'ఏంటో సిరాజ్‌.. నీ సెలబ్రేషన్స్‌తో భయపెడుతున్నావు' | Cricket Fans Comments Mohammad Siraj Ronaldo Celebration Getting Wicket | Sakshi
Sakshi News home page

Mohammad Siraj: 'ఏంటో సిరాజ్‌.. నీ సెలబ్రేషన్స్‌తో భయపెడుతున్నావు'

Published Sun, Feb 6 2022 4:13 PM | Last Updated on Sun, Feb 6 2022 4:25 PM

Cricket Fans Comments Mohammad Siraj Ronaldo Celebration Getting Wicket - Sakshi

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వికెట్‌ పడిన ప్రతీసారి తనదైన శైలిలో సెలబ్రేట్‌ చేసుకోవడం గమనిస్తున్నాం. ఈ మధ్యన స్టార్‌ ఫుట్‌బాలర్‌ రొనాల్డోను గుర్తుకుతెస్తూ సిరాజ్‌ ''సూ'' అని అరవడం మొదలుపెట్టాడు. రొనాల్డో గోల్‌ కొట్టాకా వెనక్కి తిరిగి తన చేతులను పైకి లేపుతూ ఇలాగే చేసేవాడు. తాజాగా సిరాజ్‌ మరోసారి రొనాల్డోను గుర్తుకుతెస్తూ సెలబ్రేట్‌ చేసుకోవడం వైరల్‌గా మారింది. 

చదవండి: Yuzvendra Chahal: అదరగొట్టిన చహల్‌.. అత్యంత తక్కువ వన్డేల్లో

వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ సిరాజ్‌ వేశాడు. విండీస్‌ ఓపెనర్‌ షైయ్‌ హోప్‌ ఆ ఓవర్‌లో రెండు, మూడు బంతులను ఆఫ్‌సైడ్‌ దిశగా బౌండరీలుగా మలిచాడు. దీంతో సిరాజ్‌ నాలుగో బంతిని కూడా అదే తరహాలో వేశాడు. అయితే హోప్‌ ఈసారి మిస్‌ చేశాడు. ఐతే బంతి అనూహ్యంగా స్వింగ్‌ అయి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకొని మిడిల్‌, లెగ్‌ స్టంప్‌లను ఎగురగొట్టింది. అంతే సిరాజ్‌ తనలోని రొనాల్డోను మరోసారి బయటికి తీశాడు. సూ అంటూ గట్టిగా అరుస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే సిరాజ్‌ సెలబ్రేషన్స్‌పై టీమిండియా ఫ్యాన్స్‌ వినూత్న రీతిలో స్పందించారు. ''నీ సెలబ్రేషన్స్‌ ఏంటో గానీ.. మమ్నల్ని భయపెడుతున్నావు.. రొనాల్డో సెలబ్రేషన్‌ చూసి బోర్‌ కొట్టింది.. కాస్త కొత్తగా ట్రై చేయ్‌'' అంటూ కామెంట్స్‌ చేశారు.  
చదవండి: Rohit Sharma: విండీస్‌తో వన్డే సిరీస్‌.. రోహిత్‌ ముంగిట అరుదైన రికార్డులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement