Chelsea Club
-
ఇంగ్లండ్ స్టార్‌కు కళ్లు చెదిరే మొత్తం.. అవి డబ్బులా ఇంకేమైనా!
ఫుట్‌బాల్‌లో జెర్సీ నెంబర్-7 అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. ప్రస్తుత తరంలో ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్స్‌లో రొనాల్డో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. కాగా ఫుట్‌బాల్ జెర్సీ నెంబర్ 10కు ఎంత క్రేజ్ ఉందో.. ఏడో నెంబర్‌కు కూడా అంతే. రొనాల్డో కంటే ముందు ఇంగ్లండ్ ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హమ్ మాత్రమే ఏడు నెంబర్ జెర్సీ ధరించాడు. తాజాగా బుధవారం చెల్సియా క్లబ్ ఫుట్‌బాల్ స్టార్ మాసన్ మౌంట్ మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు సంతకం చేశాడు. అతని ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఏకంగా 55 మిలియన్ పౌండ్స్(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 577 కోట్ల పైమాటే). కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడయిన మాసన్ మౌంట్‌కు రొనాల్డో జెర్సీ నెంబర్ (7)ను మాంచెస్టర్ యునైటెడ్ గిఫ్ట్‌గా అందించింది. ఇకపై మాసన్ మౌంట్ మాంచెస్టర్ క్లబ్ తరపున ఏడో నెంబర్ జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. ఇక మాసన్ మౌంట్ చెల్సియాతో తన సీనియర్ ఫుట్‌బాల్ క్లబ్ కెరీర్‌ను ప్రారంభించాడు. 2017-19 మధ్య విటెస్సే, డెర్బీ కౌంటీ తరపున ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం చెల్సియాకు తిరిగి వచ్చిన మాసన్ మౌంట్ నిలకడైన ఆటతీరుతో స్టార్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయంగా ఇంగ్లండ్ తరపున UEFA ఛాంపియన్స్ లీగ్ , UEFA సూపర్ కప్ ,2021లో FIFA ప్రపంచకప్‌లో ప్రాతినిధ్యం వహించాడు. 2020–21, 2021–22 సీజన్లలో మాసన్ మౌంట్ చెల్సియా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. It's time to write a new chapter. #️⃣7️⃣ Mount 🔴#MUFC — Manchester United (@ManUtd) July 5, 2023 చదవండి: విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా #SlapKabaddi: పాకిస్తాన్‌ను షేక్ చేస్తున్న 'స్లాప్' కబడ్డీ.. వీడియో వైరల్ -
పుతిన్‌తో సంబంధాలు.. ఆస్తులు అమ్ముకుంటున్న రష్యన్ బిలియనీర్లు
ప్రపంచం మొత్తం వారిస్తున్న వినకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దాడికి దిగాడు. దీంతో అతనికి దగ్గరి వారిగా పేరొందిన అందరినీ టార్గెట్ చేస్తున్నాయి వెస్ట్రన్ కంట్రీస్. ముఖ్యంగా రష్యన్ బిలియనీర్లు పుతిన్‌తో ఉన్న సంబంధాల కారణంగా చిక్కుల్లో పడుతున్నారు. ఇంగ్లండ్ దేశంలో ఫుట్‌బాల్ ఆటకు ఎనలేని క్రేజ్ ఉంది. అక్కడ క్లబ్ స్థాయిల్లో జరిగే లీగ్‌లకు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ స్థాయిలో హడావుడి ఉంటుంది. ప్రతీ క్లబ్‌కి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉంటారు. ఇలా ఫుల్ క్రేజ్ ఉన్న ఫుట్‌బాల్ క్లబ్స్‌లో చెల్సియా ఒకటి. లండన్‌లో ఈ క్లబ్‌ని 1905లో నెలకొల్పారు. ఈ క్లబ్‌ని రష్యాకి చెందిన అబ్రామోవిచ్ అనే బిలియనీర్ 2003లో కొనుగోలు చేశాడు. అబ్రామోవిచ్ చేతికి వెళ్లిన తర్వాత ఈ క్లబ్ జాతకం మారిపోయింది. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ క్లబ్లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. 19 ఏళ్ల కాలంలో అనేక లీగుల్లో సత్తా చాటింది. 19 ట్రోఫీలను గెలుచుకుంది. క్లబ్‌ను విజయ ప్రస్థానంలో నడిపించడంలో దాని ఓనర్ రష్యన్ బిలియనీర్ అబ్రామోవిచ్ మనసు పెట్టి పని చేశారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా ఏకపక్ష దాడులను నాటో సభ్య దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, యూకేలు రష్యాపై గరంగరంగా ఉన్నాయి. వరుస పెట్టి రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నారు. తమ దేశంలో ఉన్న రష్యన్ దేశస్థుల ఖాతాలను స్థంభింపజేస్తున్నారు. పలు బ్యాంకులు రష్యన్ సంస్థలకు సంబంధించిన లావాదేవీలు ఆపేస్తున్నాయి. రష్యా దాడితో ఒక్కసారిగా ఆ దేశ బిలియనీర్లు జాతకం మారిపోయింది. వారి బ్యాంకు ఖాతాలు పని చేయడం లేదు. ముఖ్యంగా పుతిన్‌కి దగ్గర వాడిగా పేరున్న అబ్రామోవిచ్పై కఠిన చర్యలకు యూకే అథారిటీలు రెడీ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో చెల్సియా క్లబ్‌ను విజయవంతంగా నడిపించడం కష్టమని అబ్రమోవిచ్ భావించారు. దీంతో చెల్సియా క్లబ్‌ని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆర్థిక సమస్యలు, ఆంక్షల ప్రభావం చెల్సియాపై పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, రష్యా దాడుల ప్రభావంతో ఒక్క సారిగా పరిస్థితులు మారిపోయాయని అబ్రామోవిచ్ అంటున్నారు. తాజా నిర్ణయం మనసుకు ఎంతో కష్టంగా ఉన్నా తప్పడం లేదంటూ వాపోతున్నారు. రష్యా అధ్యక్షుడికి సన్నిహంతా మెలుగుతూ ఇంత కాలం ప్రభను అనుభవించిన బిలియనీర్లు ఇప్పుడు కష్టాలు ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం స్పెయిన్‌లో రష్యాకు చెందిన ఆయుధాల సరఫరా వ్యాపారికి చెందిన రూ. 59 కోట్ల విలువైన అధునాతన యాచ్‌ని అందులో పని చేసే సిబ్బంది సముద్రంలో ముంచి వేసేందుకు ప్రయత్నించారు. రష్యా దాడులకు నిరసనగా ఆ యాచ్ మెయింటనెన్స్ పనులు చూస్తున్న ఉక్రెయిన్ ఇంజనీరు ఈ పని చేసినట్టు దర్యాప్తులో తేలింది. మొత్తంగా రష్యన్ బిలియనీర్లు ప్రపంచ వ్యాప్తంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. -
టైటిల్‌పై కాదు... మ్యాచ్‌లపైనే మా దృష్టి
గ్యారీ కాహిల్ ఇంటర్వూ్య చెల్సీ క్లబ్ కొత్త కెప్టెన్ గ్యారీ కాహిల్. 2012 నుంచి చెల్సీ చరిత్రలో భాగమైన అతను ఇప్పుడు ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. ఈపీఎల్ సహా ఎఫ్ఏ కప్, చాంపియన్స్ లీగ్, యూరోపా లీగ్ ట్రోఫీలు గెలుపొందడంలో కీలకపాత్ర పోషించిన గ్యారీ ఇప్పుడు మరో టైటిల్‌పై కన్నేశాడు. ఈ నేపథ్యంలో అతను మాట్లాడుతూ ఉన్నపళంగా టైటిల్‌పై కాకుండా ముందుగా ఒక్కో మ్యాచ్‌పైనే తమ ఫోకస్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమన్నాడంటే... లీగ్ పాయింట్ల పట్టికలో ముందంజలో ఉన్న మీరు లివర్‌పూల్‌పై గెలిచి ఆధిక్యాన్ని చాటుకుంటారా? అవును. ప్రస్తుత లక్ష్యమదే. మాకు ఈ మ్యాచ్‌కు ముందు చాలా విశ్రాంతి లభించింది. దీంతో తదుపరి మ్యాచ్‌లపై దృష్టి కేంద్రీకరించేందుకు సరైన సమయం దొరికింది. లివర్‌పూల్‌తో మ్యాచ్ తర్వాత సొంతగడ్డపై అర్సెనల్‌తో ఆడాల్సి ఉంది. దీంతో మాకు ఈ వారం చాలా కీలకమైంది. ఇప్పటికే రేసులో ఉన్న మీరు టైటిల్‌పై ఆశలుపెట్టుకున్నారా? ఇప్పుడైతే మీరే ఈ టోర్నీలో పెద్ద ఫేవరెట్ కదా? అలా ఆలోచించడం తొందరపాటు అవుతుంది. ఇప్పటికిప్పుడు మేం గ్రౌండ్లో మ్యాచ్‌లపైనే ఫోకస్ పెట్టాం తప్ప టైటిల్‌పై కాదు. మైదానంలో చెమటోడ్చడం ఆశించిన ఫలితాన్ని సాధించడమే మా ముందున్న లక్ష్యాలు. ముఖ్యంగా లివర్‌పూల్‌తో మ్యాచ్ అంత ఆషామాషీ కాదు. గట్టిపోటీ తప్పదనే అనుకుంటున్నా. మాకు గతంలో అక్కడ పెను సవాళ్లే ఎదురయ్యాయి. గతవారం లివర్‌పూల్... స్వాన్సీ చేతిలో ఓడింది. మాంచెస్టర్, స్పర్స్ మ్యాచ్ డ్రా అయింది. ఇలాంటి తరుణంలో మీరి మ్యాచ్ గెలిస్తే మీకు తిరుగే లేదేమో? నిజమే. ఇలాంటి ఫలితాలు జట్టుకు కలిసొస్తాయి. వీటిని అనుకూలంగా మలుచుకొని పైచేయి కొనసాగిస్తే చెప్పేదేముంటుంది. అయితే ఇది ఒక వారంతో ముగిసే ప్రక్రియ కాదు. నెలలకొద్దీ సాగే ఈ టోర్నీలో ఏవైనా జరగొచ్చు. మంచి ఫలితాలొస్తే ఎవరికైనా సంతోషమే. ఇది ఇలాగే కొనసాగాలని మాత్రం ఆశిద్దాం. మాజీ సారథి జాన్ టెర్రీ వారసుడిగా జట్టు పగ్గాలు చేపట్టిన మీరు బాధ్యతలకు సిద్ధమేనా? ఇలాంటి మేటి జట్టుకు కెప్టెన్ కావడం గర్వంగా ఉంది. కొన్నేళ్ల పాటు జాన్ టెర్రీ జట్టు కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు ఫిట్నెస్ సమస్యలతో జట్టుకు దూరమయ్యాడు. అతని వారసుడిగా జట్టును సమర్థంగా నడిపిస్తాననే విశ్వాసంతో ఉన్నాను.