Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి.. ఆటలోనే కాదు సోషల్ మీడియాలోనూ రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 76 సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లికి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఓ రేంజ్ ఆదాయం
అందరు సెలబ్రిటీల మాదిరే.. ఫ్యాన్స్‌తో అనుసంధానమయ్యేందుకు వీలుగా కింగ్.. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటున్నాడు. మరి మిగతా వాళ్లకంటే వందల రెట్లలో ఫాలోవర్లు కలిగి ఉన్న కోహ్లికి ఈ మీడియాల ద్వారా కూడా వచ్చే ఆదాయం కూడా అదే రేంజ్‌లో ఉంది.
వ్యక్తిగత పోస్టులతో పాటు
వ్యక్తిగత అప్‌డేట్లతో అభిమానులను అలరించే ఈ స్టార్ బ్యాటర్‌కు యాడ్స్ ద్వారా ఒక్కో పోస్టుకు సమకూరుతున్న మొత్తం తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే! రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో 256 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో అతడు షేర్ చేసే ఒక్కో పోస్టుకు పదకొండున్నర కోట్ల మేర ఆదాయం లభిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
నిజంగా షాకింగ్‌గా ఉంది
ఈ విషయం గురించి హోపర్ హెచ్‌క్యూ కో- ఫౌండర్ మైక్ బండార్ మాట్లాడుతూ.. ‘‘ఏడాదికేడాది ఈ రేంజ్‌లో ఒక్కో పోస్టుకు ఆదాయం పెరుగుతూ ఉండటం షాకింగ్‌గా ఉంది. ముఖ్యంగా స్పోర్ట్స్ స్టార్స్ మిగతా వాళ్లకు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. రొనాల్డో, మెస్సీలు మాత్రమే కాదు.. సామాన్యులను కూడా కోటీశ్వరులను చేసేందుకు సోషల్ మీడియా ఉపయోపడటం విశేషం’’అని పేర్కొన్నారు.
ఇక రొనాల్డో, మెస్సీ
కాగా ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టా ద్వారా ఒక పోస్టుకు అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న వ్యక్తుల జాబితాలో కోహ్లి 20వ స్థానం(ఇండియాలో నంబర్ 1)లో ఉన్నాడు. ఇక ఫుట్‌బాల్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ వరుసగా ఒక్కో పోస్టుకు రూ. 26.75 కోట్లు, 21.49 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ టాప్-2లో కొనసాగుతున్నారు.
చదవండి: అయ్యో.. అంబటి రాయుడులాగే అతడి కెరీర్ కూడా అర్ధంతరంగానే! తిరిగి వస్తే అంతే!
Comments
Please login to add a commentAdd a comment