Flashback Sports
-
Aus vs Ind 2018-19: దటీజ్ విరాట్ కోహ్లి.. 71 ఏళ్ల నిరీక్షణకు తెర
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లు అంటే అందరికి టక్కున గుర్తు వచ్చేది కపిల్ దేవ్, ఎంస్ ధోని, గంగూలీ మాత్రమే. మరి కొంతమంది రోహిత్ శర్మ పేరు కూడా చెబుతారు. కానీ దాదాపు మూడేళ్ల పాటు భారత జట్టుకు సారథ్యం వహించిన విరాట్ కోహ్లి పేరు ఎవరూ చెప్పరు. ఎందుకుంటే పైన పేర్కొన్న నలుగురు కెప్టెన్లు కూడా కనీసం ఒక్క ఐసీసీ టైటిల్‌నైనా భారత్‌కు అందించారు.విరాట్ 140 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు సారథ్యం వహించినప్పటకి.. కనీసం ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. కానీ ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కానీ ఓ ఘనతను మాత్రం విరాట్ కోహ్లి తన పేరిట లిఖించుకున్నాడు. ఈ విరాటుడు ఆస్ట్రేలియా గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లి నాయకత్వంలోనే భారత్ తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది.71 ఏళ్ల నిరీక్షణకు తెర2019 జనవరి 7... ఈ తేదికి భారత క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేకత ఉంది. సరిగ్గా అదే రోజున విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. 71 ఏళ్లగా ఆసీస్ గడ్డపై ఊరిస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుని తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. 2018 డిసెంబర్లో బోర్డర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది.మొదట భారత జట్టుపై ఎటువంటి అంచనాలు లేవు. ఈ క్రమంలో డిసెంబర్ 6 నుంచి 10 వరకు ఆడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 32 పరుగుల తేడాతో భారత్ సంచలన విజయం సాధించింది. దీంతో టీమిండియా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ఆ తర్వాత పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆసీస్ అద్బుతమైన కమ్ బ్యాక్ ఇచ్చి భారత్‌ను 146 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో సిరీస్ 1-1 సమమైంది. అనంతరం మెల్బోర్న్లో జరిగిన మూడో టెస్టులో విరాట్ సేన పంజా విసిరింది. 137 పరుగుల తేడాతో కంగూరులను భారత్ ఓడించింది. దీంతో భారత్ మళ్లీ 2-1 ఆధిక్యంలోకి వచ్చింది.ఈ క్రమంలో 2019 జనవరి 7 నుంచి 11 వరకు సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టును డ్రా ముగించిన టీమిండియా.. 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. కంగారూ గడ్డపై ట్రోఫీ గెలిచిన తొలి ఆసియా దేశంగా రికార్డులకెక్కింది. "2011 ప్రపంచకప్ కన్నా ఈ గెలుపు ఎక్కవ ఆనందం ఇచ్చింది".. ఇవి సిరీస్ గెలిచిన అనంతరం అప్పటి భారత సారథి కోహ్లి చెప్పిన మాట. కాగా ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా(521) నిలిచాడు. అదేవిధంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా(21), ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్‌తో కలిసి సమంగా నిలిచాడు. -
ఐదు మహా సముద్రాలను ఈదిన యోధుడు.. అయినా పాపం! ఎవరీ మిహిర్?
ధ్యాన్ చంద్, కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్, ప్రకాశ్ పదుకొణె, విశ్వనాథన్ ఆనంద్.. ఇలా భారత క్రీడా రంగంలో ఎంతో మంది దిగ్గజాలు ఉన్నారు. అయితే, వీరిలా గుర్తింపునకు నోచుకోని ‘అన్సంగ్ హీరోలు’ కూడా చాలా మందే ఉన్నారు. ఆ జాబితాలోని మేటి స్విమ్మర్ మిహిర్ సేన్ గురించి నేటి కథనంలో తెలుసుకుందాం!భారతీయులకేం తక్కువ?ఒకే ఏడాదిలో ఐదు ఖండాల్లోని మహా సముద్రాలను ఈదగల సత్తా భారతీయులకు ఉందని మిహిర్ సేన్ నిరూపించాడు. సాధారణ కుటుంబంలో జన్మించి.. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా చరిత్రకెక్కాడు. 1930లో బెంగాల్ ప్రెసిడెన్సీలో జన్మించాడు మిహిర్ సేన్.తల్లిదండ్రులు రమేశ్ సేన్- లీలావతి. మిహిర్‌కు ఎనిమిదేళ వయసు ఉన్నపుడు వారు ఒడిశాకు మకాం మార్చారు. కుమారుడికి మెరుగైన విద్య అందించేందుకు లీలావతి ఎంతగానో కష్టపడేవారు. చికెన్, కోడిగుడ్లు, పాలు అమ్ముతూ జీవనోపాధి పొందుతూ... కొడుకు కోసం డబ్బు కూడబెట్టేవారు. తల్లి కష్టాన్ని చూసిన మిహిర్ సేన్.. చదువులో రాణించాడు.నైట్ పోర్టర్గాన్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. అనంతరం.. నాటి ఒడిశా ప్రభుత్వ సాయంతో ఉన్నత విద్య కోసం యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లాడు. అయితే, చదువు సాఫీగా సాగాలన్నా.. కడుపు నిండాలన్నా ఏదో ఒక పని చేయాల్సిన పరిస్థితి. అలాంటి సమయంలో మిహిర్ సేన్ ఓ రైల్వే స్టేషన్లో నైట్ పోర్టర్‌గా పనిచేసినట్లు కథనాలు ఉన్నాయి.అయితే, ఆ తర్వాత మిహిర్ ఇంగ్లండ్‌తో భారత రాయబారి క్రిష్ణ మెనన్ దగ్గర ఉద్యోగంలో చేరాడట. లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకుని చదువుకుంటూ.. 1954లో లింకన్స్ ఇన్‌లోని బార్లో అడ్వకేట్‌గా తన పేరును నమోదు చేసుకున్నాడుఅంతగా నైపుణ్యం లేదు.. అయినాఅలా రోజులు గడుస్తుండగా.. స్విమ్మింగ్‌పై మక్కువ పెంచుకున్న మిహిర్ సేన్.. అమెరికన్ మహిళ ఫ్లోరెన్స్ చాడ్విక్ను చూసి స్ఫూర్తి పొందాడు. 1950లో ఫ్లోరెన్స్ ఇంగ్లిష్ చానెల్‌ను ఈదిన తొలి మహిళగా రికార్డు సృష్టించారంటూ వార్తా పత్రికలో వచ్చిన కథనం మిహిర్ దృష్టిని ఆకర్షించింది.అయితే, ఈతలో మిహిర్‌కు అంత నైపుణ్యం లేదు. అయినప్పటికీ దేశం కోసం ఈ ఘతన సాధించాలని భావించాడు. స్థానికంగా ఉన్న నిపుణుల దగ్గరకు వెళ్లి పాఠాలు నేర్చుకున్నాడు. అలా 1958, సెప్టెంబరు 27న అతడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. డోవర్ నుంచి కలస్ వరకు 14 గంటల 45 నిమిషాల్లో చానెల్(32 కిలో మీటర్లు)ను ఈదాడు. అత్యంత వేగంగా ఈ దూరాన్ని దాటిన నాలుగో స్విమ్మర్‌గా నిలిచాడు.ప్రధాని ఇందిరా గాంధీ మద్దతుఈ నేపథ్యంలో.. ఆ మరుసటి ఏడాది భారత ప్రభుత్వం మిహిర్‌ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అయితే, ఆ ఒక్క చానెల్‌తో మిహిర్ స్మిమ్మింగ్ తృష్ణ తీరలేదు. ఐదు ఖండాల్లోని మహాసముద్రాలను ఈదాలని నిర్ణయించుకున్నాడు. కానీ అందుకు చాలా ఖర్చవుతుంది. ఎలాగోలా స్పాన్సర్లను సంపాదించిన మిహిర్‌కు నాటి ప్రధాని ఇందిరా గాంధీ కూడా మద్దతుగా నిలిచారు.ఇక తన ప్రయాణంలో భాగంగా తొలుత 1966లో ఏప్రిల్ 5-6 మధ్య భారత్- శ్రీలంక మధ్య ఉన్న పాక్ జలసంధిని 25 గంటల 26 నిమిషాల్లో ఈదాడు మిహిర్. అనంతరం.. యూరోప్-ఆఫ్రికా నడుమ జిబ్రాల్టర్ జలసంధిని దాటడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. అదే ఏడాది ఆగష్టు 24న 8 గంటల ఒక నిమిషంలో ఈ టార్గెట్‌ను పూర్తి చేశాడు. ఆ తర్వాత సెప్టెంబరు 12న 40 మైళ్ల దూరం ఉన్న డర్డానెల్స్(గల్లిపొలి, యూరోప్- సెడుల్బహిర్,ఆసియా మైనర్) ఈది.. ప్రపంచంలో ఈ ఫీట్ నమోదు చేసిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సాధించాడు.అంతేకాదు.. అదే ఏడాది బొస్ఫరస్(టర్కీ)ను నాలుగు గంటల్లోనే ఈది ఈ ఘనత సాధించిన తొలి నానో-అమెరికన్‌గా నిలిచాడు. ఇక అక్టోబరు 29-31 మధ్య పనామా కాలువ(50 మైళ్ల పొడవు)ను 34 గంటల 15 నిమిషాల్లో ఈదేశాడు. తద్వారా గిన్నిస్ బుక్‌లో తన పేరును లిఖించుకున్నాడు. 1967లో పద్మవిభూషణ్ అవార్డు మిహిర్ సేన్ సొంతమైంది.ఉద్యమం.. విజయవంతంఅయితే, ఇండియాకు తిరిగి వచ్చిన తొలినాళ్ల(1958)లో క్లబ్స్‌లో ప్రవేశించేందుకు మిహిర్‌కు అనుమతి దొరకలేదు. కేవలం శ్వేతజాతీయులకు మాత్రమే ఎంట్రీ అనే నిబంధన ఇందుకు కారణం. దీంతో ఈ రూల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన మిహిర్.. దానిని ఎత్తివేయించడంలో సఫలమయ్యాడు. ఇక తొలుత కలకత్తా హైకోర్టులో క్రిమినల్ లా ప్రాక్టీస్ చేసిన మిహిర్ సేన్.. విజయవంతమైన వ్యాపారవేత్తగానూ రాణించాడు. అయితే, పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా 66 ఏళ్ల వయసులోనే మిహిర్ సేన్ ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి వెళ్లిపోయాడు. -
టీమిండియా దిగ్గజం అవుతాడనుకుంటే.. పాపం!
భారత క్రికెట్లో ఇప్పుడైతే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి వరల్డ్ క్లాస్ పేసర్లు ఉన్నారు. కానీ 1990లలో ఇండియన్ క్రికెట్ పరిస్ధితి పేరు. అప్పటిలో జవగల్ శ్రీనాథ్ మినహా చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్లు ఎవరూ లేరు. వెంకటేష్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్, అజిత్ అగార్కర్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నప్పటికి.. వారి పేస్ మాత్రం ప్రత్యర్ధులను భయపెట్టేది కాదు. సరిగ్గా అదే సమయంలో ఓ కర్ణాటక కుర్రాడు దేశీవాళీ క్రికెట్లో 157.8 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ అందరిని ఆకర్షించాడు. భారత క్రికెట్లో అప్పటివరకు ఎవరు కనీవినీ ఎరుగని స్పీడ్ అది. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యర్ధి బ్యాటర్లు భయపడేవారు. తన రా పేస్‌తో బ్యాటర్లను వణికించేవాడు. ఓ దశలో అతడు... షోయబ్ అక్తర్, జవగల్ శ్రీనాథ్‌ను మించిపోతాడని అంతా భావించారు. ఆ కుర్రాడు తన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్‌తో బీసీసీఐ సెలక్టర్లు దృష్టిలో పడ్డాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా భారత జట్టుకు ఎంపికయ్యాడు. 1996 అక్టోబరు 10న ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుతో ఆ యంగ్ పేస్‌గన్ టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు.దీంతో భారత క్రికెట్ జట్టుకు ఓ ఆణిముత్యం లభించిందని అందరూ తెగ సంబర పడ్డారు. కానీ ఆ సంతోషం రెండు మ్యాచ్‌లకే ముగిసి పోయింది. మరో అక్తర్ అవుతాడనకున్న ఆ యువ సంచలనం కెరీర్ కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమైంది. ఆ యువకుడు తన కెరీర్‌నే కాదు తన జీవితాన్ని కూడా అర్ధంతరంగా ముగించాడు. భారత క్రికెట్‌కు జెట్ స్పీడ్ పరిచయం చేసిన ఆ కర్ణాటక కుర్రాడు.. ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద గాథ మరెవరిదో కాదు.. టీమిండియా మాజీ పేసర్, దివంగత కర్ణాటక ఫాస్ట్ బౌలర్ డేవిడ్ జాన్సన్‌ది. ఎవరీ డేవిడ్ జాన్సన్..?డేవిడ్ జాన్సన్ 1971 అక్టోబరు 16న కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా అర్సికెరెలో జన్మించాడు. డేవిడ్ జాన్సన్ తండ్రి ఆంగ్లో-ఇండియన్. జాన్సన్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కవ. అందుకు తగ్గట్టే స్కూల్ డేస్ నుంచే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. ఈ క్రమంలో 1992-93 రంజీ సీజన్లో కర్ణాటక తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన అరంగేట్ర సీజన్లోనే కేరళపై పది వికెట్ల హాల్ సాధించి సత్తాచాటాడు. ఆ తర్వాత జాన్సన్ వెనుదిరిగి చూడలేదు.దేశీవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ ముందుకు దూసుకెళ్లాడు. కర్ణాటక జట్టుకు ఎన్నో సంచలన విజయాలుఅందించాడు. ఈ క్రమంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన నాలుగేళ్లకు అతడికి భారత సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. 1996లో ఢిల్లీలో ఆసీస్ జరిగిన ఏకైక టెస్టు కోసం జాన్సన్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆ మ్యాచ్‌కు జవగల్ శ్రీనాథ్ గాయం కారణంగా దూరం కావడంతో జాన్సన్‌కు భారత జట్టులో చోటుదక్కింది.తన తొలి మ్యాచ్‌లో జాన్సన్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఆ తర్వాత అతడిని అదే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా తీసుకువెళ్లారు. డర్బన్ వేదికగా సఫారీలతో జరిగిన తొలి టెస్టులో 2 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. కానీ అదే తనకు ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందని జాన్సన్ అస్సలు ఊహించలేదు.ఆ తర్వాత బీసీసీఐ అతడికి జట్టులో చోటివ్వలేదు. దీంతో కేవలం రెండు మ్యాచ్‌లతోనే అతడి కెరీర్ ముగిసిపోయింది. భారత జట్టు తరపున అత్యున్నత స్ధాయిలో సత్తాచాటాలన్న అతడి కల కలగానే మిగిలిపోయింది. తన అంతర్జాతీయ కెరీర్లో రెండు మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు సాధించిన జాన్సన్.. ఫస్ట్ క్రికెట్లో 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఏకంగా 125 వికెట్లు పడగొట్టాడు.బీసీసీఐ సపోర్ట్ చేయలేదా?అయితే ఒక విధంగా చెప్పాలంటే జాన్సన్ కెరీర్ పతనానికి బీసీసీఐ కూడా ఓ కారణమనే చెప్పుకోవాలి. ఎందుకంటే 157 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ వేసే ఫాస్ట్‌బౌలర్‌కు కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితం చేయడం అందరిని విస్మయానికి గురి చేసింది. ఎంతో మంది గొప్ప క్రికెటర్లు సైతం తమ కెరీర్ ఆరంభంలో ఇబ్బంది పడి వచ్చినవారే.అటువంటిది జాన్సన్‌ను మరికొన్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఇచ్చి ఉంటే.. ఈ రోజు భారత క్రికెట్ మొత్తం తనను గుర్తు పెట్టుకుని ఉండేదేమో!!.. అతడు కూడా జవగల్ శ్రీనాథ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే వంటి కర్ణాటక దిగ్గజాల సరసన చేరే వాడేమో!!. కానీ అప్పట్లో భారత క్రికెట్లో రాజకీయాల జోక్యం వల్ల ఓ అద్బుతమైన ఫాస్ట్ బౌలర్ కెరీర్ ఆదిలోనే అంతమైపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఆత్మహత్యకు కారణం ఇదేనా? జూన్ 20 2024.. డేవిడ్ జాన్సన్ ఈ లోకాన్ని విడిచివెళ్లాడు. 52 ఏళ్ల జాన్సన్ బెంగళూరులో తాను నివాసం ఉంటున్న అపార్టుమెంట్ బాల్కనీ నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. జాన్సన్‌కు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. జాన్సన్ తన ఇంటికి సమీపంలోనే ఒక క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నాడు.అయితే అకాడమీ సజావుగా నడవకపోవడంతో ఆయన అప్పుల పాలైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. దీంతో గతకొంతకాలంగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్న జాన్సన్.. ఆ క్రమంలోనే ఆత్మహ్యత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. -
1983 World Cup: భారత క్రికెట్ చరిత్రను మార్చేసిన ఆ మ్యాచ్..
"ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఈ ఆరు గంటల తర్వాత మన జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఆటలో గెలుపు ఓటములు సహజం. కానీ గెలిచేందుకు మనం తీవ్రంగా శ్రమించాలి. ఇది మనకు చావో రేవో. ప్రత్యర్ధి ఎవరన్నది మనకు అనవసరం.మనం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. గెలిచిన ఓడినా ఒకేలా ఉండాలి. అంతే తప్ప తర్వాత అనవసర చర్చలు పెట్టుకోవద్దు. ఆల్ ది బెస్ట్ ”.. ఇవీ 1983 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లకు కెప్టెన్ కపిల్ దేవ్ చెప్పిన మాటలు.25 జూన్ 1983.. భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర అవిష్కతృమైంది. అప్పటివరకు పసికూనలుగా ముద్రపడిన భారత జట్టు.. ఆ రోజు ప్రపంచానికి తమ సత్తా ఏమిటో చూపించింది. 1983 వన్డే వరల్డ్‌కప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో ఓటమంటూ ఎరుగని వెస్టిండీస్‌ను ఓడించి తొలి ప్రపంచకప్ టైటిల్‌ను కపిల్ డేవిల్స్ ముద్దాడింది. తొలి వరల్డ్‌కప్‌ను గెలిచి లార్డ్స్ మైదానంలో భారత జెండాను కపిల్ సేన రెపలాపడించింది. ఈ విజయంతో యావత్తు భారత్ గర్వంతో ఉప్పొంగిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కపిల్ దేవ్ పట్టిన క్యాచ్ వరల్డ్‌కప్‌తో పాటు భారత క్రికెట్ చరిత్రను మార్చేసింది.నిప్పులు చేరిగిన విండీస్ బౌలర్లు..అప్పట్లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లకు పెట్టింది పేరు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ తొలుత భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో భారత కెప్టెన్ కపిల్ దేవ్ ఊపిరి పీల్చుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్ధి ముందు భారీ స్కోర్ ఉంచి.. లక్ష్యచేధనలో ఒత్తిడి పెంచాలని కపిల్ భావించాడు.కానీ అక్కడ ఉంది కరేబియన్లు. ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ సునీల్ గవాస్కర్‌ను ఔట్ చేసి విండీస్ బౌలర్లు భారత్‌ను దెబ్బ కొట్టారు. ఆ తర్వాత మరో ఓపెనర్ శ్రీకాంత్, ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన మోహిందర్ అమర్నాథ్ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.శ్రీకాంత్, అమర్నాథ్ కలిసి రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ భారత స్కోర్ 90 పరుగుల వద్ద వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరారు. దీంతో టీమిండియా పతనం మొదలైంది. వరుసగా వికెట్లు కోల్పోయిన భారత జట్టు.. 54.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. శ్రీకాంత్(38), అమర్నాథ్(26) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు.ఆరంభం ఆదుర్స్..ఇక 184 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్ ఊదిపడేస్తుందని అంతా భావించారు. భారత ఓటమితో ఇంటిముఖం పట్టకతప్పదని అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. కానీ భారత బౌలర్లు అద్భుతం చేశారు. భారత పేసర్ బల్వీందర్ సంధు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే విండీస్ ఓపెనర్ గోర్డాన్ గ్రీనిడ్జ్‌ను ఔట్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత మదన్‌లాల్ వరుసగా రెండు వికెట్లు పడగొట్టి విండీస్‌ను బ్యాక్‌ఫుట్‌లో ఉంచాడు. అయితే ఈ సమయంలో దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ మాత్రం భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు.మదన్ లాల్ మ్యాజిక్..మ్యాచ్‌పై భారత పట్టు బిగిస్తున్న సమయంలో రిచర్డ్స్ ఎటాక్ చేయడంతో కెప్టెన్ కపిల్‌దేవ్ ముఖంలో కాస్త టెన్షన్ కన్పించింది. రెండు వికెట్ల పడగొట్టిన మదన్‌లాల్‌ను సైతం రిచర్డ్స్ టార్గెట్ చేశాడు. మదన్‌లాల్ వేసిన ఓ ఓవర్లో రిచర్డ్స్ మూడు ఫోర్లు కొట్టి మ్యాచ్‌ను తమవైపు తిప్పే ప్రయత్నం రిచర్డ్స్ చేశాడు. ఈ క్రమంలో రోజర్ బిన్నీని కపిల్ దేవ్ ఎటాక్‌లోకి తీసుకువచ్చి రిచర్డ్స్ దూకుడును కట్టడి చేయాలని భావించాడు. బిన్నీ పరుగులు రాకుండా ఆపినప్పటికి.. అతడి వికెట్ మాత్రం సాధించలేకపోయాడు. అయితే మళ్లీ మదన్‌లాల్.. కపిల్ దగ్గరకు వచ్చి నేను బౌలింగ్ చేస్తా అని చెప్పాడు.కానీ అంతకుముందు ఓవరే మూడు ఫోర్లు ఇవ్వడంతో కపిల్ దేవ్ మదన్‌లాల్‌ను పక్కన పెట్టాలని అనుకున్నాడు. అయినా సరే మదన్ మాత్రం తనకు ఒక్క ఓవర్ వేసే అవకాశాన్ని ఇవ్వమన్నాడు. అందుకు సరే అని కపిల్ అతడికి మరో ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆ ఓవర్లో మదన్ లాల్ మ్యాజిక్ చేశాడు.కపిల్ సూపర్ క్యాచ్..ఈసారి మాత్రం కెప్టెన్ నమ్మకాన్ని మదన్‌లాల్ వమ్ముచేయలేదు. ఆ ఓవర్లో మదన్ లాల్ అద్భుతం చేశాడు. వీవీ రిచర్డ్స్‌ను ఔట్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అయితే ఈ వికెట్ క్రెడిట్ మదన్ లాల్ కంటే కెప్టెన్ కపిల్ దేవ్కే ఇవ్వాలి. సంచలన క్యాచ్‌తో వీవియన్ను కపిల్ దేవ్ పెవిలియన్‌కు పంపాడు. ఆ ఓవర్లో మూడో బంతిని మదన్ లాల్ రిచర్డ్స్కు షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. అతడు ఆ డెలివరీని హుక్ షాట్ ఆడాలని ప్రయత్నించాడు. కానీ బంతి సరిగ్గా షాట్ కనక్ట్‌కాకపోవడంతో బంతి డీప్ మిడ్ వికెట్ దిశగా గాల్లోకి లేచింది. ఈ సమయంలో మిడ్-ఆన్‌లో ఉన్న కపిల్ దేవ్.. డీప్ మిడ్-వికెట్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు.ఆ క్యాచ్‌తో విండీస్ ఖేల్ ఖతమైంది. వరుసగా వికెట్లు కోల్పోయి 140 పరుగులకే కరేబియన్ జట్టు కుప్పకూలింంది. దీంతో 43 పరుగులతో భారత్ చారిత్రత్మక విజయాన్ని సాధించింది. భారత బౌలర్లలో అమర్ నాథ్, మదన్ లాల్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సంధు రెండు, బిన్నీ ఒక్క వికెట్ సాధించారు. -
#Maidaan: రియల్ హీరో రహీం సాబ్.. స్కూల్ టీచర్ నుంచి కోచ్ దాకా!
స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడూ నిరాశపరచవని ‘మైదాన్’ ద్వారా మరోసారి నిరూపితమైంది. అజయ్ దేవ్‌గణ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో అమిత్ రవీంద్రనాథ్ శర్మ రూపొందించిన ఈ చిత్రానికి మూలం సయ్యద్ అబ్దుల్ రహీం కథ. భారత ఫుట్‌బాల్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు ఆయనది. ఇంతకీ ఎవరాయన? ఆయన స్వస్థలం ఎక్కడ? భారత ఫుట్‌బాల్‌కు ఆయన అందించిన సేవలు ఏమిటి?.. సయ్యద్ అబ్దుల్ రహీం హైదరాబాద్ రాష్ట్రంలో 1909లో జన్మించారు. ఫుట్‌బాల్‌పై చిన్ననాటి నుంచే మక్కువ పెంచుకున్న ఆయన.. ఉపాధ్యాయుడిగా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత ఆటకే పూర్తి సమయం కేటాయించారు. ముప్పై ఏళ్ల వయసులో కమార్ క్లబ్, యూరోపియన్ క్లబ్ తరఫున క్రీడాకారుడిగా రాణించారు. ఇక 1950లో హైదరాబాద్ సిటీ పోలీస్ క్లబ్కోచ్గా మారారు. రహీం సాబ్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన మార్గదర్శనంలో హైదరాబాద్ క్లబ్ మూడు డ్యూరాండ్, ఐదు రోవర్స్ కప్‌లు గెలిచింది. ఈ క్రమంలో భారత జట్టు కోచ్‌గా రహీం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పుష్కరకాలం పాటు జట్టును అత్యుత్తమ స్థాయిలో నిలిపారు. రహీం సాబ్ శిక్షణలో రాటు దేలిన టీమిండయా ప్రతిష్టాత్మక టోర్నీలో విజయాలు సాధించింది. స్వర్ణ యుగం 1951 ఆసియా క్రీడల ఫైనల్లో ఇరాన్‌ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుని గోల్డెన్ రన్ మొదలుపెట్టింది. ఇక 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్ చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. అనూహ్య రీతిలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇదంతా రహీం సాబ్ చలవే అనడంలో సందేహం లేదు. ఇక 1960 రోమ్ ఒలింపిక్స్‌లోనూ భారత జట్టుకు ఆయనే కోచ్‌గా వ్యవహరించారు. రహీం గైడెన్స్‌లోనే 1962 ఆసియా క్రీడల్లో భారత్ మరోసారి పసిడి పతకం సాధించింది. పీకే బెనర్జీ, చునీ గోస్వామి, పీటర్ తంగరాజ్ వంటి నైపుణ్యాలున్న ఆటగాళ్లను గుర్తించి వారిని మెరికల్లా తీర్చిదిద్దడంతో రహీం సాబ్ది కీలక పాత్ర. తన హయాంలో భారత ఫుట్‌బాల్ రూపురేఖలనే మార్చివేసిన రహీం.. ఇండియాను ‘బ్రెజిల్ ఆఫ్ ఆసియా’గా నీరాజనాలు అందుకునేలా చేశారు. బ్రిటిష్ మూస పద్ధతిలో కాకుండా.. చిన్న చిన్న పాస్‌లతో కొత్త టెక్నిక్‌ను అనుసరించేలా చేసి సత్ఫలితాలు సాధించారు. నిజానికి ఇదే శైలితో బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు 1958, 1962 వరల్డ్‌కప్ టైటిల్స్ గెలిచింది. తనదైన శైలిలో స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసి జట్టులో సరికొత్త ఉత్సాహాన్ని నింపిన రహీం సాబ్ ఉన్నంతకాలం భారత్ ఫుట్‌బాల్ జట్టుకు ‘స్వర్ణ యుగం’లా సాగింది. అయితే, అనూహ్య పరిస్థితుల్లో కోచింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న రహీం సాబ్.. 1963లో కాన్సర్ బారిన పడ్డారు. ఇండియా ఫుట్‌బాల్‌ను కూడా సమాధిలోకి తీసుకుపోయారు అదే ఏడాది జూన్‌లో తుదిశ్వాస విడిచారు. 53 ఏళ్ల వయసులోనే అర్ధంతరంగా ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో భారత్ ఫుట్‌బాల్ జట్టు విజయాలు సాధించిందే లేదు. దీనిని బట్టి చూస్తే.. ‘‘రహీమ్ సాబ్ తనతో పాటు ఇండియా ఫుట్‌బాల్‌ను కూడా సమాధిలోకి తీసుకుపోయారు’’ అంటూ సహచర ఆటగాడు ఆయనకు నివాళి అర్పిస్తూ అన్న మాటలు నూటికి నూరుపాళ్లు నిజం అనిపిస్తుంది. గుర్తింపు దక్కని యోధుడు భారత ఫుట్‌బాల్ జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన రహీం సాబ్‌కు మాత్రం వ్యక్తిగతంగా పెద్దగా మేలు చేకూర్చలేదు. ఆర్థికంగానూ ఆయన పొందిన ప్రయోజనాలు అంతంత మాత్రమే! ఎంతో మందిని మేటి ఫుట్బాలర్లుగా తీర్చిదిద్దిన ఈ గురువును ద్రోణాచార్య అవార్డుతోనైనా సత్కరించకపోయింది ప్రభుత్వం. ఇక రహీం సాబ్ కొడుకు సయ్యద్ షాహిద్ హకీం కూడా తండ్రి బాటలోనే నడిచారు. ఫుట్‌బాల్‌పై ఇష్టం పెంచుకున్న హకీం 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇంకెప్పుడూ ఆయన ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు. మైదాన్ సినిమాతో నేటి తరానికి తెలిసేలా సయ్యద్ అబ్దుల్ రహీం కథను ప్రపంచానికి పరిచయం చేయడంలో నోవీ కపాడియాది కీలక పాత్ర. అయితే, రహీం సాబ్తో పాటు ఆయన కుమారుడు హకీం, నోవీ కూడా ఇప్పుడు మన మధ్య లేకపోవడం విషాదకరం. అయితే, రియల్ హీరో అయిన రహీం మాత్రం అజరామరంగా అభిమానుల గుండెల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. -
ఆట కూడా అసూయ పడే ప్రతిభ.. అదొక్కటే తప్పటడుగు!
‘ఇంత అద్భుతంగా కూడా ఆడొచ్చా’ అని ఆటే అతడిని చూసి అసూయ పడేంత ప్రతిభ. అతడు బరిలో ఉన్నాడంటే టైటిల్ సంగతి దేవుడెరుగు.. కనీసం రన్నరప్గానైనా నిలిస్తే చాలని సహచర ఆటగాళ్లు రెండో స్థానం కోసం పోటీపడే వైనం. నిబంధనలు మారిస్తేనైనా అతడి జోరుకు బ్రేక్ పడుతుందేమోనని ఆటరాని ‘ప్రత్యర్థుల’ ఆశ. ఎవరెంత ఈర్ష్య పడినా తన నైపుణ్యంతో శిఖరాగ్రాన నిలిచాడతడు. తొంభైవ దశకం మలినాళ్ల నుంచి దాదాపు దశాబ్ద కాలానికి పైగా గోల్ఫ్ సామ్రాజ్యాన్ని ఏలిన మకుటం లేని మహారాజు. అతడి పేరు ‘టైగర్ వుడ్స్’. ఆఫ్రికన్ అమెరికన్- థాయ్‌లాండ్ సంతతికి చెందిన ఎర్ల్ డెన్నిసన్- కుల్తిడా దంపతులకు 1975, డిసెంబరు 30న కాలిఫోర్నియాలో ‘ఎల్డ్రిక్ టాంట్ వుడ్స్’గా జన్మించాడు. బాల మేధావి అయిన అతడు చిన్ననాటి నుంచే ఆటపై మక్కువ పెంచుకున్నాడు. రెండేళ్లకే గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. పాల్గొన్న ప్రతి పోటీలోనూ గెలుపొంది.. 19 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ గోల్ఫర్గా మారాడు. ఎనలేని క్రేజ్ సంపాదించి మేటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కీర్తితో పాటు సంపదనూ పెంచుకుంటూ పోయాడు. ముఖ్యంగా 2000 ఏడాదిలో 15 స్ట్రోక్స్ తేడాతో వుడ్స్ యూఎస్ ఓపెన్ గెలవడం అతడి కెరీర్‌తో పాటు గోల్ఫ్ చరిత్రలోనే హైలైట్‌గా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ‘టైగర్ స్లామ్’ అదే విధంగా 2001లో మాస్టర్స్ టైటిల్ గెలిచిన వుడ్స్.. తద్వారా వరుసగా నాలుగు గోల్ఫ్ మేజర్ టోర్నీలు గెలిచిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. మాస్టర్స్, యూఎస్ ఓపెన్, బ్రిటిష్ ఓపెన్, పీజీఏ చాంపియన్‌షిప్ ట్రోఫీలు కైవసం చేసుకుని.. ఇది ‘టైగర్ స్లామ్’ అనేలా గోల్ఫ్ ప్రపంచం ప్రశంసలు అందుకున్నాడు. ఇలా గోల్ఫ్ రారాజుగా పేరొందినా వ్యక్తిగత జీవితంలోని పొరపాట్ల వల్ల వుడ్స్ అపఖ్యాతిని కూడా మూటగట్టుకున్నాడు. అయినా పడిలేచిన కెరటంలా ఆటకు మెరుగులు దిద్దుకుని ప్లేయర్‌గా తన ప్రతిష్టను ఇనుమడింపజేసుకున్నాడు. 15 సార్లు మేజర్ చాంపియన్స్ గెలవడం సహా ఏకంగా 683 వారాల పాటు వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచిన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇంతకీ వుడ్స్ పేరులో టైగర్ ఎలా చేరిందో తెలుసా?.. వుడ్స్ తండ్రి ఓ ఆర్మీ అధికారి. ఆయన వియత్నాం యుద్ధంలో పాల్గొన్నట్లు ఆధారాలు ఉన్నాయి. తండ్రి స్నేహితుడు, వియత్నాం యుద్ధవీరుడు అయిన టైగర్‌కు గౌరవ సూచకంగా తన పేరులో ఆ పదాన్ని జోడించుకుని.. టైగర్ వుడ్స్గా చరిత్రలో ఆ పేరును అజరామరం చేశాడు. భార్యకు క్షమాపణ.. విడాకులు 2001లో స్వీడిష్ గోల్ఫర్ జెస్పెర్ పార్ణెవిక్ ద్వారా పరిచయమైన నోర్డెగ్రెన్ను ప్రేమించిన టైగర్ వుడ్స్.. 2003లో ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ మరుసటి ఏడాది నోర్డెగ్రెన్తో కలిసి పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. ఈ జంటకు కూతురు సామ అలెక్సిస్ వుడ్స్, చార్లీ అక్సెల్ వుడ్స్ సంతానం. అయితే, వుడ్స్ వివాహేతర సంబంధాల కారణంగా విసిగెత్తిపోయిన నోర్డెగ్రెన్ అతడికి విడాకులు ఇచ్చింది. అనంతరం మరో వ్యక్తిని పెళ్లాడింది. నోర్డెగ్రెన్ విషయంలో తప్పుచేశానని ఒప్పుకొన్న టైగర్ వుడ్స్.. ఇప్పటికీ స్నేహితుడిగా కొనసాగుతున్నాడు. చదవండి: #MSDhoni: స్వర్ణ యుగం ముగిసింది.. గుండె ముక్కలైంది!.. ఆ ఊహే కష్టంగా ఉంది.. One of the greatest golf shots of our generation pic.twitter.com/ENLGXX1JPN — Historic Vids (@historyinmemes) March 18, 2024 -
Ronaldo Jr: మెస్సీ అంటే ఇష్టం! బాగానే ఉన్నావా.. ముద్దిచ్చి మరీ!
క్రిస్టియానో రొనాల్డో.. పోర్చుగల్ ఫుట్‌బాల్ చరిత్రలో సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్న మేటి ఆటగాడు. అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి గోల్స్.. ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక బాలన్ డి ఓర్ అవార్డులు. ఎన్నో చాంపియన్ లీగ్ మెడల్స్! మూడు దేశాల్లో క్లబ్ టైటిల్స్ గెలిచిన ఫుట్‌బాలర్..అయితే, ఒక్కసారైనా ప్రపంచకప్ గెలవాలన్న రొనాల్డో కల మాత్రం నెరవేరలేదు. సమకాలీకుడు, తనకు పోటీగా ఉన్న ఏకైక ఆటగాడు, అర్జెంటీనా లియోనల్ మెస్సీ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడుతుంటే చూస్తూ భావోద్వేగానికి గురికావడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడీ పోర్చుగల్ స్టార్. ఒకరకంగా మెస్సీతో జరిగిన పోటాపోటీలో తాను ఓడిపోయాననే బాధతోనే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఆట పరంగా రొనాల్డో, మెస్సీల మధ్య స్నేహపూర్వక శత్రుత్వం ఉన్నా.. బయట మాత్రం వారిద్దరు గుడ్ ఫ్రెండ్స్! బాలన్ డి ఓర్ అవార్డు-2017 ఫంక్షన్ సందర్భంగా రొనాల్డో తల్లి డొలోర్స్ అవెరో ఈ విషయాన్ని వెల్లడించారు. మెస్సీ ఉన్నత వ్యక్తిత్వం కలవాడని పేర్కొంటూ.. తన మనవడు క్రిస్టియానో రొనాల్డో జూనియర్‌కు తండ్రి ఆట కంటే మెస్సీ ఆట అంటేనే ఎక్కువ ఇష్టం అని తెలిపారు. అందుకు తగ్గట్లుగానే జూనియర్ రొనాల్డో ఆ వేదికపై మెస్సీని చూడగానే ఆనందంతో పొంగిపోయాడు. అయితే, అక్కడున్నది నిజంగా మెస్సీ కాదనే భావనలో ఉన్న జూనియర్ తన తండ్రి చెప్పినా ఆ విషయాన్ని నమ్మలేకపోయాడు. రొనాల్డో తన కుమారుడికి మెస్సీని చూపిస్తూ.. ‘‘అక్కడున్నది ఎవరు? అక్కడ సూట్ వేసుకుని నిల్చుని ఉన్న వ్యక్తి ఎవరు?’’ అని ప్రశ్నించాడు. అంతలోనే మెస్సీ వచ్చి జూనియర్ రొనాల్డోను హగ్ చేసుకుని.. ముద్దు కూడా పెట్టి.. ‘‘నువ్వ బాగానే ఉన్నావు కదా?’’ అని ఆప్యాయంగా పలకరించాడు. When Cristiano Jr. meets Lionel Messi. pic.twitter.com/ydixmN2SyK — Historic Vids (@historyinmemes) March 3, 2024 తాను చూస్తున్నది నిజమని అప్పటికీ నమ్మలేకపోయిన జూనియర్ రొనాల్డోను తండ్రి మళ్లీ దగ్గరకు తీసుకోగా.. మెస్సీ సైతం చిరునవ్వులు చిందించాడు. ఈ ఘటన జరిగినపుడు జూనియర్ రొనాల్డోకు సుమారుగా ఆరేళ్ల వయసు ఉంటుంది. ఇక తండ్రిని కాదని.. మెస్సీనే తన రోల్‌మోడల్ అని చెప్పిన ఆ పిల్లాడు ఇప్పుడు ఓ జట్టును చాంపియన్‌గా నిలిపే స్థాయికి చేరాడు. అండర్ 13 లీగ్ ట్రోఫీలో అల్ నసర్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి ట్రోఫీని ముద్దాడాడు. ఈ నేపథ్యంలో రొనాల్డో- మెస్సీ అనుబంధం... జూనియర్ రొనాల్డో టైటిల్ విన్నింగ్ మూమెంట్స్‌కు సంబంధించిన క్షణాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మీరూ ఓ లుక్కేయండి! View this post on Instagram A post shared by 433 (@433) -
7 డాలర్లే ఉన్నాయి.. ఏకంగా ఇంటినే ఇచ్చేశాడు! దయలోనూ కింగే!
డ్వేన్ డగ్లస్ జాన్సన్ అంటే గుర్తుపట్టకపోవచ్చేమో గానీ.. ‘ది రాక్’ అనగానే చాలా మందికి అతడి రూపం కళ్ల ముందు కదలాడుతుంది. ప్రొఫెషనల్ రెజ్లర్‌గా.. హాలీవుడ్ స్టార్‌గా అతడు సాధించిన.. సాధిస్తున్న విజయాలు స్ఫురణకు వస్తాయి. ఏకంగా ఎనిమిదిసార్లు వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ చాంపియన్‌గా నిలిచిన ఘనత డ్వేన్ జాన్సన్ సొంతం. హాలీవుడ్‌లోనూ తన నటనతో స్టార్‌గా తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడతడు! కఠిన సవాళ్లను దాటుకుని కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో మే 2, 1972లో జన్మించాడు డ్వేన్ జాన్సన్. అతడి తల్లిండ్రులు అటా జాన్సన్, రాకీ జాన్సన్. రాకీ ప్రొఫెషన్ రెజ్లర్. తండ్రిని చూసి చిన్ననాటి నుంచే రెజ్లింగ్‌పై ఇష్టం పెంచుకున్నాడు డ్వేన్. డబ్ల్యుడబ్ల్యుఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించిన తండ్రి, తాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తానూ రెజ్లర్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు. అయితే, తండ్రి సంపాదనలో నిలకడ లేకపోవడంతో చిన్నతనం నుంచే ఆర్థికంగా కష్టాలు చవిచూశాడు. అద్దె కట్టలేని కారణంగా ఎన్నోసార్లు ఇళ్లు మారాల్సి వచ్చేది. This man @TheAnswerMMA is a very special human being. Themba is committed to three things: His family, his village and people in Africa, and becoming world champion in the @ufc. What an inspiration he is. Rooting for him all the way. ❤️ https://t.co/ZOOfOZLka4 — Dwayne Johnson (@TheRock) February 28, 2024 ఫలితంగా అప్పటికి రెజ్లర్‌గా మారాలన్న కలకు విరామం ఇచ్చాడు. స్కూళ్లో చదువుతున్న సమయంలో ఫుట్‌బాల్ కోచ్ డ్వేన్లో దాగిన ప్రతిభను గుర్తించి అవకాశమిచ్చాడు. క్రమక్రమంగా స్టార్ ఫుట్‌బాలర్‌గా పేరొంది పెద్ద క్లబ్బులకు ఆడే అవకాశాలు వచ్చినా గాయాల కారణంగా చేజారిపోయేవి. దీంతో మళ్లీ కథ మొదటికే వచ్చేది. అలాంటి సమయంలో అనూహ్యంగా ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో అడుగుపెట్టాడు డ్వేన్ జాన్సన్. ఆరంభంలో తండ్రి, తాత పేరు కలిసి వచ్చేలా రాకీ మైవియా పేరుతో బరిలోకి దిగాడు. ఈ క్రమంలో కఠిన సవాళ్లు ఎదుర్కొని తనకంటూ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుని ‘ది రాక్’గా ఎదిగాడు. డబ్ల్యుడబ్ల్యుఈ సూపర్‌స్టార్‌గా క్రేజ్ సంపాదించాడు. అంతటితో సంతృప్తి చెందక హాలీవుడ్లో నటుడిగా అదృష్టం పరీక్షించుకుని అక్కడా విజయవంతమయ్యాడు డ్వేన్ జాన్సన్. రెజ్లింగ్‌లోనే కాదు.. దయచూపడంలోనూ రాజే! ఇతరులకు సాయం చేయడంలోనూ తాను ముందే ఉంటానని నిరూపించాడు డ్వేన్ జాన్సెన్. అమెరికన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌ను ప్రోత్సహించే అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్‌లో రాణించాలనుకుంటున్న ఆఫ్రికన్ వ్యక్తికి అందమైన ఇంటిని బహుమతిగా ఇచ్చాడు. తన అకౌంట్లో కేవలం ఏడు డాలర్లే ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన అతడిని సర్ప్రైజ్ చేశాడు. ‘‘ఇతడు ఎంతో ప్రత్యేకమైన మనిషి. తెంబా జీవితంలో మూడు అత్యంత ముఖ్యమైనవి. తన కుటుంబం, సౌతాఫ్రికాలోని తన గ్రామం, అక్కడి ప్రజలు.. ఇంకా యూఎఫ్‌సీలో వరల్డ్ చాంపియన్ కావడం. ఎంతో మందికి తను స్ఫూర్తి’’ అంటూ సదరు వ్యక్తిని ప్రశంసించిన డ్వేన్ జాన్సెన్.. అతడికి ఇంటి తాళాలు అందించిన వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. తెంబా అంకితభావానికి ఫిదా అయి మియామిలో ఫుల్ ఫర్నిష్డ్ ఇంటిని కానుకగా అందించాడు. ఈ నేపథ్యంలో డ్వేన్ జాన్సన్ పెద్ద మనసు పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి. The Rock gifted a UFC fighter a house after he tweeted he had $7 in his bank account pic.twitter.com/osT5Ve0GXC — Historic Vids (@historyinmemes) February 27, 2024