
పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గోల్ కొట్టినప్పుడల్లా ఒక సిగ్నేచర్ స్టెప్ ఇస్తూ ఉంటాడు. అదే 'సుయ్'(Siii) అనే సెలబ్రేషన్. సుయ్ సెలబ్రేషన్ ఎలా ఉంటుందంటే.. గోల్ కొట్టిన తర్వాత గాల్లోకి ఎగిరి ఆ తర్వాత వెనక్కి తిరిగి సుయ్ అని అరవడమే. అయితే ఒకరి సిగ్నేచర్ స్టెప్‌ను కాఫీ కొట్టాలని ప్రయత్నిస్తే కొన్నిసార్లు సక్సెస్ అవుతారు.. మరికొన్నిసార్లు విఫలమవుతారు. సక్సెస్ అయితే పర్వాలేదు.. కానీ విఫలమైతే నవ్వుల పాలవ్వడం ఖాయం.
తాజాగా ఒక వ్యక్తికి అలాగే జరిగింది. రొనాల్డోకు వీరాభిమాని అయిన ఆ వ్యక్తి అతని సుయ్ సెలబ్రేషన్‌ను అనుకరిద్దామనుకున్నాడు.. కానీ కట్‌చేస్తే ఇప్పుడు ఆస్పత్రి బెడ్‌పై పేషెంట్‌లా పడి ఉన్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఎంత అభిమానం ఉన్నా మనకు రానిది ప్రయత్నించి లేని కష్టాలను కొనితెచ్చుకోవడం వంటిదే.
విషయంలోకి వెళితే.. ఒక ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా రొనాల్డో అభిమాని బంతిని గోల్‌పోస్ట్‌కు తరలించాడు. ఆ తర్వాత రొనాల్డోను ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పట్టుజారిన అతను కిందపడ్డాడు. అయితే బరువంతా అతని ఎడమ కాలుపై పడడంతో లేవడానికి ఇబ్బంది పడ్డాడు. ఇది గమనించిన తోటి మిత్రులు ఆసుపత్రికి తరలించి మెడికల్ ట్రీట్‌మెంట్ ఇప్పించారు. ట్రీట్‌మెంట్ తర్వాత ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఆ వ్యక్తి చేతిలో ఫిజ్జా, బీర్ కనిపించడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక క్రిస్టియానో రొనాల్డో తన ట్రేడ్‌మార్క్ సుయ్ అనే పదాన్ని 2013లో చెల్సియాతో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి ఉపయోగించాడు. అప్పటినుంచి రొనాల్డో సుయ్ సెలబ్రేషన్ బాగా పాపులర్ అయింది. కొంతకాలం క్రితం టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కూడా రొనాల్డో సుయ్ సెలబ్రేషన్ చేయడం అప్పట్లో వైరల్‌గా మారింది.
The Siuuuu is not for everyone 😅 pic.twitter.com/YGFttQe1um
— Joga Bonito (@ufcfooty) September 29, 2022
Comments
Please login to add a commentAdd a comment