రొనాల్డో హ్యాట్రిక్‌ గోల్స్‌.. అగ్రస్థానంలోకి! వీడియో వైరల్‌ | Saudi Pro League Cristiano Ronaldo Scores Hat Trick Video Viral | Sakshi
Sakshi News home page

Cristiano Ronaldo: రొనాల్డో హ్యాట్రిక్‌ గోల్స్‌.. అగ్రస్థానంలోకి! వీడియో వైరల్‌

Published Sun, Feb 26 2023 12:25 PM | Last Updated on Sun, Feb 26 2023 12:37 PM

Saudi Pro League Cristiano Ronaldo Scores Hat Trick Video Viral - Sakshi

రొనాల్డో హ్యాట్రిక్‌ (PC: Twitter)

Cristiano Ronaldo-  Al-Nassr: సౌదీ ప్రొ లీగ్‌లో ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో హ్యాట్రిక్‌ గోల్స్‌తో మెరిశాడు. అద్భుత ఆట తీరుతో అభిమానులకు కనువిందు చేశాడు. మాంచెస్టర్‌ యునైటెడ్‌తో తెగదెంపులు చేసుకున్న అనంతరం.. రొనాల్డో దుబాయ్‌కు చెందిన అల్‌ నజర్‌ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పటికే ఆ జట్టు పగ్గాలు చేపట్టి సౌదీ ప్రొ లీగ్‌లో ముందుకు నడిపిస్తున్న రొనాల్డో శనివారం నాటి మ్యాచ్‌లో వరుసగా మూడు గోల్స్‌ సాధించాడు. దీంతో ప్రిన్స్‌ సుల్తాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ స్టేడియంలో డమాక్‌తో పోరులో అల్‌ నజర్‌ గెలుపొందింది.

జట్టును గెలిపించి.. అగ్రస్థానానికి
మ్యాచ్‌ 18వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన ఈ పోర్చుగీస్‌ స్టార్‌.. 23వ నిమిషంలో రెండో గోల్‌ సాధించాడు. ఇక తొలి అర్ధ భాగం ముగస్తుందన్న ఆఖరి నిమిషంలో మరో గోల్‌ కొట్టి హ్యాట్రిక్‌ పూర్తి చేసుకున్నాడు. రెండో అర్ధ భాగంలో ఇరు జట్లకూ గోల్‌ చేసే అవకాశం రాలేదు.

ఈ క్రమంలో రొనాల్డో సారథ్యంలోని అల్‌ నజర్‌ 3-0తో విజయఢంకా మోగించింది. కాగా అల్‌ నజర్‌ కెప్టెన్‌గా రొనాల్డోను నియమించడం పట్ల సహచర ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేశారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే, వాళ్లు మాత్రం తమకు రొనాల్డోతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

కాగా అల్‌ నజర్‌ సౌదీ ప్రొ లీగ్‌లో 2022-23 సీజన్‌లో ఇప్పటి వరకు పద్దెమినిదికి గానూ పదమూడింట గెలిచింది. నాలుగు డ్రా చేసుకుని.. ఒక మ్యాచ్‌లో ఓడింది. ప్రస్తుతం టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతోంది.

చదవండి: వాళ్లకేం ఖర్మ? ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు.. బీసీసీఐని చూసి పీసీబీ నేర్చుకోవాలి: పాక్‌ మాజీ ప్లేయర్‌
BGT: దానర్థం జట్టు నుంచి తప్పించినట్లు కాదు! రాహుల్‌కు మరిన్ని అవకాశాలు! వైస్‌ కెప్టెన్‌గా అతడే సరైనోడు.. కాకపోతే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement