బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో శుభారంభం చేసింది. పాకిస్తాన్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో భారత్ 4–0 గోల్స్ తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి (10వ, 16వ, 74వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించగా... మరో గోల్‌ను ఉదాంత సింగ్ (81వ ని.లో) అందించాడు.శనివారం తమ తదుపరి మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్ ఆడుతుంది.
మ్యాచ్ మధ్యలో భారత్-పాక్ ఆటగాళ్ల గొడవ..
పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ మొరటుగా వ్యవహరించడంతో ఆయనకు మ్యాచ్ రిఫరీ ప్రజ్వల్ ఛెత్రి రెడ్ కార్డు చూపించి మైదానం బయటకు పంపించారు. భారత జట్టు రెండో గోల్ చేసిన తర్వాత పాక్ ప్లేయర్ అబ్దుల్లా ఇక్బాల్ త్రో ఇన్ చేయడానికి సిద్ధంకాగా స్టిమాక్ అబ్దుల్లా నుంచి బంతిని లాక్కున్నారు.
స్టిమాక్ చర్యకు పాక్ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. రిఫరీ జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దడంతోపాటు స్టిమాక్‌కు రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపించి మ్యాచ్‌ను కొనసాగించారు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో కువైట్ జట్టు 3–1తో నేపాల్ జట్టును ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో లెబనాన్‌తో బంగ్లాదేశ్; మాల్దీవులుతో భూటాన్ తలపడతాయి.
IND vs PAK sees RED in the first half 🤯
— FanCode (@FanCode) June 21, 2023
India vs Pakistan is never fully complete without the fireworks and heated emotions 💥#INDvPAKonFanCode #SAFFChampionship2023 pic.twitter.com/xJLZTmcrp5
Comments
Please login to add a commentAdd a comment