
రన్ మెషీన్ విరాట్ కోహ్లికి సోషల్‌మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి మాధ్యమాల్లో కోట్ల సంఖ్యలో ఫాలోవర్లు కలిగిన అతను.. వీటి ద్వారా అదే స్థాయిలో ధనార్జన కూడా చేస్తున్నాడు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కోహ్లి సంపాదిస్తున్నదెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ఒక్కో పోస్ట్‌కు దాదాపు 9 కోట్ల రూపాయలు అర్జిస్తున్నాడంటే నమ్మితీరాల్సిందే.
Virat Kohli at No.3 in the world. He was the 3rd highest earning celebrity in 2021 on Instagram. He had earned 302.47 Crores. pic.twitter.com/CVce5YbE1D
— CricketMAN2 (@ImTanujSingh) October 15, 2022
తాజాగా అతను ఇన్‌స్టా ద్వారా అత్యధికంగా సంపాదించే సెలబ్రిటీల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. 2021లో ఇన్‌స్టా ద్వారా అతను 36.6 మిలియన్ డాలర్లు అర్జించాడు. ఈ జాబితాలో స్టార్ ఫుట్‌బాలర్లు క్రిస్టియానో రొనాల్డో (85.2 మిలియన్ డాలర్లు), లియోనల్ మెస్సీ (71.9) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో 211 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న వారి జాబితాలో అతనిది 14వ స్థానం. ఈ జాబితా టాప్ 25లో ఆసియా ఖండం నుంచి కోహ్లి ఒక్కడే ఉండటం విశేషం.
రొనాల్డో ఒక్క పోస్ట్‌కు 19 కోట్లు..
ఇన్‌స్టాలో 44 కోట్ల మంది ఫాలోవర్లు కలిగిన ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో.. తాను పెట్టే ఒక్కో పోస్ట్ ద్వారా ఏకంగా 19 కోట్లు అర్జిస్తున్నాడు. ఇది కోహ్లి ఒక్కో పోస్ట్ ద్వారా అర్జిస్తున్న సంపాదన కంటే రెండింతలు ఎక్కవ. మరో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ కూడా ఒక్కో పోస్ట్ ద్వారా 15 కోట్లు సంపాదిస్తున్నాడు.