Interesting Facts How Much Virat Kohli Earns Per-Instagram Post - Sakshi
Sakshi News home page

Virat Kohli: ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 'కింగే'.. ఒక్క పోస్టుకు ఎంత సంపాదిస్తున్నాడంటే?

Published Fri, Jul 22 2022 7:44 PM | Last Updated on Fri, Jul 22 2022 8:42 PM

Intresting Facts How Much Virat Kohli Earns Per-Instagram Post - Sakshi

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి ఫామ్‌ కోల్పోయి సతమతమవుతున్న సంగతి తెలిసిందే. కనీసం 50 పరుగులు చేయడానికి కూడా నానా తంటాలు పడుతున్న కోహ్లిని రెస్ట్‌ పేరుతో బీసీసీఐ విండీస్‌ టూర్‌కు పక్కనబెట్టింది. కోహ్లి 71వ శతకం కోసం అభిమానులు దాదాపు నాలుగేళ్లుగా కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తూనే ఉన్నారు. పరుగుల యంత్రంగా పేరు పొందిన కోహ్లి ప్రస్తుతం ఆటలో మెరవకున్నా.. సోషల్‌ మీడియాలో మాత్రం దుమ్మురేపుతున్నాడు.

కెప్టెన్సీతో పాటే ఫామ్‌ కూడా కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో క్రేజ్‌ మాములుగా లేదు. బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్, ఎండార్స్‌మెంట్స్ ద్వారానే గాక సోషల్ మీడియా ద్వారా కూడా కోట్లల్లో సంపాదిస్తున్నాడు. తాజాగా  హోపర్క్‌ డాట్‌కామ్‌(hopperhq.com) చేపట్టిన సర్వేలో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న జాబితాలో ఆసియా ఖండం నుంచి కోహ్లి తొలి స్థానంలో నిలిచాడు. ఆటలో కింగ్‌ అని పేరున్న కోహ్లి ఇన్‌స్టాలోనూ కింగ్‌గా మారిపోయాడని దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇక కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ఒక్క పోస్టుకు సంపాదిస్తున్న మొత్తం ($1,088,000) అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ. 8 కోట్ల 69 లక్షలు. ఇక కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్ లో 20 కోట్ల (200,703,169)కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే కోహ్లీ పెట్టే ఒక్క పోస్టు వాళ్లందరికీ చేరాల్సిందే. వాళ్ల నుంచి ఇతరులకు షేర్ అవుతుంది. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ కూడా కోహ్లి డబ్బులు బాగానే మూటజెప్పుతుంది. 

ఇన్‌స్టాగ్రామ్ లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్నవారి జాబితాలో కోహ్లీ 14వ స్థానంలో ఉన్నాడు. అదీగాక ఈ జాబితాలో టాప్-25లో ఉన్న సెలబ్రిటీలలో ఆసియా ఖండం నుంచి కోహ్లీ ఒక్కడే ఉండటం గమనార్హం.  ఈ జాబితాలో ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో 44 కోట్ల (442,267,575) ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.  రొనాల్డో పెట్టే ఒక్క పోస్టుకు $2,397,000 పొందుతున్నాడు. అంటే కోహ్లీ కంటే రెండింతలు (సుమారుగా 18 కోట్లు)  ఎక్కువ.  మరో ఫుట్‌బాల్‌ స్టార్ లియోనల్ మెస్సీ కూడా ఒక్క పోస్టు ద్వారా $1,777,000 ఆదాయం పొందుతున్నట్లు సర్వేలో తేలింది.

చదవండి: బీసీసీఐ కొత్త పంథా.. ఆటగాళ్లకే కాదు అంపైర్లకు ప్రమోషన్‌

సరిగ్గా ఇదే రోజు.. విండీస్‌ గడ్డ మీద కోహ్లి డబుల్‌ సెంచరీ! అరుదైన రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement