Mohd. Siraj has been released from Team India’s ODI squad: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. మడిమ నొప్పితో బాధపడుతున్న కారణంగా.. మేనేజ్‌మెంట్ అతడికి విశ్రాంతినిచ్చింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి గురువారం ధ్రువీకరించింది. విండీస్‌తో తొలి వన్డే ఆరంభానికి ముందు ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
‘‘వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి మహ్మద్ సిరాజ్‌ను రిలీజ్ చేస్తున్నాం. ఈ రైట్ ఆర్మ్ పేసర్ తనకు మడిమ నొప్పి ఉందని చెప్పాడు. అందుకే.. బీసీసీఐ వైద్య బృందం సూచన మేరకు ముందు జాగ్రత్త చర్యగా అతడికి విశ్రాంతినిస్తున్నాం’’ అని బీసీసీఐ పేర్కొంది.
ఇక సిరాజ్ స్థానాన్ని ప్రస్తుతానికి ఎవరితో భర్తీ చేయడం లేదని బోర్డు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కాగా జూలై 27, 29- ఆగష్టు 1 తేదీల్లో వెస్టిండీస్- టీమిండియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. తొలి రెండు వన్డేలకు బార్బడోస్ వేదికగా కాగా.. ఆఖరి మ్యాచ్‌కు ట్రినిడాడ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌లు రాత్రి ఏడు గంటలకు ఆరంభం కానున్నాయి. అయితే, తొలి వన్డేకు వర్ష సూచన ఉందని విండీస్ వాతావరణ శాఖ హెచ్చరించడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఇక రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు టీమిండియా కరేబియన్ దీవికి వెళ్లిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్ సేన.. వర్షం కారణంగా రెండో మ్యాచ్ డ్రాగా ముగియడంతో కీలక డబ్ల్యూటీసీ పాయింట్లు కోల్పోయింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరం కాగా.. సీనియర్ మహ్మద్ షమీకి రెస్ట్ ఇస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో సిరాజ్ అన్ని ఫార్మాట్లలో కీలక పేసర్‌గా సేవలు అందిస్తున్న తరుణంలో మడిమ నొప్పి రావడం మేనేజ్‌మెంట్‌ను కలవరపరుస్తోంది. అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న తరుణంలో ఇది టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బే అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చహల్, కుల్దీప్, జైదేవ్ ఉనాద్కట్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్.
చదవండి: వరల్డ్‌కప్ టోర్నీకి అందుబాటులో ఉండను.. హాలిడేకి వెళ్తున్నా: ఇంగ్లండ్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment