
ఫుట్‌బాల్‌లో భారత్ స్థానం ఎక్కడో అడుగున ఉండొచ్చు. కానీ ఆయన మాత్రం భారత ఆటగాళ్లెవ్వరూ అందుకోలేనంత ఎత్తుకి చేరాడు. ప్రత్యర్థి ఎవరైనా.. ఆడుతోంది ఎక్కడైనా.. ఉత్తమ ప్రదర్శనతో జట్టును గెలిపించడమే ధ్యేయంగా సాగిపోతాడు. ఆ ఒకే ఒక్కడు కెప్టెన్ సునీల్ ఛెత్రి.. ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తాజాగా ప్రకటించారు.


































