
క్రిస్టియానో రొనాల్డో.. పోర్చుగల్ ఫుట్‌బాల్ చరిత్రలో సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్న మేటి ఆటగాడు. అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి గోల్స్.. ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక బాలన్ డి ఓర్ అవార్డులు.
ఎన్నో చాంపియన్ లీగ్ మెడల్స్! మూడు దేశాల్లో క్లబ్ టైటిల్స్ గెలిచిన ఫుట్‌బాలర్..అయితే, ఒక్కసారైనా ప్రపంచకప్ గెలవాలన్న రొనాల్డో కల మాత్రం నెరవేరలేదు.
సమకాలీకుడు, తనకు పోటీగా ఉన్న ఏకైక ఆటగాడు, అర్జెంటీనా లియోనల్ మెస్సీ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడుతుంటే చూస్తూ భావోద్వేగానికి గురికావడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడీ పోర్చుగల్ స్టార్. ఒకరకంగా మెస్సీతో జరిగిన పోటాపోటీలో తాను ఓడిపోయాననే బాధతోనే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
ఆట పరంగా రొనాల్డో, మెస్సీల మధ్య స్నేహపూర్వక శత్రుత్వం ఉన్నా.. బయట మాత్రం వారిద్దరు గుడ్ ఫ్రెండ్స్! బాలన్ డి ఓర్ అవార్డు-2017 ఫంక్షన్ సందర్భంగా రొనాల్డో తల్లి డొలోర్స్ అవెరో ఈ విషయాన్ని వెల్లడించారు. మెస్సీ ఉన్నత వ్యక్తిత్వం కలవాడని పేర్కొంటూ.. తన మనవడు క్రిస్టియానో రొనాల్డో జూనియర్‌కు తండ్రి ఆట కంటే మెస్సీ ఆట అంటేనే ఎక్కువ ఇష్టం అని తెలిపారు.
అందుకు తగ్గట్లుగానే జూనియర్ రొనాల్డో ఆ వేదికపై మెస్సీని చూడగానే ఆనందంతో పొంగిపోయాడు. అయితే, అక్కడున్నది నిజంగా మెస్సీ కాదనే భావనలో ఉన్న జూనియర్ తన తండ్రి చెప్పినా ఆ విషయాన్ని నమ్మలేకపోయాడు.
రొనాల్డో తన కుమారుడికి మెస్సీని చూపిస్తూ.. ‘‘అక్కడున్నది ఎవరు? అక్కడ సూట్ వేసుకుని నిల్చుని ఉన్న వ్యక్తి ఎవరు?’’ అని ప్రశ్నించాడు. అంతలోనే మెస్సీ వచ్చి జూనియర్ రొనాల్డోను హగ్ చేసుకుని.. ముద్దు కూడా పెట్టి.. ‘‘నువ్వ బాగానే ఉన్నావు కదా?’’ అని ఆప్యాయంగా పలకరించాడు.
When Cristiano Jr. meets Lionel Messi. pic.twitter.com/ydixmN2SyK
— Historic Vids (@historyinmemes) March 3, 2024
తాను చూస్తున్నది నిజమని అప్పటికీ నమ్మలేకపోయిన జూనియర్ రొనాల్డోను తండ్రి మళ్లీ దగ్గరకు తీసుకోగా.. మెస్సీ సైతం చిరునవ్వులు చిందించాడు. ఈ ఘటన జరిగినపుడు జూనియర్ రొనాల్డోకు సుమారుగా ఆరేళ్ల వయసు ఉంటుంది.
ఇక తండ్రిని కాదని.. మెస్సీనే తన రోల్‌మోడల్ అని చెప్పిన ఆ పిల్లాడు ఇప్పుడు ఓ జట్టును చాంపియన్‌గా నిలిపే స్థాయికి చేరాడు. అండర్ 13 లీగ్ ట్రోఫీలో అల్ నసర్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి ట్రోఫీని ముద్దాడాడు. ఈ నేపథ్యంలో రొనాల్డో- మెస్సీ అనుబంధం... జూనియర్ రొనాల్డో టైటిల్ విన్నింగ్ మూమెంట్స్‌కు సంబంధించిన క్షణాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మీరూ ఓ లుక్కేయండి!
Comments
Please login to add a commentAdd a comment