హైదరాబాద్ : ‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ స్టేడియానికి వచ్చి మేం ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడండి’ అని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి ఆవేదనతో పిలుపుచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లు ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు వెళ్లాలని తమ ఫాలోవర్లకు పిలుపునిచ్చారు. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం స్పందించారు. తన ట్విటర్ అకౌంట్ ద్వారా..‘కమాన్ ఇండియా.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఎక్కడ ఎప్పుడు జరిగిన వెళ్లి మన జట్లకు మద్దతిస్తూ.. మైదానాలను నింపేద్దాం’ అని పిలుపునిచ్చాడు.
C'mon India... Let's fill in the stadiums and support our teams wherever and whenever they are playing. @chetrisunil11 @IndianFootball pic.twitter.com/xoHsTXEkYp
— Sachin Tendulkar (@sachin_rt) June 3, 2018
‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ భారత ఫుట్‌బాల్ జట్టు ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి చూడండి. యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్‌లకు సపోర్ట్ తెలిపే మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆటలో వారి స్థాయిని మేం అందుకోలేకపోవచ్చు. మా మ్యాచ్‌కు వచ్చి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలని అనిపించొచ్చు. మేం కాదనట్లేదు, ఆ స్థాయిలో మా ఆట లేదనే విషయాన్ని కూడా ఒప్పుకుంటాం. కానీ ఆట పట్ల మా నిబద్ధత, ప్రేమతో మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాం’ అని చెత్రీ అభిమానులను అభ్యర్థించాడు.
Comments
Please login to add a commentAdd a comment