బెంగళూరు: స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి (8వ, 73వ, 90+8వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించడంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ ఏడో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో బెంగళూరు జట్టు 4–2 గోల్స్‌తో కేరళ బ్లాస్టర్స్‌పై గెలుపొందింది. భారత మాజీ కెపె్టన్ ఛెత్రి ఐఎస్‌ఎల్‌లో హ్యాట్రిక్ నమోదు చేసిన పెద్ద వయసు్కడి (40 ఏళ్ల 126 రోజులు)గా రికార్డుల్లోకి ఎక్కాడు.
గతంలో ఓగ్బచే (38 ఏళ్ల 96 రోజుల్లో) పేరిట ఉన్న ఈ రికార్డును ఛెత్రి తిరగరాశాడు. ర్యాన్ విలియమ్స్ (38వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. కేరళ బ్లాస్టర్స్ తరఫున జీసెస్ జిమెన్జ్ (56వ నిమిషంలో), ఫ్రెడ్డీ (67వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. నిర్ణీత సమయంలో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై ఐదుసార్లు దాడి చేసి అందులో నాలుగు గోల్స్ సాధించగా.. కేరళ బ్లాస్టర్స్ ఏడుసార్లు ప్రయతి్నంచి అందులో రెండు సార్లు మాత్రమే సఫలమైంది.
ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ 7 విజయాలు, 2 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 23 పాయింట్లు ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కేరళ జట్టు 11 పాయింట్లతో పట్టిక పదో స్థానంలో నిలిచింది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ 2–0 గోల్స్ తేడాతో చెన్నైయిన్ ఎఫ్‌సీపై గెలుపొందింది. ఈస్ట్ బెంగాల్ జట్టు తరఫున విష్ణు (54వ నిమిషంలో), జాక్సన్ సింగ్ (84వ నిమిషంలో) చెరో గోల్‌తో సత్తా చాటారు.
Comments
Please login to add a commentAdd a comment