
సునీల్ చెత్రీ
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియాలో ఇప్పుడంతా ఫుట్ బాల్ మ్యాచ్‌ల గురించే చర్చ. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే ఫీఫా వరల్డ్ కప్-2018 ప్రారంభం కానుంది. అయితే ప్రపంచకప్ టోర్నీకి భారత్ అర్హత సాధించనప్పటికీ ఈ ఆటను ఆరాధించే అభిమానులున్నారు. స్టార్ ఆటగాళ్లతో ఐపీఎల్ తరహాలో ఇండియన్ సూపర్ లీగ్ పేరిట ఫుట్ బాల్ లీగ్‌ను సైతం నిర్వహించారు. అయితే ఈ లీగ్‌కు అనుకున్నంత ఆదరణ లభించలేదు. క్రికెట్‌ను పిచ్చిగా ఆరాధించే ఈ దేశంలో ఇప్పుడిప్పుడే ఇతర క్రీడలకు ఆదరణ లభిస్తోంది.
ఇటీవల భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీ సోషల్ మీడియా వేదికగా ‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ స్టేడియానికి వచ్చి మేం ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడండి’ అని ఆవేదనతో అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఈ విన్నపంపై దిగ్గజ క్రికెటర్లు సచిన్, కోహ్లిలు స్పందించి తమ మద్దతు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ అంశం చర్చనీయాంశం కావడంతో నెటిజన్లు సునీల్ చెత్రీ టాప్-5 గోల్స్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఆ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇటీవల జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో భాగంగా చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ సునీల్ చెత్రి హ్యాట్రిక్ గోల్స్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment