Manchester United Give Ronaldo Jersey Number 7 To Mason Mount - Sakshi
Sakshi News home page

#ManchesterUnited: ఇంగ్లండ్‌ స్టార్‌కు కళ్లు చెదిరే మొత్తం.. అవి డబ్బులా ఇంకేమైనా!

Published Thu, Jul 6 2023 2:31 PM | Last Updated on Thu, Jul 6 2023 3:09 PM

Mason Mount-Huge Amount-Manchester United Give C-Ronaldo Number-7 To-Him - Sakshi

ఫుట్‌బాల్‌లో జెర్సీ నెంబర్‌-7 అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో. ప్రస్తుత తరంలో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్స్‌లో రొనాల్డో  ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ కలిగిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. కాగా ఫుట్‌బాల్‌ జెర్సీ నెంబర్‌ 10కు ఎంత క్రేజ్‌ ఉందో.. ఏడో నెంబర్‌కు కూడా అంతే.

రొనాల్డో కంటే ముందు ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ డేవిడ్‌ బెక్‌హమ్‌ మాత్రమే ఏడు నెంబర్‌ జెర్సీ ధరించాడు. తాజాగా బుధవారం చెల్సియా క్లబ్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ మాసన్‌ మౌంట్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌కు సంతకం చేశాడు. అతని ధర తెలిస్తే మైండ్‌ బ్లాక్‌ అవ్వడం ఖాయం. ఏకంగా 55 మిలియన్‌ పౌండ్స్‌(ఇండియన్‌ కరెన్సీలో దాదాపు రూ. 577 కోట్ల పైమాటే). కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడయిన మాసన్‌ మౌంట్‌కు రొనాల్డో జెర్సీ నెంబర్‌ (7)ను మాంచెస్టర్‌ యునైటెడ్‌ గిఫ్ట్‌గా అందించింది. ఇకపై మాసన్‌ మౌంట్‌ మాంచెస్టర్‌ క్లబ్‌ తరపున ఏడో నెంబర్‌ జెర్సీతో బరిలోకి దిగనున్నాడు.  

ఇక మాసన్‌ మౌంట్ చెల్సియాతో తన సీనియర్‌ ఫుట్‌బాల్‌  క్లబ్ కెరీర్‌ను ప్రారంభించాడు. 2017-19 మధ్య విటెస్సే, డెర్బీ కౌంటీ తరపున ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం చెల్సియాకు తిరిగి వచ్చిన మాసన్‌ మౌంట్‌ నిలకడైన ఆటతీరుతో స్టార్‌ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.  అంతర్జాతీయంగా ఇంగ్లండ్‌ తరపున UEFA ఛాంపియన్స్ లీగ్ , UEFA సూపర్ కప్ ,2021లో FIFA ప్రపంచకప్‌లో ప్రాతినిధ్యం వహించాడు. 2020–21, 2021–22 సీజన్‌లలో మాసన్‌ మౌంట్‌ చెల్సియా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.

చదవండి: విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా

#SlapKabaddi: పాకిస్తాన్‌ను షేక్‌ చేస్తున్న 'స్లాప్‌' కబడ్డీ.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement