
భువనేశ్వర్: ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–0 గోల్ తేడాతో వనుతూను ఓడించింది. భారత్ తరఫున ఏకైక గోల్‌ను కెప్టెన్ సునీల్ ఛెత్రి 81వ నిమిషంలో సాధించాడు. తొలి మ్యాచ్‌లో శుక్రవారం మంగోలియాను 2–0తో ఓడించిన భారత్ తమకంటే చాలా తక్కువ ర్యాంక్‌లో ఉన్న వనుతూపై విజయం సాధించేందుకు కూడా శ్రమించాల్సి వచ్చింది.
తొలి అర్ధభాగంలో చాలా వరకు బంతిని తమ ఆదీనంలోనే ఉంచుకున్నా...గోల్ చేసేందుకు భారత్ చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. మైదానంలో తన భార్య సోనమ్ మ్యాచ్‌ను తిలకిస్తుండగా...త్వరలో తండ్రి కాబోతున్న సంకేతాన్ని ఛెత్రి తన గోల్ సంబరంలో ప్రదర్శించాడు. రెండు విజయాల తర్వాత 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ తమ చివరి పోరులో గురువారం లెబనాన్‌తో తలపడుతుంది.
చదవండి: IND vs WI: టీమిండియా విండీస్ టూర్ షెడ్యూల్ ఖరారు.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
Comments
Please login to add a commentAdd a comment