనే ఉంచుకొన్న భారత ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటల్ని సాగనివ్వలేదు. తాజా విజయంతో సొంతగడ్డపై భారత్ అజేయమైన రికార్డు 12 మ్యాచ్‌లకు చేరింది. 2019లో సెప్టెంబర్ 5న ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన భారత్ తర్వాత స్వదేశంలో ఏ జట్టు చేతిలోనూ ఓడిపోలేదు. అంతకుముందు ఇదే గ్రూపులో కువైట్ 2–0తో పాకిస్తాన్‌ను చిత్తు చేయడంతో కువైట్ కూడా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. 27న కువైట్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌తో గ్రూప్‌లో అగ్ర స్థానంలో నిలిచేది ఎవరో తేలుతుంది. నేపాల్, పాకిస్తాన్‌లు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టాయి. It's that m̶a̶n̶ legend once again!@chetrisunil11#SAFFChampionship pic.twitter.com/wx1eSk4Y5E— FanCode (@FanCode) June 24, 2023 2️⃣ goals in quick succession 🤩 India are through to the #SAFFChampionship2023 Semifinal 👏🏽💙#NEPIND ⚔️ #IndianFootball ⚽️ #BlueTigers 🐯 pic.twitter.com/ByzfjsKSZY— Indian Football Team (@IndianFootball) June 24, 2023 చదవండి: #CheteshwarPujara: 'ఆటగదరా శివ!'.. పుజారా ఎమోషనల్ పోస్ట్ -
SAFF Championship: గెలిస్తేనే భారత్ ఫైనల్‌కు...
The South Asian Football Federation Championship Championship: దక్షిణాసియా (శాఫ్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఫైనల్‌కు చేరాలంటే నేడు మాల్దీవులు జట్టుతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు తప్పనిసరిగా గెలవాలి. ఓటమి లేదా ‘డ్రా’ చేసుకుంటే భారత్ ఇంటిదారి పడుతుంది. ప్రస్తుతం మాల్దీవులు, నేపాల్ ఆరు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా... భారత్ ఐదు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. టాప్–2 జట్లు మాత్రమే ఫైనల్‌కు చేరుతాయి. చదవండి: T20 World Cup 2021: మెంటార్‌గా ధోని ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదు.. IPL 2021: స్విమ్మింగ్‌ఫూల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల జల్సా.. -
భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ ‘డ్రా’
‘శాఫ్’ చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం జరిగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. భారత్ తరఫున సారథి సునీల్ చెత్రీ 27వ నిమిషంలో గోల్ చేశాడు. చెత్రీకిది 76వ అంతర్జాతీయ గోల్ కాగా, బ్రెజిల్ దిగ్గజం పీలే గోల్స్ (77) రికార్డును సమం చేయడానికి చెత్రీ కేవలం ఒక్క గోల్ దూరంలో ఉన్నాడు. బంగ్లా ప్లేయర్ అరాఫత్ (74వ నిమిషంలో) గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. రోహిత్‌కు నిరాశ ఓస్లో (నార్వే): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ రోహిత్ (65 కేజీలు)కు చుక్కెదురైంది. కాంస్య పతకం కోసం సోమవారం జరిగిన బౌట్లో రోహిత్‌పై ‘విక్టరీ బై ఫాల్’ పద్ధతిన తుల్గాతుముర్ ఒచిర్ (మంగోలియా) గెలుపొం దాడు. మ్యాచ్‌లో రోహిత్ 4–10తో వెనుకబడి ఉన్న సమయంలో ఒచిర్ ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు తగిలించి కొన్ని క్షణాల పాటు పట్టి ఉంచాడు. దాంతో రిఫరీ ఒచిర్‌ను విజేతగా ప్రకటించాడు. వాస్తవానికి రోహిత్ ప్రిక్వార్టర్స్‌లో ఓడగా... అతడిని ఓడించిన జగిర్ ఫైనల్‌కు చేరాడు. దాంతో రెపీచేజ్ ద్వారా రోహిత్ కాంస్యం బరిలో నిలిచాడు. తొలి మ్యాచ్‌లో రోహిత్ 12–2తో సెలాహట్టిన్ (టర్కీ)పై నెగ్గాడు. మహిళల 55 కేజీల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో భారత రెజ్లర్ పింకీ 6–8తో నినా హెమ్మర్ (జర్మనీ) చేతిలో ఓడి పసిడి పోరుకు దూరమైంది. అయితే రెపీచేజ్ పద్ధతి ద్వారా ఆమె కాంస్యం గెలిచే అవకాశం ఉంది. మరో భారత రెజ్లర్ సంగీతా ఫోగాట్ (62 కేజీలు) ప్రిక్వార్టర్స్‌లో... పురుషుల విభాగాల్లో సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు), సుశీల్ (70 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్‌ల్లో తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడారు. చదవండి: Dronavalli Harika: ఒలింపిక్ విజయంలాంటిదే.. నా భర్త అన్ని విధాలా అండగా నిలిచారు -
‘శాఫ్’లో సప్తపది
ఏడోసారి టైటిల్ గెలిచిన భారత్ * ఫైనల్లో అఫ్ఘానిస్తాన్‌పై 2-1తో గెలుపు * నిర్ణాయక గోల్ చేసిన కెప్టెన్ సునీల్ చెత్రి తిరువనంతపురం: కొత్త ఏడాది భారత ఫుట్‌బాల్‌కు కొత్త కళ తెచ్చింది. దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య కప్ (శాఫ్)లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ టీమిండియా ఏడోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ అఫ్ఘానిస్తాన్‌ను బోల్తా కొట్టించింది. భారత్ తరఫున జెజె లాల్పెఖులా (72వ నిమిషంలో), కెప్టెన్ సునీల్ చెత్రి (101వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... అఫ్ఘానిస్తాన్ జట్టుకు జుబేర్ అమీరీ (69వ నిమిషంలో) ఏకైక గోల్‌ను అందించాడు. రెండేళ్ల క్రితం జరిగిన ‘శాఫ్’ కప్ ఫైనల్లో 0-2తో అఫ్ఘానిస్తాన్ చేతిలో ఎదురైన పరాజయానికి తాజా విజయంతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సునీల్ చెత్రి నాయకత్వంలోని టీమిండియా దూకుడైన ఆటతీరు ప్రదర్శించడంతో... చివరిసారిగా ‘శాఫ్’ కప్‌లో పాల్గొన్న అఫ్ఘానిస్తాన్‌కు నిరాశ తప్పలేదు. ఇక మీదట అఫ్ఘానిస్తాన్ కొత్తగా ఏర్పాటు చేసిన మధ్య ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (సీఏఎఫ్)లో పోటీపడుతుంది. ఇప్పటివరకు జరిగిన 11 ‘శాఫ్ కప్’ టోర్నీల్లో భారత్ పదిసార్లు ఫైనల్‌కు చేరుకొని ఏడుసార్లు (1993, 1997, 1999, 2005, 2009, 2011, 2016) విజేతగా నిలిచి, మూడుసార్లు రన్నరప్ (1995, 2008, 2013)తో సంతృప్తి పడింది. అఫ్ఘానిస్తాన్ జట్టులో ఉన్న మొత్తం 20 మంది సభ్యుల్లో 15 మంది విదేశీ లీగ్‌లలో ఆడుతుండటంతో ఫైనల్లో ఆ జట్టునే ఫేవరెట్‌గా పరిగణించారు. అయితే ఫైనల్లో భారత్ తీవ్ర పోరాటపటిమ కనబరిచింది. పక్కా ప్రణాళికతో ఆడి అఫ్ఘానిస్తాన్ దూకుడుకు పగ్గాలు వేసింది. అయినప్పటికీ ఆట 69వ నిమిషంలో జుబేర్ అమీరీ చేసిన గోల్‌తో అఫ్ఘానిస్తాన్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వారి ఆనందం మూడు నిమిషాల్లోనే ఆవిరైంది. 72వ నిమిషంలో జెజె గోల్‌తో స్కోరు సమమైంది. నిర్ణీత 90 నిమిషాల వరకు రెండు జట్లు 1-1తో సమఉజ్జీగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు అదనంగా 30 నిమిషాలు ఆడించారు. ఈ అదనపు సమయంలో సునీల్ చెత్రి భారత్‌కు గోల్ అందించి జట్టును 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత మరో 19 నిమిషాలు అఫ్ఘానిస్తాన్ జోరుకు పగ్గాలు వేసిన భారత్ విజయాన్ని ఖాయం చేసుకుంది.